తెలంగాణ రాష్ట్ర సాధ‌నే ధ్యేయంగా ఏర్ప‌డిన  తెలంగాణ రాష్ట్ర సమితి 20 ఏళ్లు పూర్తి  చేసుకుంది. ఈ రెండు ద‌శాబ్దాల ప్రయాణంలో ఆ పార్టీ ఎన్నో ఎత్తుప‌ల్లాల‌ను..అప్ర‌తిహ‌త విజ‌యాల‌ను...వెన్నుపోట్ల‌ను...ఆటుపోట్ల‌ను ఎదుర్కొంది.  2001 ఏప్రిల్ 27 న అప్పటి ఆంధ్ర ప్రదేశ్‌ శాసనసభ ఉపసభాపతి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన పదవికి, శాసనసభా సభ్యత్వానికి, తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి వి. ప్రకాశ్ వంటి కొందరు నాయకులతో కలిసి టీఆర్ ఎస్ పార్టీని ప్రారంభించారు. ఆ త‌ర్వాత ఆలె నరేంద్ర, సత్యనారాయణరెడ్డి లాంటి కొంత‌మంది నేత‌లు పార్టీలోకి వ‌చ్చి వెళ్లారు.

 

ఆ త‌ర్వాత నిజాం మనుమరాలు సలీమా బాషా (అస్మత్‌ బాషా కుమార్తె), ఆమె కుమార్తె రఫత్‌షా ఆజంపురాలు తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌కు మ‌ద్ద‌తు తెలిపారు. ఉద్య‌మ సంస్థ‌గా ఆరంభ‌మైన‌..అటు త‌ర్వాత రాజ‌కీయ పార్టీగా అవ‌త‌రించింది. రాజ‌కీయ ఉనికిని చాటుకోవ‌డం ద్వార మాత్ర‌మే తెలంగాణ‌ను సాధించుకోగ‌ల‌మ‌ని కేసీఆర్ వేదిక‌ల‌పై విస్తృతంగా ప్ర‌చారం చేయ‌డంతో ప్ర‌జ‌ల నుంచి విప‌రీతంగా మ‌ద్ద‌తు ల‌భించింది. 2001లో ఆరంభ‌మైన ప్ర‌స్థానం...తెలంగాణ వ‌చ్చే దాకా ఆ పోరాటం ఆగ‌లేదు. జాతీయ‌, ఉమ్మ‌డి రాష్ట్ర రాజ‌కీయాల్లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తూ తెలంగాణ‌లో నిల‌దొక్కుకోగ‌లింది. ఉద్య‌మాన్ని ఎక్క‌డ చ‌ల్లార‌నివ్వ‌కుండా ప‌దేపదే ఎన్నిక‌ల‌కు వెళ్తూ ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తీసుకువ‌చ్చే వినూత్న ప్ర‌యోగానికి టీఆర్ ఎస్ వేదిక‌గా మార‌డం విశేషం.

 

ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసి ఎన్నిక‌ల‌కు సిద్ధ‌ప‌డ‌టంతో తెలంగాణ కోసం టీఆర్ ఎస్ పార్టీ ఎంత కృత‌నిశ్చ‌యంతో ఉంద‌న్న విష‌యం ప్ర‌జ‌ల‌కు సుస్ప‌ష్ట‌మైంది. అయినా  మ‌ధ్య‌లో రాజ‌కీయంగా ఢీలా ప‌డ్డ సంద‌ర్భాలు ఎన్నో. పార్టీ విలీనం చేస్తామ‌ని వ‌చ్చిన ప్ర‌తిపాద‌న‌లు ఉన్నాయి. అయితే కేసీఆర్ దీక్ష తెలంగాణ రాష్ట్ర స‌మితికి ఎన‌లేని బ‌లాన్ని చేకూర్చింది.  పార్టీల‌క‌తీతంగా రాజ‌కీయ చైత‌న్యాన్ని నింపింది. తెలంగాణ‌లోని స‌బ్బండ వ‌ర్గాలు ఒక్క‌ట‌య్యేలా చేసింది. కేసీఆర్ దీక్ష‌...తెలంగాణ ఉద్య‌మ చ‌రిత్ర‌లోనే అతిపెద్ద మైలురాయిగా చెప్పాలి. డిసెంబ‌ర్ 9న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్న‌ట్లుగా అప్ప‌టి  యూపీఏ ప్ర‌భుత్వం నుంచి ప్ర‌క‌ట‌న చేయించ‌గ‌లిగారు.

 

ఆ త‌ర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై కొన‌సాగింపులు జ‌రిగినా...చివ‌రికి తెలంగాణ రాష్ట్రం స్వ‌ప్నం నెర‌వేరింది. ఉద్య‌మ పార్టీ అధికారంలోకి రావ‌డం..రెండో విడ‌త కూడా అప్ర‌హిత విజ‌యం సాధించ‌డం జ‌రిగిపోయాయి. ఇప్పుడు తెలంగాణ‌లో స‌మీప భ‌విష్య‌త్‌లోనే కాదు..దాదాపు ద‌శాబ్ద‌కాలం పాటు టీఆర్ ఎస్‌కు ఎదురులేద‌న్న‌ది జ‌ర‌గ‌బోయే స‌త్యం. తెలంగాణ గ‌డ్డ‌పై 20 ఏళ్ల ప్ర‌స్థానం కొన‌సాగిస్తున్న టీఆర్ఎస్ పార్టీ ప్ర‌జ‌ల‌కిచ్చిన వాగ్దానాల‌ను నెర‌వేర్చే ప‌నిలో ఉంది. ఉద్య‌మనాయ‌కుడే పాల‌న ద‌క్షుడిగా కొన‌సాగుతుండ‌టంతో బంగారు తెలంగాణ దిశ‌గా సాగిపోతోంది. నీళ్లు, నిధులు, నియామ‌కాలను స‌మ‌కూర్చే దిశ‌గా పాటుప‌డుతూ నాలుగున్న‌ర కోట్ల క‌ల‌ల‌ను నెర‌వేర్చేందుకు నిర్విరామంగా ప్ర‌య‌త్నం చేస్తోంది.


 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: