కరోనా వైరస్ సంక్షోభ సమయంలో చాలా దేశాలతో పోల్చుకుంటే ఏపిలో జగన్మోహన్ రెడ్డే బెస్ట్ అనిపించుకుంటున్నాడు. వైరస్ నియంత్రణ, చేస్తున్న పరీక్షలను గమనించినపుడు చాలా దేశాలకన్నా ఏపిలోనే బాగా ఎఫెక్టివ్ గా జరుగుతున్నట్లు అర్ధమవుతోంది. ఏపిలో  ప్రతి పది లక్షల మంది జనాలకు 2345 మందికి కరోని వైరస్ నిర్ధారిత పరీక్షలు నిర్వహించటమంటే మామూలు విషయం కాదు.  ఎంతో అభివృద్ధి జరిగిన జపాన్ లో కూడా పది లక్షల మందికి నిర్విహిస్తున్న పరీక్షలు 1377 మాత్రమే. ఇవే పరీక్షలు బ్రెజిల్ లో 1597 కావటం గమనార్హం.

 

అలాగే పరీక్షలు నిర్వహిస్తున్న  ప్రతి 76 మందిలో ఒకరికి కరోనా వైరస్ గుర్తిస్తున్నారు. ఇదే రేషియో దక్షిణకొరియాలో 58 మందికి ఓ కేసు, చెక్ రిపబ్లిక్ కు 33 మందికి ఓ కేసు గుర్తిస్తున్నారు. ఇండియా సగటు తీసుకున్న ప్రతి 26 పరీక్షల్లో ఒకరిని గుర్తిస్తున్నారు. అమెరికాలో 6.2, బ్రిటన్లో 4.7 గా ఉంది రేషియో. అంటే చాలా దేశాలతో పోల్చుకుంటే నిర్వహిస్తున్న పరీక్షలు, గుర్తిస్తున్న కేసు దామాషా ఏపిలోనే చాలా బాగుందనే విషయం అర్ధమైపోతోంది.

 

ఈనెల 4వ తేదీ రాత్రికి ఏపిలో 1,25,229 మందికి పరీక్షలు నిర్వహించింది ప్రభుత్వం. రాష్ట్రంలో రిజస్టర్ అయిన కేసులు 1717. పాజిటివ్ కేసుల శాతం కూడా 1.32 మాత్రమే. ఇదే జాతీయ సగటు సుమారు 4.3 ఉంది.  మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యల కారణంగానే వైరస్ వ్యాప్తి నియంత్రణలో ఉందన్న విషయం అందరికీ అర్ధమైపోతోంది. వైరస్ వ్యాప్తి అదుపులోకి లేకపోవటంతోనే చంద్రబాబునాయుడు తో పాటు ప్రతిపక్షాల నేతలు, ఎల్లోమీడియా తెగ బాధపడిపోతున్నట్లు అనుమానంగా ఉంది.

 

జగన్ తీసుకుంటున్న చర్యలను చూడలేని వాళ్ళంతా ఎక్కడెక్కడ లోపాలు కనిపిస్తాయా ? బొక్కలు బయటపడతాయా ? అనే వెతుకుతున్నారు. మద్యం షాపులు తెరవటం అన్నది జాతీయ స్ధాయిలో ప్రధానమంత్రి నరేంద్రమోడి తీసుకున్న నిర్ణయం. మోడి నిర్ణయం ప్రకారమే ఏపిలో మద్యంషాపులు తెరుచుకున్నాయి. ఈ విషయం తెలిసి కూడా జగన్ సొంత ఆలోచనతోనే మద్యం షాపులు తెరిచేసినట్లుగా గోల చేసేస్తున్నారు.

 

ఇదే సమయంలో మద్యం ధరలు 75 శాతం పెంచాలన్న నిర్ణయం మాత్రం జగన్ దే. దీనిపై  కూడా ప్రతిపక్షాలతో కలిసి ఎల్లోమీడియా నానా యాగీ చేస్తోంది. మద్యం ధరలు పెంచటం అన్నది ప్రభుత్వం ఇష్టం. పెరిగిన ధరలకు మద్యాన్ని కొనుక్కోవాలా ? వద్దా అన్నది జనాలిష్టం. మద్యం ధరలను ప్రభుత్వం పెంచినా ఇష్టపడిన వాళ్ళు కొనుక్కుంటున్నారు. మధ్యలో చంద్రబాబు అండ్ కో , ఎల్లోమీడియాకు ఏమిటి నొప్పో అర్ధం కావటం లేదు. చూస్తుంటే జగన్ ఎలాగైనా గబ్బు పట్టించాలన్న ఏకైక టార్గెట్టే కనిపిస్తోందంతే.

మరింత సమాచారం తెలుసుకోండి: