కోవిడ్ 19  ప్రింట్ మీడియాపై తీవ్ర‌మైన ప్ర‌భావం చూపుతోంది. లాక్‌డౌన్ అమ‌ల్లోకి తీసుకువ‌చ్చిన నాటి నుంచి వార్త‌ల‌ను స‌మ‌కూర్చుకోవ‌డం మొద‌లు ప్రింట్‌ను బ‌య‌ట‌కు తీసుకురావ‌డం.. పాఠ‌కుడికి చేర్చేలా వంటి ప్ర‌క్రియ‌లో పురిటినొప్పులు ప‌డుతోంది.ప‌త్రికా నిర్వ‌హ‌ణ అనేది వాస్త‌వానికి ఆయా సంస్థ‌ల యాజ‌మాన్యాల‌కు  దిన‌దిన‌గండం మారింది. ఇంతాచేసినా పాఠ‌కుడు ఆద‌రించ‌క‌పోవ‌డం...పేప‌ర్ చ‌ద‌వాలంటేనే భ‌య‌ప‌డిపోతుండ‌టం గ‌మానార్హం. ఇప్పుడు లాక్‌డౌన్ కొన‌సాగింపు ఉంటుంద‌న్న ఊహాగానాల నేప‌థ్యంలో సంస్థ‌లు కాస్ట్‌క‌టింగ్ చ‌ర్య‌ల‌కు దిగుతున్నాయి. ఇప్ప‌టికే న్యూస్ ప్రింట్‌ను త‌గ్గించుకునేందుకు పేజీల సంఖ్య‌ను త‌గ్గించేశాయి.


ఇక రెండు మూడు ప‌త్రికలు ఇప్ప‌టికే చేతులెత్తేసి మూసివేస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించాయి. తాజాగా మ‌రికొన్ని పెద్ద సంస్థ‌లు కూడా అదే బాట‌లో ప‌య‌నిస్తుండ‌టం గ‌మ‌నార్హం. అయితే తెలుగు రాష్ట్రాల్లో పాఠాకాభిమానం పొందిన ఓ రెండు ప‌త్రిక‌లు మాత్రం మేక‌పోతు గాంభీర్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్న లోలోప‌ల మాత్రం కాస్ట్‌క‌టింగ్ చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించిన‌ట్లు స‌మాచారం. అయితే అదేస్థాయిలో ఉద్యోగులు సంస్థ‌లు త‌మ‌కు చేస్తున్న అన్యాయాల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎండ‌గ‌డుతున్నారు. సంస్థల తాలూకు ‘అస‌లు విష‌యాన్ని’ బయటపెడుతుండ‌టం విశేషం. మొన్నటికి మొన్న ఆంధ్రజ్యోతి విషయంలో ఇదే జ‌రిగింది. 


ఉన్న‌ప‌లంగా సిబ్బందిని త‌గ్గించుకోవ‌డంపై తీవ్ర విమ‌ర్శ‌ల పాలైంది. అయితే ఇప్పుడు ‘ఈనాడు’ పేరు కూడా ఇదే కోవలో విన్పిస్తుండ‌టం గ‌మ‌నార్హం.ఈ క్రమంలో ఆ డెస్క్‌లలో పనిచేసే సిబ్బందితోపాటు, ఫీల్డ్‌ సిబ్బందినీ తగ్గించేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే జిల్లాల ఎడిషన్లు కుదించే ప్ర‌య‌త్నాలు చేస్తోందంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది.  భవిష్యత్తులో ఈ ‘జిల్లాల ఎడిషన్లు’ వుంటాయా.? వుండవా.? అన్నదానిపై   ప‌లువురు జ‌ర్న‌లిస్టులు  భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి, ఈ ‘తగ్గింపు చ‌ర్య‌లు గ‌తంలోనే నిర్ణ‌య‌మై పోయిన క‌రోనా య‌జ‌మాన్యాల‌కు క‌ల‌సి వ‌చ్చింద‌నేది ఆయా సంస్థ‌ల ఉద్యోగుల మాట‌. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: