తెలుగుదేశంపార్టీకి చివరకు చంద్రబాబునాయుడే భూస్ధాపితం చేసేస్తున్నాడా ? ఇపుడిదే ప్రశ్న పార్టీ నేతలతో పాటు జనాల్లో కూడా వినిపిస్తోంది.  ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుండి  చంద్రబాబు వ్యవహరిస్తున్న విధానం చూస్తుంటే అందరికీ ఇదే అనుమానం పెరిగిపోతోంది.  అధికారంలో ఉన్నపుడు సొంత ప్రచారం చేయించుకుంటు తనను తాను బ్రహ్మాండమని భజన చేయించుకున్న విషయం అందరూ చూసిందే. ఎలాగూ అధికారంలో ఉన్నపుడు కాబట్టి అందరూ ఆహా ఓహో అని కీర్తించారు.

 

సీన్ కట్  చేస్తే మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత చంద్రబాబు కీర్తి మసకబారిపోయిందనే చెప్పాలి. చంద్రబాబుకు స్వతహాగానే ఎటువంటి నాయకత్వ లక్షణాలు లేవని వైసిపి నేతలు మొదటి నుండి ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. దానికి తగ్గట్లే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయకత్వ లక్షణాలేమిటో అందరికీ తెలిసిపోతోంది. గతంలో కూడా చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నా అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నేతలతో లోపాయికారి ఒప్పందాలు చేసుకుని ప్రభుత్వంలో (వైఎస్సార్ మినహా) కూడా తన మాటే చెల్లుబాటయ్యేట్లు చూసుకునే వాడు.

 

కానీ మొదటిసారి జగన్మోహన్ రెడ్డి రూపంలో చంద్రబాబుకు కష్టాలు ఎదురయ్యాయి. జగన్ ముందు చంద్రబాబు పాచికలు పారలేదు. దానికితోడు చంద్రబాబుకు మద్దతుగా నిలబడే ఎల్లోమీడియా ఎత్తులు కూడా పారలేదు. దాంతో  చంద్రబాబులో ఐడెంటి క్రైసిస్ పెరిగిపోయి  ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు. దాంతో జగన్ ప్రభుత్వంపై నోటికొచ్చినట్లు ఆరోపణలు, విమర్శలు చేస్తున్నాడు. 24 గంటలూ జగన్ ప్రభుత్వంపై పసలేని ఆరోపణలు చేస్తుండటంతో జనాల్లో కూడా పలుచనైపోతున్నాడు.

 

తనను ఓడించాడన్న ఏకైక కారణంతోనే జగన్ పై చంద్రబాబు కచ్చ పెంచుకుని నోటికొచ్చిన ఆరోపణలు చేస్తు తన స్ధాయిని తానే దిగజార్చేసుకుంటున్నాడు. దాని ప్రభావం పార్టీ మీద పడుతోంది. ఎందుకంటే ఇష్టమున్నా లేకపోయినా నేతలు కూడా చంద్రబాబునే ఫాలో అవుతుండటంతో  జనాల్లో వ్యతిరేకత వచ్చేస్తోంది. అంటే ప్రతిపక్షంలోకి వచ్చిన ఏడాదిలోనే చంద్రబాబు ప్రతిపక్షనేతగా కూడా పనికిరాడనే అభిప్రాయం జనాల్లో పెరిగిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: