క‌రోనా విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వ‌ ప‌రిస్థితి ముందు నుయ్యి...వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. లాక్‌డౌన్‌ను సుదీర్ఘ‌కాలం పాటు అమ‌లులో ఉంచ‌డంపై నిన్న మొన్న‌టి వ‌ర‌కు స్త‌బ్ధుగా ఉన్న ప్ర‌జానీకం, రాజ‌కీయ‌ప‌క్షాలు ఇప్పుడు కేంద్రంపై, ప‌రోక్షంగా బీజేపీపై  విమ‌ర్శ‌నాస్త్రాల‌ను సంధించ‌డం మొద‌లుపెడుతున్నాయి. ఈ ప‌నిలో కాంగ్రెస్ కాస్త అన్ని రాజ‌కీయ ప‌క్షాల క‌న్నా ముందుంద‌నే చెప్పాలి. కేంద్ర‌ప్ర‌భుత్వం తీసుకున్న కొన్ని నిర్ణ‌యాల‌ను త‌ప్పుబ‌డుతూ ప్ర‌జాక్షేత్రంలో దోషిని చేసే ప్ర‌య‌త్నం చేస్తోంది. వాస్త‌వానికి  కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాల్లో  ఇప్పుడు కొన్ని త‌ప్పిదాలు  స్ప‌ష్టంగా క‌న‌బ‌డుతున్నాయి. 


 వైర‌స్ ప్ర‌భావం తక్కువ‌గా ఉన్న స‌మ‌యంలోనే  వ‌ల‌స కార్మికుల త‌ర‌లింపు, పేద‌ల ఖాతాల్లోకి న‌గ‌దు మ‌ళ్లింపు, ఇంటింటికి స‌రుకుల పంపిణీ వంటి చ‌ర్య‌లు తీసుకోవాల్సి ఉంది. దీనికి తోడు లాక్‌డౌన్ అమ‌ల్లోకి తీసుకువ‌చ్చే విష‌యం క‌నీసం రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు కూడా తెలియ‌నివ్వ‌కపోవ‌డం కాస్త అతిగా అనిపించిద‌నే చెప్పాలి. అత్య‌వ‌స‌ర‌మైన ప‌నుల‌కు, ఏర్పాట్ల‌కు అవ‌కాశం ఉండేది. ఇదిలా ఉండ‌గా క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టే భారాన్ని  పూర్తిగా రాష్ట్రాల‌పై వేయ‌డం, ప్ర‌త్యేకంగా వైద్యానికి నిధుల కేటాయింపు జ‌ర‌ప‌క‌పోవ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. ఇక దేశంలో జ‌ర‌గాల్సిన‌న్ని ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌డం లేద‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్యం. 


ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ప‌రీక్ష‌ల సంఖ్య జాతీయ స‌గ‌టు క‌న్నాత‌క్కువ‌గా ఉండ‌టం దేనికి సంకేతం. అక్క‌డి ప్ర‌భుత్వంన నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నా... విశేషాధికారాల‌ను వినియోగించుకోక‌పోవ‌డం కేంద్రం వైఫ‌ల్యంగా క‌న‌బ‌డుతోంది. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య స‌రైన సఖ్య‌త లేద‌న్న విష‌యాన్ని ఈ సంఘ‌ట‌న‌లు తెలియ‌జేస్తునే ఉన్నాయి.స్వ‌యంగా ముఖ్య‌మంత్రులు కోరినా కేంద్రం నిధులు కాస్తో..కూస్తో ఇచ్చిన దాఖ‌లు లేవు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో వ‌ల‌స కూలీల‌ను ఆదుకునేందుకు ముందుకు రావాల‌ని ఆయా రాష్ట్రాల పీసీసీ అధ్య‌క్షుల‌ను  ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశించిన విష‌యం తెలిసిందే. వ‌ల‌స కార్మికులంతా ఇప్పుడు కేంద్రాన్ని..ప‌రోక్షంగా బీజేపీని తిట్టిపోస్తున్నారు. ఇంకా చెప్పాలంటే బ‌ద్ధ‌ శ‌త్రువుగా చూసే ప‌రిస్థితి త‌యార‌వుతోంది. కేంద్రం చేసిన కొన్ని త‌ప్పిదాల‌తో కోట్లాదిమంది పేద‌ల‌, కార్మికుల జీవితాలు ఆగ‌మాగం అవుతున్నాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: