ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డిల మ‌ధ్య వాగ్బ‌ణాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఈ మాట‌ల యుద్ధం ఇప్ప‌ట్లో ఆగేలా క‌న‌బ‌డ‌టం లేదు. క‌న్నా ఒక‌టంటే..వైసీపీ శ్రేణులు విజ‌య‌సాయిరెడ్డి త‌రుపునా వ‌క‌ల్తా పుచ్చుకుని రెండు కూడా కాదు..ఏకంగా నాలుగంటున్నారు. ప‌ర‌స్ప‌ర ఆరోప‌ణ‌ల‌తో క‌రోనా వేళ రాష్ట్రాన్ని రాజ‌కీయం వైపు మ‌ళ్లించారు..రెండు పార్టీల నేత‌లు. అయితే విజ‌య‌సాయిరెడ్డి త‌రుపున పార్టీ మొత్తం రంగంలోకి దిగి బీజేపీ అధ్య‌క్షుడిపై విరుచుకుప‌డుతుంటే ఎందుక‌నో ఆ పార్టీ శ్రేణుల నుంచి పెద్దగా క‌న్నాకు స‌పోర్టు ల‌భించ‌డం లేదు..అయితే దీనికి చాలా కార‌ణాలున్న‌ట్లు ఆ పార్టీ నాయ‌కులే ఆఫ్ ది రికార్డు అంటూ మీడియాకు అసలు విష‌యాలు చెప్పేస్తున్నారట‌.

 

ఇక ప్ర‌స్తుత విష‌యానికి వ‌స్తే కిట్ల కొనుగోళ్ల‌తో పాటు ఏపీ ప్ర‌భుత్వం చేప‌ట్టిన ప్ర‌తీ ప‌నిలో ఏ చిన్న త‌ప్పిదం దొర్లినా క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ వ‌ద‌ల‌డం లేదు. ఇది నిజం. ఏపీ ప్రభుత్వంపై చాలా కాలంగా కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.  రెండు రోజులుగా కన్నా లక్ష్మీనారాయణకు వైసీపీ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్న విష‌యం తెలిసిందే. ఎమ్మెల్యే అంబటి రాంబాబు తన ప్రెస్‌మీట్లో … మొన్నటి ఎన్నికల సమయంలో కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ అధిష్ఠానం పంపిన ఎన్నిక‌ల ఫండ్‌ను ఖ‌ర్చు పెట్ట‌కుండా దిగ‌మింగేశార‌ని ఆరోపించారు. ఇది నిజం కాదేమో కాణిపాకం ఆలయంలో కన్నా లక్ష్మీనారాయణ ప్రమాణం చేయాలని సవాల్ కూడా విస‌ర‌డం విశేషం.  

 

అయితే వాస్త‌వానికి ఈ ఫండ్ గోల్‌మాల్ విష‌యంపై గ‌త ఏడాది ఏప్రిల్ మాసంలోనే టీడీపీ అనుకూల ప‌త్రిక‌లో, మ‌రో ప‌త్రిక‌లో కూడా క‌థ‌నం ప్ర‌చురిత‌మైంది. రాష్ట్రానికి చేరిన 70 కోట్లలో 30 కోట్లను రాష్ట్రానికి చెందిన కీలక నాయకుడు దారి మళ్లించినట్టు కేంద్ర పార్టీకి రిపోర్టు కూడా అందినట్టు క‌థ‌నం సారాంశం. గోల్‌మాల్‌పై ఆరా తీసిన అధిష్ఠానం ఆ పార్టీ రాష్ట్ర కోశాధికారి, ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శిపై కూడా వేటు వేసింది. అయితే క‌న్నా మాత్రం త‌ప్పించుకున్నాడ‌ని ఇప్ప‌టికే ఆ పార్టీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు వైసీపీ నేతలు కూడా ఆ విషయాన్నే ప్రస్తావిస్తుండడంతో కన్నా లక్ష్మీనారాయణ ఇరుకునపడ్డార‌నే చెప్పాలి.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: