అవును చంద్రబాబునాయుడు, ఎల్లోమీడియాకు ఇపుడు కడుపు చల్లబడుంటుంది. ఎందుకంటే తెలంగాణాతో పోల్చుకుంటే ఏపిలో కేసుల సంఖ్యతో పాటు మృతుల నెంబర్ కూడా పెరిగిపోయింది కాబట్టి. కరోనా వైరస్ సమస్య మొదలైన దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డి చాలా తేలిగ్గా తీసుకుంటున్నాడని, వైరస్ నియంత్రణలో విఫలమయ్యాడని చంద్రబాబు, ఎల్లోమీడియా ఆరోపణలు, విమర్శలు  చేయని రోజు లేదు. మామూలు జనాలు ఎవరిని అడిగినా తెలంగాణాలో కన్నా ఏపిలోనే నియంత్రణ చర్యలు బాగున్నాయని చెబుతున్నారు.

 

వైరస్ నియంత్రణలో ఏపిలోనే చర్యలు బాగున్నాయని ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాధితుల సంఖ్య, మరణాల సంఖ్య తెలంగాణాతో  పోలిస్తే ఏపిలోనే రెండు రోజుల వరకూ తక్కువ.  లక్షలాది మంది వాలంటీర్లు, ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది క్షేత్రస్ధాయిలో 24 గంటలూ పనిచేయబట్టే కేసుల తీవ్రత తక్కువగా ఉందన్న విషయం అందరూ అంగీకరిస్తారు. క్వారంటైన్ సెంటర్లు, ఐసొలేషన్ వార్డులు పెట్టటంతో పాటు ఇంటింటిని మూడుసార్లు సర్వే చేయించింది ప్రభుత్వం.

 

యావత్ ప్రభుత్వ యంత్రాంగాన్ని 24 గంటలూ జగన్ రోజు మానిటర్ చేయబట్టే వైరస్ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉన్నారు. వైరస్ సోకటం అన్నది ప్రభుత్వం చేతిలో లేనిదన్న విషయం ఒక్క చంద్రబాబు, ఎల్లోమీడియాకు తప్ప మిగిలిన అందరికీ తెలుసు. అనుమానితులకు పరీక్షలు చేయించాలని, పరీక్షల రిజల్ట్స్ కూడా తొందరగా రావాలనే జగన్ ధక్షిణకొరియా నుండి లక్ష ర్యాపిడ్ టెస్టు కిట్లను తెప్పించాడు. కరోనా వైరస్ తో యుద్ధం చేయటంలో భాగంగా జగన్ ఇన్ని చర్యలు తీసుకుంటున్నా ఇవేవీ చంద్రబాబు, ఎల్లోమీడియాకు కనబడలేదు.

 

ఎంతసేపూ కరోనా వైరస్ ను అరికట్టటంలో జగన్ ప్రభుత్వం ఫెయిలైందన్న ఆరోపణలతోనే కాలం గడిపేస్తున్నాడు చంద్రబాబు. ఇక ఎల్లోమీడియా ఛానళ్ళలో అయితే జగన్ ప్రభుత్వం ఫెయిలైందన్న కోణంలోనే చర్చలు నిర్వహిస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. ఎంతమంది ఎన్నిరకాలుగా ఇబ్బందులు పెడుతున్నా జగన్ మాత్రం తన పని తాను చేసుకుని వెళుతున్నాడు. దాంతో చంద్రబాబు, ఎల్లోమీడియాలో కడుపుమంట ఇంకా ఎక్కువైపోతోంది.

 

సరిగ్గా ఇటువంటి సమయంలోనే రెండు రోజుల క్రితం తెలంగాణా కన్నా ఏపిలో కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. తెలంగాణాలో తాజా సమాచారం ప్రకారం 1001 కేసులుంటే ఏపిలో 1097 కేసులు నమోదయ్యాయి. చంద్రబాబు, ఎల్లోమీడియా ఇన్ని రోజులుగా కోరుకుంటున్నది కూడా ఇదేనేమో ? ఎందుకంటే ఏపి కన్నా తెలంగాణాలో కేసులు, మృతులు ఎక్కువున్న రోజుల్లో ఆ విషయాలను ప్రస్తావించటానికి చంద్రబాబు, ఎల్లోమీడియాకు ధైర్యం లేకపోయింది.

 

మొదటినుండి కూడా క్షేత్రస్ధాయిలో జరుగుతున్నదొకటైతే పచ్చబ్యాక్ ఆరోపణలు ఇంకోరకంగా ఉంటున్నాయి. అలాంటిది ఇపుడు ఏపిలో కేసులు ఎక్కువయ్యేటప్పటికి  పచ్చబ్యాచ్ కడుపుమంట తగ్గుంటుంది. కేసులు తక్కువున్న రోజుల్లోనే ఎక్కువగా ఉందంటూ నానా రచ్చ చేశారు. ఇపుడు కేసులు ఎక్కువైపోయిన నేపధ్యంలో ఇంకెంత రచ్చ చేస్తారో చూడాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: