ప్ర‌పంచం బాధ‌ప‌డితే.. పాత్రికేయులు క‌న్నీరు పెట్టుకుంటారు. అదేం చిత్ర‌మో కానీ.. పాత్రికేయుల‌కు క‌ష్టం వ‌స్తే.. ఎవ‌రూ మాట్లాడ రేంటి?- ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో కొంద‌రు మేదావులు చేసిన ట్రోల్ ఇది! నిజ‌మే. ప్రపంచంలో ఏ మూల ఏం జ‌రిగినా.. త‌మ భుజాల‌పై మోసుకుని ప్ర‌జ‌ల‌కు అందించే పాత్రికేయులు నేడు ప్ర‌పంచం క‌న్నా ఎక్కువ‌గా క‌రోనా ఎఫెక్ట్ బారిన ప‌డ్డారు. జీతాలు క‌ట్‌.. ఉద్యోగాలు క‌ట్‌.. సెల‌వులు క‌ట్‌.. అల‌వెన్సులు క‌ట్‌.. పీఎఫ్‌లు అటు ఇటు కూడా క‌ట్‌.. ఇలా క‌ట్‌.. క‌ట్ అవుతున్న వేత‌నా లు, ఉద్యోగాలతో వారు క‌ట‌క‌ట‌లాడిపోతున్నారు. వారి జీవితాలు స‌మ‌స్య‌లతో కిట‌కిట‌లాడుతున్నాయి.

 

మ‌రి ఇదే స‌మ‌స్య ఏ కార్మికుల‌కో వ‌స్తే.. ఎర్ర జెండాలు లేస్తాయి.. మీడియా గొట్టాలు ద‌డ‌ద‌డ‌లాడ‌తాయి అప్పుడు కూడా మీడి యానే హైలెట్ చేస్తుంది.కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు సంధిస్తాయి. టూల్ డౌన్‌లు వర్క్ డౌన్‌లు చేస్తాయి. స‌మ్మె ల‌కు పిలుపు నిస్తాయి. కార్మిక సంఘాల నాయ‌కులు రంగంలోకి దిగుతారు. ప్ర‌భుత్వాల‌తో మాట్లాడ‌తారు. యాజ‌మాన్యాల‌తో చ‌ర్చిస్తారు. మొత్తంగా కార్మికుల స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ల‌భించే వ‌ర‌కు పోరాటం చేస్తారు. 

 

మ‌రి ఇప్పుడు పాత్రికేయుల విష‌యంలో ఇలా సంఘాలు లేవా ?  వారు మాట్లాడ‌డం లేదా?  అంటే.. సంఘాలు ఉన్నాయి. నాయ‌కులు లెక్క‌కు మిక్కిలిగా మండ‌లానికో నేత ఉన్నారు. మ‌న రాష్ట్రం విష‌యానికి వ‌స్తే.. ఏపీడ‌బ్ల్యూ జేఎఫ్‌, ఏపీ జేఎఫ్‌, డ‌బ్ల్యుజేయూ వంటి ప‌లు సంఘాలు ఉన్నాయి. ఇక‌, జిల్లాల స్థాయి లోనూ పుట్ట‌గొడుగులు మాదిరిగా సంఘాలు నాయ‌కులు ఉన్నారు. వారంతా జ‌ర్న‌లిస్టుల నుంచి వార్షిక చందాలు క‌ట్టించుకుం టున్న‌వారే.  జ‌ర్న‌లిస్టుల‌తో మాటా మంతీ నెరుపుతున్న‌వారే. మ‌రి అలాంటి సంఘాలు ఈ విప‌త్క‌ర స‌మ‌యంలో జ‌ర్న‌లిస్టులకు జ‌రుగుతున్న అన్యాయాల‌పై ఎందుకు మౌనం వ‌హిస్తున్న‌ట్టు? ఏం చేస్తున్న‌ట్టు? అనే ప్ర‌శ్న సాధార‌ణంగా తెర‌మీదికి వ‌చ్చేదే. 

 

అయితే, వీరంతా కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. మేం అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని చెప్పిన నాయ‌కులు కూడా దుప్ప‌టి ముసుగేసుకుని ప‌డుకున్నార‌ట‌! మ‌రి ఇలాంటి సంఘాలు ఉంటే ఏంటి?  లేక‌పోతే..ఏంటి? అనే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పాలి!  ఇప్పుడు ఇదీ.. పాత్రికేయుల సోష‌ల్ సైట్ల‌లో మార్మోగుతున్న ప్ర‌శ్నానినాదం!!

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: