కార్మిక నాయ‌కుడిగా గుర్తింపు పొందిన చాలామంది నేత‌లు..రాజ‌కీయాల్లోనూ రాణించారు. అయితే ఉన్న‌త‌స్థానాల‌కు ఎదిగిన వారు మాత్రం అరుదు అనే చెప్పాలి. కార్మిక కుటుంబం నుంచి అంచ‌లంచెలుగా ఎదుగుతూ ఈరోజు మంత్రి హోదాలో కొన‌సాగుతున్న త‌ల‌సాని శ్రీనివాస్‌యాద‌వ్ జీవితం నేటిత‌రం కార్మిక‌, ఉద్యోగ సంఘాల నాయ‌కుల‌కు ఎంతో స్ఫూర్తినిస్తుంద‌ న‌డంలో ఎలాంటి సందేహం లేదు. మే డే సంద‌ర్భంగా ఆయ‌న గురించి అంద‌జేస్తున్న ప్ర‌త్యే క క‌థ‌నం ఇది. srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ 1965, అక్టోబరు 6న సికింద్రాబాద్, మోండా మార్కెట్ లోని మధ్యతరగతి కుటుంబమైన తలసాని వెంకటేశ్‌యాదవ్, లలితాభాయి దంపతులకు జన్మించాడు.

 

ఆయన తండ్రి వెంకటేష్‌యాదవ్ మోండా మార్కెట్‌కు అధ్యక్షుడిగా పనిచేశాడు. దీంతో చిన్న‌త‌నం నుంచి తండ్రి నాయ‌క‌త్వం ల‌క్ష‌ణాల‌ను ద‌గ్గ‌ర నుంచి గ‌మ‌నించాడు. ఇంటిలో ఎప్పుడూ కార్మికుల సంద‌డి క‌నిపించేది. కార్మికుల క‌ష్టాలు, క‌న్నీళ్లు, స‌మ‌స్య‌లు, ప‌రిష్కారాలను తండ్రి వ‌ద్ద గ‌మ‌నిస్తూ నేర్చుకున్నాడు. తండ్రి ద‌గ్గ‌ర నుంచి నేర్చుకున్న నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు ఆయ‌నకు భ‌విష్య‌త్‌లో ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ్డాయ‌ని చెప్పాలి. ఆయ‌న రాజ‌కీయాల్లో నిల‌దొక్కుకోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం మాస్ లీడ‌ర్ అనే గుర్తింపు ద‌క్క‌డ‌మేన‌ని చెప్పాలి. ప్ర‌భుత్వంలో ఉన్నా..ప్ర‌తిప‌క్షంలో ఉన్నా పేద‌వాళ్ల‌కు అండ‌గా నిలుస్తూ ప్ర‌జా, కార్మిక ప‌క్ష‌పాతి అనే ముద్ర‌ను ఎక్క‌డా నేటికి చెరిపేసుకోలేదు.

 

 ప్ర‌త్య‌క్షంగా కార్మిక సంఘాల్లో ప‌నిచేయ‌న‌ప్ప‌టికి...ఎంతో మంది కార్మిక సంఘాలకు, నాయ‌కుల‌కు త‌న స‌ల‌హాలు సూచ‌న‌ల‌తో ప‌రిష్కారం చూప‌గ‌లిగారు. కార్మికుల్లో, పేద‌లు ఆయ‌న‌కు అండ‌గా నిల‌వ‌డంతోనే మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం నుంచి అది హైద‌రాబాద్‌లాంటి ఎంతో వ్య‌య ప్ర‌యాసాలుండే ఎన్నిక‌ల్లో విజ‌య సాధిస్తూ వ‌చ్చారు. ఉమ్మ‌డి రాష్ట్ర రాజ‌కీయాల‌పై, ప్ర‌స్తుత తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల‌పై చెర‌గ‌ని ముద్ర వేయ‌గ‌లిగారు. 1986లో రాజకీయ అరంగ్రేటం చేసి, 1986లో 1986లో మోండా డివిజన్ నుంచి ఎంసిహెచ్‌కు కార్పోరేటర్‌గా పోటీచేశాడు.

 

1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి మేరీ రవీంద్రనాథ్‌ను ఓడించి ఎంఎల్‌ఎగా మొదటిసారి గెలిపొందాడు. 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి మరోసారి గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నాడు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి టి. పద్మారావు గౌడ్ చేతిలో ఓడిపోయాడు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో 2008 జరిగిన ఉప ఎన్నికల్లో శ్రీనివాస్ యాదవ్ భారీ మెజారిటీతో గెలుపొందాడు. 

 

2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ చేతిలో ఓటమి చెందాడు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక సనత్‌నగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించాడు. తరవాత జరిగిన పరిణామాలతో తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు మంత్రిమండలిలో మంత్రిగా బాధ్యతలను చేపట్టాడు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సనత్‌నగర్ నుంచి టిఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి, కెసిఆర్ మంత్రిమండలిలో పశుసంవర్థక శాఖ మంత్రిగా నియామకమయ్యాడు.  

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పర్యాటక, కార్మికశాఖ మంత్రిగా పనిచేశాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత 2014లో కెసీఆర్ తొలి మంత్రివర్గంలో పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల బాధ్యతలు నిర్వర్తించాడు. 2019లో కెసీఆర్ రెండవ మంత్రివర్గంలో పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా ఉన్నాడు

మరింత సమాచారం తెలుసుకోండి: