చైనా నుంచి త‌ర‌లివెళ్తున్న అంత‌ర్జాతీయ ఐటీ సంస్థ‌ల‌ను భార‌త్‌కు ర‌ప్పించేందుకు ప్ర‌ధాన‌మంత్రి మోదీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే స్వ‌యంగా భార‌త్‌లోని ప‌లు రాష్ట్రాల‌కు చెందిన ప్ర‌భుత్వాలు సైతం నేరుగా ఆయా కంపెనీల యాజ‌మాన్యాల‌తో ట‌చ్‌లోకి వెళ్ల‌డం గ‌మ‌నార్హం. భార‌త్ సంస్థ‌ల స్థాప‌న‌కు ఇప్ప‌టికే ప‌లు సంస్థ‌లు ప‌చ్చ ఊపిన విష‌యం విదిత‌మే. భార‌త ప్ర‌భుత్వం చైనాలో ఉన్న ఐటీ, వ్యాపార సంస్థ‌ల‌ను ఆక‌ర్షిస్తూ ఇక్క‌డ స్థాపింప‌జేయ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకుంది. వెయ్యికి పైగా సంస్థ‌ల స్థాప‌న దిశ‌గా అడుగులు పడుతున్న‌ట్లు తెలుస్తోంది. 

 

ఇవ‌న్నీ కూడా అమెరికా దేశానికి చెందిన యాజ‌మాన్యాల‌వే కావ‌డం గ‌మ‌నార్హం. సంస్థ‌ల స్థాప‌న‌కు చైనాను స్వ‌ర్గ‌ధామంగా భావిస్తుంటారు అమెరిక‌న్లు. చైనా ప్రపంచంలోనే అతిపెద్ద రెండో ఆర్థిక వ్యవస్థగా కొన‌సాగుతోంది.  అనేక దేశాల పెట్టుబడిదారులు అక్కడ ఎన్నో తయారీ కర్మాగారాలను స్థాపించ‌డంతోనే డ్రాగ‌న్ కంట్రీకి బాగా క‌ల‌సి వ‌చ్చింది. ఇక్క‌డ చౌక ధ‌ర‌ల‌కు భూమి ల‌భించ‌డ‌మే కాకుండా కార్మిక చ‌ట్టాల‌ను చాలా సుల‌భ‌త‌రం చేసేశారు. పేరుకే క‌మ్యూనిస్టు దేశం అన్న‌ట్లు గాని అనుస‌రించే వ‌న్ని పెట్టుబ‌డిదారుల‌కు అనుకూలంగా ఉండ‌టం డ్రాగ‌న్ కంట్రీ ప్ర‌త్యేక‌త‌గా చెప్పుకోవ‌చ్చు. కర్మాగార‌ల్లో,ప్రైవేటు సంస్థ‌ల్లో ప‌నిచేసేందుకు కావాల్సినంత సిబ్బంది కారు చౌక‌గా దొరుకుతారు. 

 

ఈ కార‌ణాల‌న్ని కూడా అమెరిక‌న్ల‌చే చైనాలో పెట్టుబ‌డులు గుమ్మ‌రించేలా చేశాయి.  అయితే క‌రోనాకు చైనాయే కార‌ణ‌మైంద‌ని అమెరిక‌న్లు బ‌లంగా న‌మ్ముతున్నారు. వైర‌స్ విష‌యం కావాల‌నే దాచింద‌ని న‌మ్ముతున్న‌వాళ్లు అనేక మంది ఉన్నారు. విదేశీ పెట్టుబ‌డుదారులు చైనా నుంచి వెళ్ల‌గొట్ట‌డానికే ఈ దారుణానికి పాల్ప‌డింద‌ని విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. ఈనేప‌థ్యంలోనే చైనా నుంచి అమెరిక‌న్ కంపెనీలు ఇత‌ర దేశాల‌కు బాట‌ప‌డుతున్నాయి. అలా అక్క‌డి నుంచి బ‌య‌ల్దేరుతున్న సంస్థ‌ల‌కు భార‌త్ అతిపెద్ద మార్కెట్‌గా క‌న‌బ‌డ‌టంతో పాటు ఉత్ప‌త్తికి, సేవ‌ల‌కు కావాల్సిన మాన‌వ వ‌న‌రులు పుష్క‌లంగా  ల‌భిస్తాయ‌ని న‌మ్ముతున్నారు. 

 

అందుకే భార‌త్‌కు అమెరిక‌న్ కంపెనీలు వ‌రుస క‌డుతున్నాయి. ఈ పరిణామం భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు మాంచి బూస్టింగ్ వంటిదేన‌ని చెప్పాలి. ఉద్యోగా, ఉపాధి అవ‌కాశాలు మెర‌గ‌వ‌డానికి అవ‌కాశం ల‌భిస్తుంది. అంత‌ర్జాతీయంగా కూడా రూపాయి మార‌కం విలువు పెంపొందేందుకు అవ‌కాశం క‌లుగుతుంద‌ని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. పొరుగు దేశం నుంచి తరలించే తయారీ కంపెనీలకు భారీయెత్తున ప్రోత్సాహకాలు, మినహాయింపులు కల్పిస్తామని భార‌త ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌న‌ల‌తో ఊరిస్తున్న విష‌యం తెలిసిందే.  పన్నులు, కార్మిక చట్టాలు, భూసేకరణ నిబంధనల్ని మరింత సులభతరం చేస్తామని పేర్కొంది. చైనా నుంచి వ‌స్తున్న సంస్థ‌ల్లో  వైద్య పరికరాలు, ముడి ఔషధాలు, ఆహార ప్రాసెస్‌ యూనిట్లు, టెక్స్‌టైల్స్‌, తోలు, వాహన విడిభాగల తయారీ సహా దాదాపు 700ల‌కు పైగా ఉత్ప‌త్తుల తయారీదారులు సానుకూలంగా ఉన్న‌ట్లు స‌మాచారం. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: