విచిత్రంగా ఉంది ప్రధానమంత్రి నరేంద్రమోడి వ్యవహారం. మొదటి నుండి కూడా తాను ఏమనుకుంటాడో దాన్ని వెంటనే ఆచరణలోకి తెచ్చేస్తున్నాడు. మోడి వైఖరి వల్ల అంతిమంగా జనాలు ఇబ్బందుల్లో పడిపోతున్నారు. అప్పట్లో పెద్దనోట్ల రద్దంటూ మోడి హఠాత్తుగా చేసిన ప్రకటన వల్ల యావత్ దేశం ఇప్పటికి కూడా ఎంతగా ఇబ్బంది పడుతోందో అందరూ చూస్తున్నదే. తాజాగా లాక్ డౌన్ అంటూ చేసిన ప్రకటన వల్ల కూడా జనాలు అంతే ఇబ్బంది పడుతున్నారు.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కరోనా వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా హఠాత్తుగా మార్చి 24వ తేదీన దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అంటూ ప్రకటించాడు. దాంతో దేశవ్యాప్తంగా వివిధ రంగాలు ఎక్కడికక్కడ షట్టర్లు మూసేసింది. దాంతో ముందు ప్రభావం పడింది వలస కార్మికుల మీద. ఎందుకంటే వలస కార్మికులు ఎక్కడెక్కడి వాళ్ళో దేశంలోని మారు మూల ప్రాంతాల్లో కూడా పనుల కోసమని వెళ్ళారు. లాక్ డౌన్ కారణంగా వివిధ రంగాల్లాగే రవాణా సౌకర్యాలు కూడా స్తంభించిపోయాయి.

 

ఓ అంచనా ప్రకారం దేశవ్యాప్తంగా 12 కోట్లమంది వలసకార్మికులు ఎక్కడెక్కడో ఇరుక్కుపాయారు. దాదాపు 40 రోజుల తర్వాత రాష్ట్రప్రభుత్వాల నుండి వచ్చిన ఒత్తిడి కారణంగా కేంద్రం కూడా ప్రత్యేక రైళ్ళు నడిపి వలస కార్మికులను వాళ్ళ సొంతూర్లు చేరుకునేందుకు రైళ్ళు నడుపుతున్నాయి. అయితే వలస కార్మికులు చెల్లించాల్సిన టికెట్ ఖరీదుని ఆయా రాష్ట్రప్రభుత్వాలే చెల్లించాలంటూ రైల్వేశాఖ మెలిక పెట్టటమే విచిత్రంగా ఉంది. ప్రత్యేక రైళ్ళు వేశాము కాబట్టి అదనపు ఛార్జీలు కూడా చెల్లించాలని రైల్వేశాఖ ప్రకటించటంతో రాష్ట్రాలకు మండిపోయింది.

 

నిజానికి వలస కార్మికుల కోసం కేంద్రం రైళ్ళను ఉచితంగా నడుపుతుందనే అందరూ అనుకున్నారు. ఎందుకంటే ముందు వెనకా ఆలోచంచకుండా మోడి చేసిన లాక్ డౌన్ ప్రకటన వల్లే వలసకార్మికులు ఎక్కడెక్కడో ఇరుక్కుపోయారన్నది వాస్తవం. ఎక్కడివాళ్ళు ఇంకెక్కడో ఇరుక్కుపోయారు కాబట్టే ఆయా రాష్ట్రప్రభుత్వాలు వాళ్ళకందరికీ క్యాంపులు రన్ చేసి భోజన సౌకర్యాలు కల్పిస్తున్నాయి. మోడియే కాస్త ఆలోచించి లాక్ డౌన్ విధించేందుకు ముందు ఓ వారం రోజులు ప్రత్యేక రైళ్ళు ఏర్పాటు చేసుంటే వీళ్ళే టిక్కెట్లు కొనుక్కుని వాళ్ళ సొతూర్లకు వెళ్ళిపోయేవారే. కానీ వాళ్ళకు ఆ అవకశం ఇవ్వక పోవటం మోడి తప్పే.

 

అంటే అప్పట్లో తాను చేసిన తప్పుకు ఇపుడు ప్రత్యేక రైళ్ళ ఖర్చులను రాష్ట్రాల నుండి రాబట్టాలని కేంద్రం డిసైడ్ చేయటమే విచిత్రంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్ మేరకే వలసకార్మికుల కోసం కేంద్రం ప్రత్యేకంగా రైళ్ళు ఏర్పాటు చేసిన మాట వాస్తవమే. మరి అదే సమయంలో ఎక్కడి రాష్ట్రం వాళ్ళకో మరో రాష్ట్రంలో ఏర్పాటు చేసిన బస, వసతి, భోజన సౌకర్యాలకు అయిన ఖర్చుల మాటేమిటి ? దాన్ని కేంద్రం తిరిగి చెల్లిస్తుందా ?  

 

మరింత సమాచారం తెలుసుకోండి: