తెలంగాణ స్వ‌రాష్ట్ర సాధ‌నే ల‌క్ష్యంగా 2001 ఏప్రిల్ 27న ఆవిర్భ‌వించిన తెలంగాణ రాష్ట్ర స‌మితి నేటితో 20 వసంతాలు పూర్తి చేసుకుంటోంది. దాదాపు 11సంవ‌త్స‌రాల తెలంగాణ ఉద్య‌మ సుదీర్ఘ‌పోరాటంతో స్వ‌రాష్ట్ర స్వ‌ప్నాన్ని సాధించుకుంది. ఇప్పుడు సాధించుకున్న తెలంగాణ‌ను బంగారుమ‌యం చేసుకునేందుకు ఉద్య‌మ‌నాయ‌కుడే..పాల‌న‌ద‌క్షుడిగా ఉన్న కేసీఆర్ నాయ‌క‌త్వంలో వేగంగా ముందుకు వెళ్తోంది. దేశంలోనే అత్యంత వేగంగా ప్ర‌గ‌తి బాట‌లో ప‌య‌నిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ప్ర‌థ‌మ స్థానంలో ఉండ‌టం గ‌మనార్హం. ప్రాథ‌మిక‌, ద్వితీయ‌, తృతీయ రంగాల‌కు వ‌రుస క్ర‌మంలో ప్రాధాన్య‌మిస్తూ నీళ్లు, నిధులు, నియామ‌కాల‌కు కృషి చేస్తోంది.


దేశంలో ఏ రాష్ట్రం ప్ర‌వేశ‌పెట్ట‌ని విధంగా సంక్షేమ ప‌థకాల‌ను ఇక్క‌డి ప్ర‌భుత్వం అమ‌లు చేస్తుండ‌టం కేసీఆర్ నాయ‌క‌త్వానికి.. సంక్షేమానికి ఆయ‌న ప్ర‌భుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తున్నాయి. పాల‌న సంస్క‌ర‌ణ‌ల‌తో ప్ర‌జ‌ల వ‌ద్ద‌కే ప‌రిపాల‌నాధికారులు వెళ్లేలే చేయ‌డంలో కేసీఆర్ విజ‌యం సాధించార‌ని చెప్పాలి. కొత్త జిల్లాల ఏర్పాటు, కొత్త మండ‌లాల ఏర్పాటు, కొత్త పంచాయ‌తీల ఏర్పాటు, సాదా బైనామాల‌కు ప‌ట్టాల మంజూరు, పంట‌ల‌కు రుణాల మంజూరు, ఏటా ఎక‌రానికి పంట పెట్టుబ‌డికి రూ.10వేలు సాయం, వృద్ధాప్య‌, విక‌లాంగుల‌ పింఛ‌న్ల మంజూరు, డ‌బుల్ బెడ్‌రూం ప‌థ‌కం, కంటి వెలుగు, మిషన్ భ‌గీర‌థ‌, మిష‌న్ కాక‌తీయ‌, కాలేశ్వ‌రం ప్రాజెక్టుతో పాటు మ‌రికొన్నింటికి శ్రీకారం ఇలా ఎన్నెన్నో నిర్ణ‌యాల‌తో టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల అభిమానాన్ని సంపాదించుకుంది. 


తెలంగాణ ప్ర‌జానీకానికి కేసీఆర్ అంటే ఎంతో న‌మ్మకం. ఆయ‌న పిలుపుల‌కు కోట్లాదిమంది ప్ర‌తిస్పందిస్తుంటారు.ఇక రాజ‌కీయం విష‌యానికి వ‌స్తే స‌మీప భ‌విష్య‌త్‌లో టీఆర్ ఎస్‌కు త‌ప్పా మ‌రో పార్టీని అధికారంలో కూర్చోబెట్టే ప్ర‌య‌త్నం జ‌నం చేయ‌క‌పోవ‌చ్చు. ఇందుకు ప్ర‌ధానంగా టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌ధాన కార‌ణ‌మైతే.. కాంగ్రెస్ పార్టీ చ‌తికిల‌ప‌డిపోవ‌డం మ‌రోకార‌ణ‌మ‌ని చెప్పాలి. ఇక బీజేపీకి రాష్ట్రంలో పెద్ద‌గా క్యాడ‌ర్ లేదు. వామ‌ప‌క్షాలు క‌నుమ‌రుగైపోయాయి. టీడీపీ ఆనావాళ్లు లేకుండాపోయింది. ఈ ప‌రిస్థితుల్లో టీఆర్ ఎస్ పార్టీకి త‌ప్పా మ‌రో పార్టీకి అధికారం ద‌క్కుతుంద‌నుకుంటే అతిశేయోక్తే అవుతుంది.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: