హెచ్‌-1బి వీసాలతో అమెరికా బాట పడుతున్న నిపుణులకు అక్కడ లభించే వేతనాలు తక్కువేనని తాజా నివేదిక ఒకటి అస‌లు విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టింది. వీసా నిబంధనలను కంపెనీలు త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకుంటున్నాయి. ఇందులో ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతిగాంచిన సంస్థ‌లు కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం. చాలా సంస్థలు హెచ్‌-1బి వీసాదారులకు స్థానిక సగటు జీతాలతో పోలిస్తే తక్కువ మొత్తాలను అంద‌జేస్తున్న‌ట్లు  ‘హెచ్‌-1బి వీసాలు, ప్రస్తుత వేతన స్థాయులు’ పేరుతో ‘ఎకానమిక్‌ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌’ ఈ నివేదికను విడుదల చేసింది.  ఫేస్‌బుక్‌, గూగుల్‌, అమెజాన్‌, యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి దిగ్గజ కంపెనీలూ అదే తీరును అనుసరిస్తున్నాయి.

 

 హెచ్‌-1బి వీసాపై అమెరికాలో దాదాపు 5 లక్షలమంది విదేశీయులు పనిచేస్తున్నారు.తాజా నివేదిక ప్రకారం.. 60% మంది హెచ్‌-1బి వీసాదారులు స్థానిక సగటు వేతనాలతో పోలిస్తే తక్కువ మొత్తాలతో సరిపెట్టుకుంటుండటం గ‌మ‌నార్హం. అలా తక్కువ వేతనాలతో సిబ్బందిని స‌మ‌కూర్చుకునేందుకు వీసా నిబంధనలు అనుమతిస్తున్నాయి. అయితే ఇలాంటి దోపిడీ వ్య‌వ‌స్థ‌ను అరిక‌ట్ట‌డానికి అమెరికా కార్మిక విభాగానికి అధికారం ఉన్నా ప‌ట్టించుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇలా య‌థేచ్ఛ‌గా  శ్ర‌మ దోపిడీకి పాల్ప‌డుతున్న టాప్‌-30 అమెరికా కంపెనీల్లో అమెజాన్‌,  గూగుల్‌, యాపిల్‌, ఫేస్‌బుక్ , మైక్రోసాఫ్ట్‌, వాల్‌మార్ట్ వంటి పెద్ద కంపెనీలు ఉండ‌టం విశేషం. 


ఈ సంస్థలు తాత్కాలిక పనుల వీసా పద్ధతిలో విదేశాల నుంచి ఉద్యోగులను తీసుకుంటున్నాయి. ఈ వీసా పద్ధతిలో ఉద్యోగులకు తక్కువ వేతనాలు చెల్లిస్తున్నాయి. ఈ హెచ్ 1బి వీసాను నాన్ ఇమ్మిగ్రేంట్ వీసాగా పరిగణిస్తారు. దీనిని ప్రాతిపదికగా చేసుకుని అమెరికా కంపెనీలు ఇండియా, చైనా నుంచి అతి ఎక్కువగా సాంకేతిక నిపుణులను ఉద్యోగాలలోకి తీసుకుంటున్నా యి.అమెరికాలో సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొనే వ‌ర‌కే ఇలాంటి విధానం కొన‌సాగుతుంద‌ని, ఆ త‌ర్వాత అంతా స‌ర్దుకుంటుంద‌ని అక్క‌డి కంపెనీల యాజ‌మాన్యాలు ఉద్యోగుల‌కు చెబుతుండ‌టం గ‌మ‌నార్హం.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: