ఇప్పటి వరకు జనాలకు బ్రేకింగ్ లు చూపించింది మీడియా. అయితే ఇప్పుడు అదే మీడియా సంస్థలు తమ ఇంటిని చక్కదిద్దుకునే క్రమంలో తానే ఒక బ్రేకింగ్ న్యూస్ గా మారిపోయింది. బాబోయ్ ఈ మీడియా కు ఏదో అయిపోతోంది.  మంచి కాలమా చెడ్డకాలమా అన్నది పక్కన పెట్టేద్దాం ! మొత్తానికి మీడియాలో అనూహ్యంగా మార్పులు చేర్పులు జరిగిపోతున్నాయి. మీడియా తెరవెనుక జరుగుతున్న వ్యవహారాలన్నీ ఇప్పుడు జనాల్లోకి శరవేగంగా వెళ్లిపోతున్నాయి. అంతేనా రాజకీయ వార్తలపై ఎంతగా ఆసక్తి చుపిస్తున్నారో అంతే స్థాయిలో మీడియా విషయంలో తెర వెనుక జరుగుతున్న పరిణామాలను తెలుసుకునేందుకు జనాలు అంతే స్థాయిలో ఆసక్తి కనబరుస్తున్నారు. కరోనా ప్రభావం మొదలయినప్పటి నుంచి మీడియా వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తీసివేతలు, జీతాల కోతలు ఇలా ఎన్నో పరిణామాలు మీడియా సంస్థల్లో వేడి పుట్టిస్థూ వస్తున్నాయి. 

 

ఇక ఇప్పుడు ఈ ఛానెల్ నుంచి ఆ ఛానెల్ కి, ఆ ఛానెల్ నుంచి ఈ ఛానెల్ లోకి జంపింగ్స్ పెరిగిపోయాయి. అదికూడా ఒకేరోజు ఈ పరిణామాలు చోటుచేసుకోవడం మరింత హాట్ టాపిక్ గా మారింది. అసలు మీడియా ఛానెల్స్ అంటే బోలెడంత వార్తల సమాహారం. వాటిన్నిటికంటే ఉదయం, మధ్యాహ్నం అనే తేడా లేకుండా నిర్వహించే డిబేట్లు ఛానెల్స్ కు ప్రధాన ఆకర్షణ. అక్కడ జరిగే చిన్న సైజు యుద్దానికి కీపర్ గా ఉండే జర్నలిస్ట్ అంటే ఆషామాషీ కాదు. అన్ని విషయాలపైనా పూర్తిగా పట్టు ఉండాలి. అందుకే ఛానెల్స్ డిబేట్లు నిర్వహించే రిపోర్టర్ల కు భారీ జీతాలు ఇచ్చేందుకు వెనకాడవు. 

 

ఇక జంపింగ్ ల గురించి చెప్పుకుంటే ..! ఏపీలో మొట్టమొదటి న్యూస్ ఛానెల్ గా రంగప్రవేశం చేసిన ap 24 /7 ఛానెల్ లో డిబేట్లు నిర్వహించే సీనియర్ జర్నలిస్ట్ వెంకట కృష్ణ ఈ రోజు వేమూరి రాధాకృష్ణ ఆధ్వర్యంలోని abn  ఆంధ్ర జ్యోతిలో వచ్చి చేరారు. 
గతంలో ఏబీఎన్ లో మూర్తి డిబేట్ లకు మంచి క్రేజ్ ఉండేది. ఆయన తమ చానల్ భావజాలానికి అనుగుణంగా డిబేట్ లు నిర్వహించడం లో బాగా ఆరితేరి పోయారు. ఆయన ఆ చానల్ నుంచి బయటకు వెళ్లిపోయిన తర్వాత ఆ కుర్చీ లో మరి ఎవరూ అంతగా సెట్ కాలేదు. ఇప్పుడు వెంకటకృష్ణ ఆ ప్లేస్ లోకి వస్తుండడం ఏబీఎన్ కు కాస్త ఊరట నిచ్చే అంశమే. 

 

ఇక టీవీ9 లో పాపులర్ రిపోర్టర్ గా ముఖాముఖీ కార్యక్రమాలతో మంచి పేరు తెచ్చుకున్న జాఫర్ అనూహ్యంగా బిగ్ బాస్ లో స్థానం దక్కించుకున్నారు. దీంతో అప్పట్లో ఆయన టీవీ9 ఛానల్ వదిలేయాల్సి వచ్చింది. ఆ తర్వాత టీవీ 5 లో చేరినా, అందులో ఆయన కంఫర్ట్ గా ఇమడలేకపోయారు. ఇప్పుడు ఆ ఛానల్ నుంచి బయటికి వచ్చేశారు. ఇప్పుడు prime 9 చానల్ చేరినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు prime 9 ఛానల్ లో ఉన్న జర్నలిస్టు సాయి దానికి రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానంలోకి జాఫర్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే జర్నలిస్టు సాయి ఏ ఛానల్ లో చేరబోతున్నారనే ఉత్కంఠ కొద్ది సేపు నడిచినా ఆయన వెంకటకృష్ణ ఖాళీ చేసిన ap 24/7 చానల్లో చేరినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపైన ఇంకా పూర్తిగా క్లారిటీ లేదు. కాకపోతే తాను prime 9 చానల్ వదిలిపెట్టినట్టు సాయి క్లారిటీ ఇచ్చేశాడు. 

 

IHG

ఇప్పటికే సాయి పనిచేసిన ప్రైమ్ లైన్ లోకి పత్రి వాసుదేవరావు అనే  సీనియర్ జర్నలిస్టు వచ్చి చేరారు.మరి జాఫర్ పరిస్థితి ఏమిటనేది ఇంకా క్లారిటీ లేకుండా ఉంది. ఆయన ఇంకా వెయిటింగ్ లో ఉన్నట్టు సమాచారం. ఇక టీవీ ఫైవ్ లో డిబేట్ ప్రజెంట్ గా ఉన్న మూర్తి పై ఏపీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో టార్గెట్ పెట్టింది. ఆయన ఏ క్షణమైనా అరెస్టు అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ మూర్తి అరెస్ట్ అయితే ఆయన స్థానంలో ఎవరైనా వస్తారా లేక యధావిధిగా tv5 సాంబశివరావు తోనే డిబేట్ లు నడిపిస్తారా అనేది తేలాల్సి ఉంది. ఎలా ఒకేరోజు మీడియా లో పాపులర్ డిబేట్ రిపోర్టర్లుగా ఉన్న ఇంతమంది అటు ఇటు మారడం మీడియా సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: