వారం వారం ప‌లికే ప‌లుకులు మ‌రోసారి కొత్త సొబ‌గులు అద్దుకుని తెలుగు ప్ర‌జ‌ల లోగిలిలో వాలిపోయాయి. అవే.. ఆంధ్ర‌జ్యోతి వారి కొత్త‌ప‌లుకు.. ఉర‌ఫ్ ఆర్కే ప‌లుకు! ఈ సారి మొత్తం ప‌లుకుల్లో.. స‌గ‌టు జీవికి అంత్యంత ఉదారంగా న‌చ్చిన వ్యాఖ్య‌లు, ప‌దాలు, వాక్యాలు ఏమైనా ఉన్నాయంటే.. అది వృత్తి నైతిక‌త‌‌! దీని గురించి చెప్పిన ఆర్కే.,. రాష్ట్రంలో జ‌రిగిన ప‌రిణామాల‌ను ఉద‌హ‌రించారు. ``ఒకప్పుడు తాను సుజనా చౌదరికి చెందిన కంపెనీలకు ఆడిటర్‌గా పనిచేశాననీ, బోగస్‌ కంపెనీలు ఏర్పాటు చేయడం తోపాటు ఆర్థిక అవకతవకలకు చౌదరి పాల్పడ్డారనీ విజయ సాయిరెడ్డి చేసిన విమర్శల వెనుక కొంతమం దికి హె చ్చరిక కూడా ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి`` అని పేర్కొన్నారు.

 

అదే స‌మ‌యంలో ``ఒక ఆడిటర్‌గా విజయ సాయిరెడ్డి గతంలో తాను పనిచేసిన కంపెనీలపై ఇంతకాలం తర్వాత ఆరోపణలు చేయడం ద్వారా ఆయన వృత్తిపరమైన అనైతికతకు పాల్పడ్డారు. సుజనా చౌదరి తప్పుచేసి ఉంటే ఆ విషయం అప్పుడే సంబంధిత సంస్థల దృష్టికి తీసుకువెళ్లాల్సింది. అలా చేయ కుం డా మౌనంగా ఉన్నారంటే జరిగిన తప్పులో ఆయనకూ భాగం ఉన్నట్టే అవుతుంది``- అని ఆర్కే వారు సెల ‌విచ్చారు. అయితే, వాస్త‌వానికి ఆర్కే ప‌లికే కొత్త ప‌లుకులు గ‌మ‌నిస్తే.. ఎవ‌రు అనైతిక‌త‌కు పాల్ప‌డుతు న్నారో ఇట్టే అర్ధ‌మ‌వుతుంద‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు.  

 

వృత్తి అంటే.. అది ఆడిట‌ర్ అయినా.. జ‌ర్న‌లిజ‌మైనా.. వృత్తే క‌దా.. మ‌రి అలాంట‌ప్పుడు ఆర్కే అనేక సా ర్లు.. అటు కేసీఆర్‌.. విష‌యంలోను, ఇటు వైఎస్ విష‌యంలో నేను అప్పుడు అలా ఉన్న స‌మ‌యంలో ఇలా జ‌రిగింది.. ఇది నాకు మాత్ర‌మే తెలుసు. అంటూ వారిని డీ గ్రేడ్ చేయ‌డం వృత్తి అనైతిక‌త కాదా?  లేక  త‌న‌కు మాత్ర‌మే తెలిసిన విష‌యాన్ని బ‌హిరంగంగా వెల్ల‌డించ‌డం ఎలాంటి నైతిక‌త అనిపించుకుం టుంది?  అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు వైసీపీ నేత‌లు. 

 

నైతిక‌త గురించి మాట్లాడాలంటే.. ముందు మీరు ఏనాడైనా.. నిజాలు, నీతులు చెబితే.. వాటి గురించి మాట్లాడే అర్హ‌త ఉంటుంద‌ని వైసీపీ సోష‌ల్ మీడియాలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. గురివింద గింజ‌మాదిరిగా ఆర్కే ప‌లుకులు ఉన్నాయ‌ని అంటున్నారు. మ‌రి దీనిలో నిజమెంతో ఆయ‌నే తేల్చుకోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: