కొండ కోన‌లు దాటుకుంటూ ఎడ్ల‌బండ్ల‌పై కొంత‌..కాలిన‌డ‌క‌న కొంత కిలోమీట‌ర్ల మేర ప‌య‌నిస్తూ త‌న‌ను న‌మ్ముకున్న‌జ‌నం కోసం నిత్యావ‌స‌రాల‌ను మోసుకెళ్తోంది ధ‌న‌సూరి అన‌సూయ అలియాస్ సీత‌క్క‌. ములుగు జిల్లా ఎమ్మెల్యేగా ప‌నిచేస్తున్న ఆమె చ‌రిత్రంతా పోరాట‌మే.  పేద‌, బీద‌, బ‌హుజ‌న వ‌ర్గాల‌కు న్యాయం చేయాల‌నే ల‌క్ష్యంతో  ఎన్నో ఏళ్లు నక్స‌లైటు ఉద్య‌మంలో ప‌నిచేసింది. ఉద్య‌మంతో క‌న్నా ప్ర‌జాక్షేత్రంలోనే ఉంటూ వారికి మెరుగైన సేవ‌లందించ‌వ‌చ్చు..న్యాయం చేయ‌వ‌చ్చ‌న్న ఆలోచ‌న‌తో ఆమె ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. ప్ర‌జ‌లు కూడా ఆమెను అంతే ప్రేమ‌తో అక్కున చేర్చుకున్నారు.

 

ఇప్ప‌టికే రెండు ప‌ర్యాయాలు సీత‌క్క‌ను ఎమ్మెల్యేగా గెలిపించారు. అయితే ఆదివాసీలు ఆమెపై పెట్టుకున్న న‌మ్మకాన్ని వ‌మ్ము చేయలేదు. క‌రోనా క‌ష్ట‌కాలంలో సీత‌క్క కాలికి బ‌ట్ట‌క‌ట్ట‌కుండా ఆప‌ద‌లో ఉన్నా గూడెంను సంద‌ర్శిస్తోంది. అవ‌స‌ర‌మున్న ప్ర‌తీ ఇంటి త‌లుపు త‌ట్టి నిత్యావ‌స‌రాల‌ను అంద‌జేసే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఆమె పిలుపు మేర‌కు నియోజ‌క‌వ‌ర్గంలోని అనేక మంది దాత‌లు ముందుకు వ‌చ్చి సాయం అంద‌జేస్తుండ‌టం ఇక్క‌డ గొప్ప‌త‌నంగా చెప్పుకోవాలి. సీత‌క్క అంటే ఆదివాసీల గుండెల్లో గూడుక‌ట్టుకున్న‌ న‌మ్మ‌కం. త‌మ‌కు ఏమైనా అక్క చూసుకుంటుద‌న్న భ‌రోసా వారిలో క‌నిపిస్తుంటుంది. టీడీపీ నుంచి ఆమె రాజ‌కీయ ప్ర‌స్థానం మొద‌లైన‌..నేడు కాంగ్రెస్‌లో కొన‌సాగుతోంది. 

 

పూట‌కో పార్టీ మారే నేటి రాజ‌కీయ జ‌మానాలో సీత‌క్క మాత్రం విభిన్నం..విమ‌ర్శ‌లకు..ఆరోప‌ణ‌ల‌కు బ‌హుదూరం..త‌న నియోజ‌క‌వ‌ర్గ‌మే త‌న‌కు ప్ర‌పంచం. త‌న‌ను న‌మ్ముకున్న గిరిజ‌నం కోసం ఎంత‌దూరమైనా వెళ్తుంది. ఎవ‌రితోనైనా కొట్లాడేందుకు..పోట్లాడేందుకు సిద్ధ‌ప‌డుతుంది. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే స్వార్థం, అంగ‌బ‌లం, ఆర్థిక‌బ‌లం ఉన్న నేత‌ల‌కు విభిన్నం సీత‌క్క‌. అక్కా అంటే త‌మ్మి అని ఇంటి ముంద‌ర వాలిపోయే నైజం ఆమెది. సీత‌క్క‌లాంటి నేత ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అంజ‌న‌మేసి గాలించినా దొర‌క‌డం క‌ష్ట‌మేనంటే అతిశేయోక్తి కాదు.రోజురోజూకు చ‌నిపోతున్న‌  నైతిక‌, మాన‌వీయ‌, రాజ‌కీయ విలువ‌ల‌కు సీత‌క్క సంజీవ‌ని అని చెప్పాలి. నిజంగా రాజ‌కీయాల్లో సేవ చేయాల‌నే దృక్ప‌థంతో వ‌చ్చే వారికి..వ‌చ్చేలా చేయ‌డానికి ఆమె చేస్తున్న సేవా కార్య‌క్ర‌మాలు స్ఫూర్తి నింపుతున్నాయి...ఇంకొంత‌మందికి ఆద‌ర్శంగా నిలుస్తున్నాయి. స‌లాం సీత‌క్క‌..

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: