ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని ఎంత‌లా అతలా కుత‌లం చేస్తుందో ?  చూస్తూనే ఉన్నాం. ఇక ఈ వైరస్‌కు ఇప్ప‌టి వ‌ర‌కు మందు క‌నిపెట్ట‌లేదు. ఈ పేరు చెపితేనే ప్ర‌పంచం అంతా భ‌య‌ప‌డుతోంది. అయితే గ‌తంలో ఇంత‌కు మించిన ఎన్నో వైర‌స్‌లు గ‌తంలో ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేస్తే వాటికి మందు క‌నిపెట్ట‌డ‌మో లేదా ?  వీటి వ్యాప్తిని అరిక‌ట్ట‌డ‌మో జ‌రిగింది. త్వ‌ర‌లో అయినా ఈ వైర‌స్ వ్యాప్తికి ప్ర‌పంచ మాన‌వాళి, వైద్య రంగ నిపుణులు అడ్డు క‌ట్ట వేస్తార‌ని ఆశిద్దాం.. ఇక గ‌తంలో ప్ర‌పంచ మాన‌వాళిని వ‌ణికించిన వైర‌స్‌ల విష‌యానికి వ‌స్తే ఎబోలా తొలిసారిగా డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలో గుర్తించారు. 2014-16 మధ్య పశ్చిమ ఆఫ్రికాలో వేగంగా  విస్తరించిన ఈ వైరస్‌ 28,610 మందికి సోకగా అందులో 11,308 మందిని బలి తీసుకుంది. దీనికి కూడా టీకా లేదు. 

 

ఇక మెర్స్ .... మెర్స్ అంటే మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌. కొవిడ్‌కు కారణమైన కరోనాతో పోల్చితే ఇది చాలా ప్రమాదకరమైంది. అరుదుగా వ్యాపించే ఈ వైరస్‌ తీవ్రత సౌదీ అరేబియాలో ఎక్కువ. 2012లో దీనిని గుర్తించారు. అప్పుడు 2,499 మందికి వైరస్‌ సోకితే అందులో 861 మంది చనిపోయారు. దీనికి కూడా ఎలాంటి టీకా లేదు. ఇక ఇన్‌ఫ్లూయెంజా విష‌యానికి వ‌స్తే ఈ వైర‌స్ ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త రూపం మార్చుకుంటూ గ‌త రెండు ద‌శాబ్దాల్లో ఎంతో అల‌జ‌డి క్రియేట్ చేసింది. వివిధ రకాల ఫ్లూ జ్వరాల బారినపడి ప్రతీ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6 లక్షల మంది చనిపోతున్నారు. వివిధ వ్యాక్సిన్లతో దాని కట్టడికి విశేష కృషి జరుగుతోంది. 

 

ఇక హెప‌టైటిస్లో ఏ, బీ, సీ, డీ అనేక ర‌కాలు ఉన్నాయి. హెపటైటిస్‌ సీ సోకిన వారిలో కనీసం 20శాతం మంది కూడా చికిత్స పొందలేక కాలేయ సంబంధిత వ్యాధితో చనిపోతున్నారు. అయితే ఇది రాకుండా ముందు టీకా వేసుకోవ‌చ్చు. ఇక మాన‌వాళిని ప‌ట్టి పీడిస్తోన్న మ‌రో మ‌హ‌మ్మారి హెచ్ఐవీ. ఇది సోకిన తొలి రోజుల్లో జ‌నాలు ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్ల‌లో చ‌నిపోయారు. అయితే ఇది సోక‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌చ్చు. ఆరోగ్య విధానాల ద్వారా ఎయిడ్స్‌ రోగుల జీవితకాలాన్ని పెంచగలుగుతున్నాం. ఏదేమైనా క‌రోనాను మించిన ఈ క‌రోడా లాంటి వ్యాధుల‌కే టీకాలు లేదా మందులు క‌నుగోవ‌డం లేదా క‌ట్ట‌డి నియంత్ర‌ణ చేసే విష‌యంలో మాన‌వుడు స‌క్సెస్ అయ్యాడు. ఇక  ఈ క‌రోనా నుంచి కూడా త్వ‌ర‌లోనే బ‌య‌ట‌ప‌డ‌తామ‌నే ఆశిద్దాం.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: