సోష‌ల్ మీడియా రానున్న కాలంలో సామాన్యుడికి ప్ర‌చారాస్త్రంగా మార‌నుంద‌ని క‌రోనా వేళ కొన్ని సంఘ‌ట‌న‌లు నిరూపిత మ‌య్యాయి. స్మార్ట్‌ఫోన్‌, ఇంట‌ర్నెట్ ప‌రిజ్ఞానం పెంపొంద‌డం వంటి అంశాలు ఇందుకు ఎంత‌గానో దోహ‌దం చేస్తున్నాయి. నిజం చెప్పాలంటే ఈరెండు అంశాలు కూడా సోష‌ల్ మీడియాకు ప్రాణాయువుతో స‌మానం. అయితే మారుతున్న కాలమాన ప‌రిస్థితుల్లో భాగంగా చాలామందిలో స్మార్ట్‌ఫోన్‌, ఇంట‌ర్నెట్ వినియోగం, సోష‌ల్‌మీడియా ప్రాధాన్యం గుర్తిస్తూ వ‌స్తున్నారు. సోష‌ల్ మీడియాపై వాస్త‌వానికి చాలామంది మేధావులకు అపన‌మ్మ‌కమే ఎక్కువ‌ని చెప్పాలి.

 

 ఫేస్‌బుక్ అంతా వారి దృష్టిలో చాలా వ‌ర‌కు ఫేక్‌బుక్‌గానే ఉంటుంది. త‌ప్పులేదు. జ‌రుగుతున్న కొన్ని సంఘ‌ట‌న‌లు అవి నిజ‌మేన‌ని నిరూపిస్తున్నాయి. అయితే మంచిని చూడ‌టం చాలా మంది నేర్చుకోవాల్సి ఉంద‌ని సోష‌ల్ మీడియాతో సామాజిక చైత‌న్యం, రాజ‌కీయ చైత‌న్యం, అనేక స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం చూప‌గ‌లుగుతున్న వారు..లేదంటే ప‌రిష్కారం పొందిన వారు సోష‌ల్ మీడియాపై త‌ప్పుడు ఆలోచ‌న‌తో ఉన్న‌వారికి సూచిస్తున్నారు. ఇందుకు ఇటీవ‌ల క‌రోనా వేళ చాలామంది రైతులు పంట స‌రుకు అమ్మ‌కాల‌కు ఇబ్బందులు ప‌డ్డారు. అయితే తిరుప‌తి, క‌ర్నూలు, త‌మిళ‌నాడుకు చెందిన కొంత‌మంది ట‌మాట‌, అర‌టి పండించే యువ‌రైతులు త‌మ పంట ఉత్ప‌త్తుల అమ్మాకాల‌కు జ‌రుగుతున్న అన్యాయంపై సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

 

ఈ వీడియోలు చూసిన చాలామంది నేరుగా ఆ రైతుల‌కు ఫోన్ చేసి వివ‌రాలు తెలుసుకుని క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌తో త‌మ ప్రాంతాల‌కు పంట ఉత్ప‌త్తుల‌ను త‌ర‌లించేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. ఇందులో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఒక‌రిద్ద‌రు నేత‌లు కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం. దీనివ‌ల్ల అటు రైతుకు ప్ర‌యోజ‌నం చేకూరుడ‌టంతో పాటు ప్ర‌జ‌ల అవ‌స‌రాలు తీరాయి. సోష‌ల్ మీడియా ఏం చేయ‌గ‌ల‌దు అనే దానికి నిద‌ర్శ‌నం ఇది. సోష‌ల్ మీడియా అంటే టైం పాస్ కోసం కాదు..సామాజిక‌, రాజ‌కీయ‌, ఆర్థిక‌, విద్య ఇలా చెప్పుకుంటూ ఎన్ని రంగాల‌కైనా దాన్ని వ‌ర్తింప‌జేయ‌వ‌చ్చు. మాట‌ల‌తో, చ‌ర్చ‌లతో త‌మ భావ‌వ్య‌క్తీక‌ర‌ణ‌ను పంచుకోవాల‌నుకునేవారికి ఒక గొప్ప వేదిక అవుతోంది. భ‌విష్య‌త్‌లో సోష‌ల్ మీడియా సామాన్యుడికి ఆయుధంగా మారుతుందన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: