మీడియా వ్యవహారాలు తెలుగు రాష్టాల్లో నిజంగానే మంటలు రేపుతున్నాయి. ఒకవైపు కరోనా, మరోవైపు రాజకీయ విమర్శలు, మరో వైపు మీడియా లో ప్రభుత్వ వ్యతిరేక కథనాలు ఇలా అన్ని రకాలుగా ఏపీ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటోంది. ఇప్పుడు ఈ సంగతులన్నీ పక్కనపెడితే వైసీపీ దగ్గర ఉన్న పచ్చ మీడియా లిస్ట్ లో టీవీ 5 కూడా ఉంది. ఊడడం ఏంటి దానికి తగ్గట్టుగానే జగన్ కు, ఆ పార్టీకి సంబంధించి ఎప్పుడూ వ్యతిరేక కథనాలు వండి వార్చుతూనే ఉన్నారు. ఇది మొదటి నుంచి ఉన్నదే అయినా, టీవీ 5 లో న్యూస్ డిబేట్ ప్రెజంటేర్ గా ఉన్న మూర్తి అనే మహానుభావుడు జగన్ , ఆ పార్టీని బద్నామ్ చేయడమే లక్ష్యం గా పావులు కదుపుతూ చర్చ కార్యక్రమాలు నిర్వహిస్తూ, చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. 

 


ఇది సహజంగానే జగన్ ఆందో కో కు నచ్చడంలేదు. రాజధాని విషయం మొదలుకొని, కరోనా వరకు అన్ని విషయాల్లోనూ ప్రభుత్వాన్ని ఏకిపారేయ్యడం ఒక్కటే లక్ష్యం గా ముందుకు వెళ్తున్నారు. ఇంకేముంది సహజంగానే జగన్ కు, ఆ పార్టీ నేతలకు ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఈ మధ్య కాలంలో సదరు మూర్తి శృతి మించి మరీ జగన్ ప్రభుత్వంపై బురద జల్లడంతో ఇప్పడూ ఆయనను కట్టడి చేసి తమ వ్యతిరేక అంటే పచ్చ మీడియాగా పిలవబడే అన్ని మీడియా సంస్థలకు గట్టి వార్నింగ్ ఇచ్చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే మూర్తిని కట్టడి చేసేందుకు ఏకంగా ఆయన మీద మూడు కేసులు నమోదు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే వాటిలో నిజమెంతో తెలియదు. కాకపోతే మూర్తి కోసం వేట కొనసాగుతున్నట్టు పెద్ద ఎత్తున రాద్ధాంతం అయితే జరుగుతోంది. 

 


 అసలు టీవీ 5  మూర్తిపై ప్రభుత్వం కేసులు పెట్టిందో .. పెట్టడానికి ట్రై చేయడానికి కారణం అయిన వార్తలు ఏంటి అంటే ..? సుధాకర అనే ఓ డాక్టర్ చెప్పిన అబద్దపు వాదనను హైలెట్ చేయడం, పాత వీడియోతో సచివాలయ ఉద్యోగి చిందులు అనే వార్తను హైలెట్ చేసి ప్రభుత్వంపై బురద చల్లడం, కరోనా లెక్కల్లో ప్రభుత్వం అబద్దం చెబుతుంది అనే విధంగా మూర్తి పదే పదే సదరు మీడియాలో వాదించడం ఇవ్వన్నీ ఆయన పై కేసు నమోదు చేయడానికి కారణంగా ప్రభుత్వం దగ్గర ఉన్న కారణాలుగా తెలుస్తోంది.

 

మూర్తిని ఇంకా ప్రభుత్వం అరెస్ట్ చేయకముందే మీడియాపై జగన్ ఉక్కుపాదం మోపుతోందంటూ పెద్ద ఎత్తిన వైసీపీ వ్యతిరేక మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే మూర్తి చేసింది నూటికి నూరుపాళ్లు తప్పే అనుకున్నా జగన్ ప్రభుత్వం ఇలా వెంటాడి వేధించడం చివరకు వాళ్ళు దానిని సానుభూతిగా మార్చుకుని ప్రభుత్వం పై మరింత వ్యక్తిరేకత పెరిగేలా చేయడం, ఎక్కడలేని హడావుడి చేయడం ఇవన్నీ జరిగిపోతున్నాయి. అసలు సదరు ఛానెల్స్ లో ప్రభుత్వ వ్యతిరేక కథనాలు రావడం కొత్తేమి కాదు. వైసీపీ ప్రతిపక్షంలోఉన్నప్పటి నుంచి ఇదే రకమైన ప్రచారం, ఎదురు దాడి జరుగుతూనే వస్తోంది. అయినా ప్రజలు ఎవరూ నమ్మలేదు కదా.. ? నమ్మి ఉంటే ఇన్ని సీట్లు వచ్చి ఉండేవి కాదు కదా ? 

 


గతంలో వైసీపీ సోషల్ మీడియా విభాగం  ప్రభుత్వం వ్యతిరేక కథనాలు వస్తున్నాయని ఎంతో మందిని టీడీపీ ప్రభుత్వం అరెస్ట్ చేయించింది. అప్పుడు కూడా జగన్ పార్టీ నాయకులూ ఇంతే స్థాయిలో రాద్ధాంతం చేశారు. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అదే సీన్ రిపీట్. అయితే ఇక్కడ జగన్ కాస్త అలోచించి అడుగులు వేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక వేళ మూర్తిని అరెస్ట్ చేస్తే జరిగే రాద్ధాంతం అంతా ఇంతా కాదు. ఇదంతా తిరిగి జగన్ ప్రభుత్వం మీదే బురద పడుతుంది. తరువాత కడుక్కుందామనుకునే లోపు టీడీపీ దానిపై రాద్ధాంతం చేసి మరింత బురద జల్లడం ఖాయం. కాబట్టి అలోచించి జగన్ అడుగులు వేస్తే మంచిది లేకపోతే అవి తప్పటడుగులుగా మిగిలిపోయే ప్రమాదం లేకపోలేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: