రాష్ట్రంలో మీడియాను న‌మ్ముకుని జీవితం వెళ్ల‌బుచ్చుతున్న కుటుంబాలు అర్ధాక‌లితో అల‌మ‌టిస్తున్నాయా ?  వేత‌నాల్లో కోత జ‌ర్న‌లిస్టుల‌ను వేధిస్తోందా?  ఉద్యోగ భ‌ద్ర‌త కొర‌వ‌డి.. వేరే ప‌నిచేసుకునే అవకాశం కూడా లేక జ‌ర్న‌లిస్టులు అల‌మ‌టిస్తున్నారా ? అంటే.. తాజా అంచ‌నాలు ఔన‌నే అంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్టులు దాదాపు 5 ల‌క్ష‌ల మంది ఉంటార‌ని లెక్క‌లు చెబుతున్నాయి. వీరిలో ప్రింట్ మీడియా, ఎల‌క్ట్రానిక్ మీడియా ఉద్యోగులు కీల‌కంగా ఉన్నారు. ఇక‌, ఇంట్లో కూర్చుని సైట్ల‌కు వార్త‌లు రాసే వారు, సైట్ల‌ను నిర్వ‌హించేవారు. టెక్నీషియ‌న్లు, ఫొటోగ్రాఫ‌ర్లు, డిజైన‌ర్లు ఇలా మ‌రో ల‌క్ష‌న్న‌ర మంది ఉన్నారు.

 

అయితే, క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా ఇప్పుడు రెండు ల‌క్ష‌ల మంది ఉపాధి కోల్పోయారు. కొంద‌రిని సంస్థలే ఉద్యోగాల నుంచి ఇంటికి పంపాయి. దీంతో వారంతా ఇప్పుడు ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. దీంతో ఈ నెల ఉపాధి కోల్పోయి చేతిలో చిల్లిగ‌వ్వ కూడా లేకుండా ఇబ్బంది ప‌డుతున్నారు. పోనీ.. కేంద్ర ప్ర‌భు త్వం చెప్పిన‌ట్టు ఈఎంఐలు కానీ, ఇంటి అద్దెలు కానీ ఎవ‌రైనా ఆగుతున్నారా ? అంటే అలాంటి ప‌రిస్థితి ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. దీంతో త‌మ ప‌రిస్థితి ఏంట‌ని జ‌ర్న‌లిస్టులు మ‌ద‌‌న‌ప‌డుతున్నారు.

 

పోనీ.. ప్ర‌భుత్వం నుంచి ఏమైనా ఏదైనా సాయం అందుతుందా? అంటే అది కూడా లేదు. జ‌ర్న‌లిస్టుల‌కు వైట్ రేష‌న్ కార్డు లేక‌పోవ‌డంతో ప్ర‌భుత్వం పేద‌లకు చేస్తున్న సాయం వీరికి ఎక్క‌డా అంద‌డం లేదు. దీంతో జ‌ర్న‌లిస్టులు అటు తాము న‌మ్ముకున్న మీడియా సంస్థ‌ల నుంచి ఇటు ప్ర‌భుత్వాల నుంచి కూడా వివ‌క్ష‌కు గుర‌వుతున్నార‌నే చెప్పాలి. మ‌రి ఈసమ‌యంలో వీరిని ఎవ‌రు ఆదుకోవాలి?  ఎవ‌రు ముందుకు రావాలి? అనే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌చ్చింది. 

 

ఇప్ప‌టికే తెలంగాణ‌లో కొన్ని జ‌ర్న‌లిస్టు సంఘాలు.. పాత్రికేయు ల‌కు నిత్యావ‌స‌రాలు అందిస్తున్నాయి.మ‌రి ఏపీలో మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు జ‌ర్న‌లిస్టు సంఘాలు ఎక్క‌డా ముందుకు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇప్ప‌టికైనా వారు ముందుకు వ‌చ్చి పాత్రికేయుల‌ను ఆదుకోవాల‌నే డిమాండ్లు స‌ర్వ‌త్రా వినిపిస్తున్నాయి. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: