దేశ‌వ్యాప్తంగా ఉన్న మీడియా సంస్థ‌ల‌తో పోల్చుకుంటే.. తెలుగు మీడియా మ‌రింత భ్ర‌ష్టు పోయింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నా యి. క‌రోనా లాక్‌డౌన్ బూచిని చూపించి ఇప్ప‌టికే అనేక మంది ఉద్యోగుల‌ను ఇంటికి పంపించిన సంస్థ‌లు.. ప‌నిచేస్తున్న ఉద్యోగు ల జీతాల్లోనూ పాతిక శాతం కోత పెట్టింది. ఇక‌, వారికి చెల్లించే పీఎఫ్ ఖాతాల నిధుల‌ను కూడా కంపెనీ వాటా మిన‌హాయిస్తోంది. అంటే.. జ‌ర్న‌లిస్టు జీతం నుంచే రెండు వైపుల సొమ్మును జ‌ప్తు చేస్తున్నారు. అదేస‌మ‌యంలో పెట్రోల్ అల‌వెన్సులు ఎత్తేశారు. ఇక‌, జ‌ర్న‌లిస్టుల‌కు క‌రోనా నేప‌థ్యంలో సంస్థ‌లు అందించాల్సిన మాస్కులు, శానిటైజ‌ర్లు ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా అందించ‌డం లేదు.

 

ప్ర‌పంచానికి నీతులు చెప్పే మీడియా ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు సోష‌ల్ మీడియాలో భారీ ఎత్తున క‌థాలు, విమ‌ర్శ‌లు వ‌స్తున్నా.. బేఖాత‌రు చేస్తున్నారు అధిప‌తులు. ఇప్పుడు తాజాగా మ‌రో నిర్ణ‌యం తీసుకున్నారు. అన్ని తెలుగు మీడియాల్లోనూ, ప‌త్రిక‌ల్లోనూ సెల‌వులు పూర్తిగా ర‌ద్దు చేశారు. నిజానికి క‌రోనా స‌మ‌యంలో ఉద్యోగులు అడిగితే వెంట‌నే సెల‌వులు ఇవ్వాల‌ని అత్య‌వ‌స‌ర సేవ‌ల చ‌ట్టం కింద కేంద్ర ప్ర‌భుత్వం చెబుతోంది. మీడియా కూడా అత్య‌వస‌ర విధుల్లోకి వ‌స్తుంద‌ని కూడా పేర్కొంది. 

 

అయితే, రాష్ట్రంలోని తెలుగు మీడియా అధిప‌తులు మాత్రం ఈ చ‌ట్టం గిట్టం మాకు తెలీదు.. మీరు ఆఫీసుకు రాక‌పోతే.. ఆ రోజుకు జీతం క‌ట్ అని ఉద్యోగుల‌కు ప‌రోక్ష హెచ్చ‌రిక‌లు పంపారు. నిజానికి జ‌ర్న‌లిస్టుల‌కు కూడా వారానికి ఒక‌రోజు వీక్లీ ఆఫ్ ఉంటుంది. నెల‌కు సీఎల్ ఉంటుంది. ఇక‌, ఆరోగ్యం బాగోక పోతే వాడుకునేందుకుఎస్ ఎల్ ఉంటుంది. అదేస‌మ‌యంలో ఈఎల్స్ కూడా ఉంటాయి. అయితే, ఇవి నిబంధ‌నల మేర‌కు మాత్ర‌మే. కొన్ని సంస్థ‌లు ఇప్ప‌టికే సాధార‌ణ రోజుల్లోనూ ఈ ఎల్స్‌ను ఎన్‌క్యాష్ చేయ‌డం లేదు. ఎస్ ఎల్‌ను అమ‌లు చేయ‌డం లేదు. మిగిలిన వాటిలో వీక్లీఆఫ్‌, సీఎల్ మాత్ర‌మే అమ‌ల్లో ఉంటున్నాయి. 

 

అయితే, ఇప్పుడు క‌రోనా స‌మ‌యంలో ఈ రెండింటినీ ఎత్తేశారు. సిబ్బందిని బాగా త‌గ్గించిన నేప‌థ్యంలో పేప‌ర్ కానీ, చానెల్ కానీ ఇబ్బంది ప‌డ‌కుండా ఉండేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్నా.. అస‌లు సెల‌వు పెడితే.. జీతం క‌ట్ చేస్తామ‌ని చెప్ప‌డం మాత్రం దారుణ‌మ‌ని జ‌ర్న‌లిస్టు సంఘాల నుంచి వ్య‌క్త మ‌వుతున్న నిర‌స‌న. అయితే, అధిప‌తులు మాత్రం ఉంటే ఉండండి.. లేక‌పోతే పోండి! అనేస్తున్నాయి. మ‌రి ఏం చేస్తారు? చ‌చ్చిన‌ట్టు ఆఫీసుల‌కు అటెండ్ అవుతున్నారు ప్ర‌పంచాన్ని చ‌ద‌విన పాత్రికేయులు..!

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: