లెజండ్ సినిమాలో ఓ డైలాగుంది ’చూడు ఓ వైపే చూడు...రెండో వైపు చూడాలని ప్రయత్నించకు’ అని. సినిమాలో ఆ డైలాగ్ చాలా పాపులరైంది. నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమాలో డైలాగ్ నే ఎల్లోమీడియా తుచ తప్పకుండా ఫాలో అయిపోతున్నట్లుంది చూస్తుంటే. ఎల్లోమీడియా రెండు టార్గెట్లతో నడుస్తోంది. మొదటిదేమో  ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు ప్రయోజనాలను కాపాడుకోవటం. ఇక రెండోదేమో జగన్మోహన్ రెడ్డి పై వీలైనంత బురద చల్లేయటం. చేస్తున్నది మంచా చెడా అన్న నిమ్మితం లేకుండా జగన్ పై బురద చల్లేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే.

 

అధికారంలో ఉన్నంత కాలం చంద్రబాబు చేసిన అరాచకాలు, అవినీతి ఎల్లోమీడియాకు కనబడలేదు. టిడిపి నేతల దోపిడి, దాష్టికాలు ఎల్లోమీడియా దృష్టిలో పడలేదు. మొత్తం ఐదేళ్ళ చంద్రబాబు పాలనలో జనాగ్రహాన్ని బయటపడకుండా ఎల్లోమీడియా కవర్ చేసింది. దాని ఫలితమే మొన్నటి ఎన్నికల్లో టిడిపికి 23 సీట్లు రావటం. సరే అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు, ఎల్లోమీడియా తప్పులు చేయబట్టే దారుణ ఫలితాలు వచ్చాయని అనుకుందాం. మరి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాతైన చంద్రబాబు తప్పులను దిద్దుకోవాలి కదా ?  పార్టీలోని లోపాలేంటో ఎల్లోమీడియా బయటపెట్టాలి కదా. ఇపుడు కూడా ఎల్లోమీడియా చంద్రబాబును మభ్యపెట్టటమే పనిగా పెట్టుకున్నది. అందుకనే జగన్ పై బురద చల్లేస్తోంది.

 

జగన్ తీసుకుంటున్న ప్రయోపయోగ నిర్ణయాలను కూడా తప్పు పడుతూ జనాగ్రహానికి గురవుతోంది. ఎల్లోమీడియాలో అచ్చయ్యిందో బ్రహ్మాండమంటూ చంద్రబాబు అండ్ కో కూడా జగన్ పై రెచ్చిపోతున్నారు. అంటే రాష్ట్రంలో మెజారిటి మీడియా జగన్ వెంటపడటానికి మాత్రమే ఉందన్న విషయం జనాలందరికీ అర్ధమైపోయింది. జగన్ మంచి చేస్తున్న ఎల్లోమీడియా తప్పుడు వార్తలు, కథనాలతో తమను తప్పుదోవ పట్టిస్తోందన్న విషయాన్ని కూడా జనాలు గ్రహించారు.

 

అందుకనే చంద్రబాబు అండ్ కో ఎన్ని ఆరోపణలు చేసినా, ఎల్లోమీడియా ఎన్ని వార్తలు, కథనాలు వండి వారుస్తున్నా జనాలు మాత్రం చాలా లైటుగా తీసుకుంటున్నారు. తాను చెప్పిన మాటలను జనాలు పట్టించుకోవటం లేదన్న ఫ్రస్ట్రేషన్ చంద్రబాబులో కొట్టొచ్చినట్లు కనబడుతోంది. కరోనా వైరస్ నియంత్రణ, మద్యం షాపులు తెరవటం లాంటి ప్రతి విషయంలోను జగన్ ను ఎంత వీలైతే అంత గబ్బు పట్టిచ్చేద్దామన్న దురాలోచనే చంద్రబాబు, ఎల్లోమీడియాలో బాగా కనబడుతోంది.

 

మొత్తం మీద జనాల్లో చంద్రబాబు, ఎల్లోమీడియా విశ్వసనీయత కోల్పోయిన మాట వాస్తవం. ఆపత్కాలంలో జనాలకు మంచి చేస్తున్న వాలంటీర్ల వ్యవస్ధపై కూడా చంద్రబాబు, ఎల్లోమీడియా బురద చల్లేస్తోంది. భారీ వర్షాలు, వరదల వల్ల ఇసుక కొరత వస్తే దాన్ని జగన్ చేతకానితనంగా అభివర్ణించింది. మొత్తం మీద జగన్ పాలనలో బొక్కలెక్కడ కనబడతాయా అన్న విషయం మీదనే ఫోకస్ పెట్టింది కానీ టిడిపికి పడిన గండిని పట్టించుకోవటం లేదు. అందుకనే ఎల్లోమీడియా వ్యవహారం బాలయ్య సినిమాలో డైలాగ్ గుర్తుకువస్తోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: