మానవుడే మహనీయుడు... మానవుడే మహనీయుడు 
శక్తియుతుడు యుక్తి పరుడు మానవుడే మాననీయుడు
మానవుడే మహనీయుడు
మంచిని తలపెట్టినచో మనిషి కడ్డు లేదులే
ప్రేరణ దైవానిదైన సాధించును నరుడే
మానవుడే మహనీయుడు

దివిజగంగ భువిదించిన భగీరథుడు మానవుడే
సుస్థిర తారగ మారిన ధ్రువుడు కూడ మానవుడే
సృష్టికిప్రతిసృష్టిచేయు విశ్వామిత్రుడు నరుడె
జీవకోటి సర్వములొ శ్రెసటతముడు మానవుడే
మానవుడే మహనీయుడు


మ‌నిషి గొప్ప‌త‌నాన్ని చాటుతూ సినీ క‌వి ఆరుద్ర రాసిన పాట ఇదీ. ఆయ‌న రాసిన ప్ర‌తీ అక్ష‌రం స‌త్య‌మ‌ని నిరూపిస్తూ క‌రోనాతో ఆప‌ద‌లో ప‌డిన స‌మాజాన్ని ఎంతోమంది ఉదార స్వ‌భావులు..ఎముక‌లేని చెయ్యిలా అన్నార్తుల‌కు, ఆక‌లితో అల‌మ‌టిస్తున్న పేద‌ల‌ను ఆదుకుంటున్నారు. సాయం చేయడానికి మంచి మ‌న‌స్సు ఉండాలి కాని...ఆస్తులు...అంత‌స్తులు కాద‌ని చాటి చెబుతున్నారు.  చేసేదీ చిన్నసాయ‌మే కావ‌చ్చు.. వారి ఆలోచ‌న‌...వారి ఆచ‌ర‌ణ‌..వారి అంకితాభావం..కోటానుకోట్ల మంది భార‌త‌వని ప్ర‌జ‌ల్లో సేవాభావంపై స్ఫూర్తిని నింపుతోంది. స‌మాజంపై ప్ర‌తీ పౌరుడికి ఉండాల్సిన బాధ్య‌త‌ను గుర్తు చేస్తోంది.

 


లాక్‌డౌన్ వేళా దేశంలో ఎంతోమంది పేద‌లు ఆక‌లితో తీరుస్తున్నారు. అన్న‌యో రామ‌చంద్రా అని అడిగిన వారంద‌రికీ లేద‌నుకుండా..కాద‌న‌కుండా దానం చేస్తూ క‌డుపు నింపుతున్నారు. అడగ‌నిదే అమ్మ అయినా పెట్ట‌దు అన్న సామెత అంద‌రికీ తెలిసిందే.. క‌రోనా వేళ కొంత‌మంది సేవామూర్తులు.. ద‌యార్ధ హృద‌యులు మాత్రం క‌ల్పించుకుని మ‌రీ.. ఆక‌లితో ఉన్నారేమోన‌ని అనుమానం క‌లిగి వారంద‌రిని భోజ‌నం చేశారా..? అంటూ  ప్రేమ‌గా ప‌ల‌క‌రిస్తున్నారు. మ‌నిషిలో మాన‌వ‌త్వం చ‌నిపోయింద‌ని అనుకుంటున్న వేళ‌...క‌రోనా నిజంగా మ‌నుషులు చంపుతుండ‌వ‌చ్చు గాని మాన‌వ‌త్వాన్ని త‌ట్టి లేపుతోంది.

 


ఓ వ్యాపార సంస్థ లాభాలే తీసుకోవ‌డమే కాదు..దానం కూడా దండిగానే చేయ‌గ‌ల‌న‌ని నిరూపించింది. చిల్ల‌ర కొట్టు కిట్ట‌య్య నుంచి అంబానీ దాకా క‌రోనా వేళ దాతృత్వానికి అంద‌రూ ముందుకు క‌దులుతున్నారు. స‌మాజం మొత్తం చెడ్డ‌ది కాదు..స‌మాజంలో ఉన్న‌దంతా చెడుకాదు...మంచి మిగిలే ఉంది... మాన‌వ‌త్వం అలాగే ఉంద‌ని నిరూపిస్తున్నారు... మ‌హానుభావులు. నెల‌కు మూడువేల రూపాయ‌లు సంపాదించే ముస‌ల‌వ్వ మొద‌లు... కోటానుకోట్ల‌కు అధిప‌తులైన ఎంతోమంది భార‌త‌వ‌ని బిలియ‌నీర్లు మాన‌వ సేవ‌కు ముందుకు రావ‌డం శుభ‌ప‌రిణామం.. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: