విద్యుత్ రంగంలో సమూల మార్పులు తీసుకు వచ్చే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రాల పరిధిలో ఉన్న విద్యుత్ రంగాన్ని ఇక పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకునే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. కీలక రంగాలలో మార్పులు తీసుకువచ్చే  పేరుతో రాష్ట్రాలకు ఉన్న పవర్ ను కేంద్రం లాక్కోవాలని చూస్తోంది. ఒకే దేశం ఒకే కరెంట్ బిల్ నినాదం ఇప్పుడు కేంద్రం అందుకుంది. పవర్ సెక్టార్ మొత్తం కేంద్రం చేతిలోకి వెళితే కనుక వినియోగదారులకు జరిగే నష్టం ఎక్కువగానే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విద్యుత్ చట్ట సవరణ 2020 ని అన్ని రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ చట్టం అమలులోకి వస్తే విద్యుత్ నియంత్రణ మొత్తం కేంద్రం చేతిలోకి వెళ్లిపోతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో అమలు జరుగుతున్న ఉచిత విద్యుత్తు పథకాలన్నిటికీ మంగళం పాడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ విద్యుత్ చట్ట సవరణ బిల్లు 2020 పై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ చట్టం 2003 కు అనేక సవరణలను ప్రతిపాదిస్తూ హడావిడిగా సిద్ధం చేసిన ముసాయిదా బిల్లు 2020 పై 21 రోజులలోగా అభ్యంతరాలు, సలహాలు, సూచనలు తెలియజేయాలని గడువు విధించింది. ఆ గడువు నిన్నటితో ముగిసింది. 

 

IHG

ప్రస్తుతం దేశమంతా కరోనా హడావుడిలో ఉన్న సమయంలో ఇటువంటి కీలక నిర్ణయాలు కేంద్రం తీసుకోవడంపై రాష్ట్రాలు మండిపడుతున్నాయి. అంతేకాకుండా జూన్ ఎనిమిదో తేదీ వరకు ఈ గడువును పెంచాలని అన్ని రాష్ట్రాలు కోరుతున్నాయి. కేంద్రం తీసుకొస్తున్న విద్యుత్ రంగ నిపుణులు, ఉద్యోగ కార్మిక సంఘాలు కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం విద్యుత్ నియంత్రణ మండలి బిల్లు రాష్ట్రాల పరిధిలో ఉండటంతో వీరిని నియమించుకునే అధికారం ఈ బిల్లు అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్రం చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అలాగే విద్యుత్ చార్జీలపై నిర్ణయం తీసుకునే హక్కు కూడా కేంద్రం చేతిలోకి వెళ్లిపోతుంది. అలాగే విద్యుత్ పంపిణీ వ్యవస్థను ఫ్రాంఛైజీల, చిన్న కాంట్రాక్టు సంస్థలకు లైసెన్సులకు ఇచ్చే అవకాశం కూడా ఈ సవరణ బిల్లులో ఉండడంతో రాష్ట్రాలు మండిపడుతున్నాయి. 

 

IHG


విద్యుత్ సేవలు కూడా స్థానిక ప్రభుత్వాల నుంచి కేంద్రం చేతిలోకి వెళ్తే, అక్కడి నుంచి ఫ్రాంచైజీలు చేతుల్లోకి వెళ్తే ఆ ప్రభావం వినియోగదారులపై తీవ్రంగా ఉంటుందని అన్ని రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.అందుకే కేంద్రం తీసుకొస్తున్న ఈ బిల్లుపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. కేంద్రం ఒకే దేశం, ఒకే వ్యక్తి పేరుతో ఏకీకృత విధానం తీసుకువచ్చేందుకు దీనిని ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటించారు. అయితే ఇది వినియోగదారులపై తీవ్ర భారం మోపే విధంగా ఉండడం, అంతిమంగా ప్రైవేట్ సంస్థలు, వ్యక్తుల చేతుల్లోకి విద్యుత్ రంగం వెళ్లే అవకాశం ఉండడంతో నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. 


కేంద్రం తీసుకొస్తున్న కొత్త సవరణలో ఏమేమి ఉన్నాయి అంటే... డిస్కం పరిధిలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ పంపిణీ సంస్థలకు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రవేటు వ్యక్తుల చేతిలోకి విద్యుత్ వ్యవస్థ వెళ్ళిపోతే ప్రభుత్వ ఆదాయం పూర్తిగా తగ్గుతుంది. నష్టాలు వచ్చే ప్రాంతాలు ప్రవేటు సంస్థలకు ఇస్తే, వినియోగదారుల నుండి ముక్కుపిండి సొమ్ములు వసూలు చేసే అవకాశం ఉంది. దీని కారణంగా సబ్సిడీ పొందుతున్న ఎస్సీ ,ఎస్టీలు బిల్లులు కట్టలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే విద్యుత్ సరఫరా ప్రాంఛైజీల చేతుల్లోకి వెళితే, ఇప్పటి వరకు అందుతున్న సేవలు వినియోగదారులకు భారంగా మారే అవకాశం ఉంది. విద్యుత్ బిల్లుల నియంత్రణ మొత్తం కేంద్రం చేతిలోకి వెళ్తే కనుక ఇప్పటి వరకు రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్ కు  ఇక పులిస్టాప్ పడుతుంది. 

 

IHG' exodus - OrissaPOST


ప్రస్తుతం తెలంగాణలో లో 24 గంటల పాటు ఉచితంగా రైతులకు విద్యుత్ సరఫరా జరుగుతుంది. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి ఏటా ఆరు వేల కోట్ల వరకు భారం పడుతోందని, అయినా రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ భారాన్ని భరిస్తోంది. సబ్సిడీ, వంటగ్యాస్ తరహాలో రైతుల ఖాతాల్లో సొమ్ములు వేస్తామని కేంద్రం చెబుతున్నా, కరెంటు బిల్లు వచ్చిన సమయంలో రైతుల దగ్గర డబ్బులు ఉండాలి. ఒకవేళ సకాలంలో బిల్లులు చెల్లించకపోతే, కరెంటు బిల్లులు కట్టలేక రైతుల ఆత్మహత్యలు ఇలా అనేక సంఘటనలు చోటు చేసుకుంటాయి. 

 

IHG


గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతుల కష్టాలను అర్థం చేసుకునే రైతులకు ఉచిత విద్యుత్ పథకాన్ని తీసుకువచ్చారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ కూడా ఆ విధంగానే ఉచిత విద్యుత్తును అందిస్తున్నారు. ప్రస్తుతం కేంద్రం ప్రతిపాదిస్తున్న సవరణ బిల్లు చట్టరూపం దాలిస్తే సబ్సిడీ లేకుండా విద్యుత్ బిల్లులు చెల్లించాలి. అంటే యూనిట్ ధర భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇది నిరుపేదలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇక తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ పేదలు, రైతుల కోసం, అలాగే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు విద్యుత్ బిల్లులు కు భారీ రాయితీలు ఇస్తూ, సబ్సిడీలను అమలు చేస్తుంది. అలాగే ఇప్పటి వరకు ఈఆర్ సి  చైర్మన్ , సభ్యులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నియమించుకుంటున్నాయి.


 తాజాగా కొత్త బిల్లు అమల్లోకి వస్తే కేంద్రం ఆ అధికారాలను కోల్పోతాయి. దీనిపై సవరణలు ప్రతిపాదించే అవకాశం ఉంది. ఒకవేళ ఈ బిల్లు గనుక ఆమోదం పొందితే, సి ఈ ఆర్ సి అప్పిలేట్ ట్రిబ్యునల్, ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఆధారిటీ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి, ఎస్ సి ఆర్ సీ ల చైర్మన్, సభ్యులను కేంద్రం నియమించే కమిటీనే ఎంపిక చేస్తుంది. ఇలా జరిగితే రాష్ట్రాలకు విద్యుత్ వ్యవస్థ పై పూర్తిగా నియంత్రణ కోల్పోయినట్లు అవుతుంది. అలాగే విద్యుత్ కొనుగోలు కోసం ఉత్పత్తి కంపెనీలతో చేసుకునే పి పి ఏ ల ను  రాష్ట్రాలు కట్టుబడేలా నిబంధన బిల్లులో పొందుపరిచారు. ఈ పీ పీ ఏ లను పర్యవేక్షించేందుకు ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎన్ ఫోర్స్ మెంట్ అథారిటీ పేరుతో మరో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఇది కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకువస్తాయి. 


మార్కెట్ పరిస్థితులను బట్టి వచ్చే విద్యుత్తును తీసుకునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. దీని కారణంగా ప్రజాప్రయోజనాలకు ఎక్కువగా ఇబ్బంది కలుగుతుంది. ఇంకా అనేక రకాలైన ఇబ్బందులు వీటి ద్వారా ఉండే అవకాశం ఉండడంతో తెలంగాణ ప్రభుత్వం కేంద్రం ప్రతిపాదిస్తున్న విద్యుత్ సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వినియోగదారులకు ఇది తీవ్ర ఇబ్బందులను తీసుకొస్తుందని కేసీఆర్ పదేపదే చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బిల్లు చట్ట రూపం దాల్చకుండా తాము తీవ్రంగా అడ్డుకుంటామంటూ కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఇక చాలా రాష్ట్రాలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే పశ్చిమ బెంగాల్, కేరళ, జార్కండ్  వంటి రాష్ట్రాలు కేంద్రం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయినా ఈ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గేలా కనిపించకపోవడంతో కేంద్రం రాష్ట్రాల మధ్య మరోసారి ప్రచ్చన్న యుద్ధం మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: