తెలుగు ప‌త్రికారంగానికి గ‌డ్డుకాలం దాపురించింది. నానాటికి ప్ర‌తికారంగంలో కొన‌సాగ‌డం యాజ‌మాన్యాల‌కు క‌త్తిమీద సాములా మారుతోంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఎలాక్ట్రానిక్ మీడియా రంగప్ర‌వేశం చేసిన నాటి నుంచే క్ర‌మంగా  తెలుగు ప‌త్రికా రంగానికి తెగులు ప‌ట్టుకుంది. మెల‌మెల్ల‌గా ఆద‌ర‌ణ కోల్పోతూ వ‌స్తోంది. దానికి తోడు గ‌త‌మూడేళ్లుగా డిజిటిల్ జ‌ర్న‌లిజం ఊపందుకోవ‌డంతో ప్రింట్ మీడియాకు క‌ష్టాలు ముదిర‌య‌నే చెప్పాలి.వ్య‌య ప్ర‌యాసాల‌కు ఓర్చుకుంటూ అంతంత‌మాత్రంగా ఉన్ పాఠ‌కాద‌ర‌ణ‌ను కాపాడుకుంటూ మార్కెట్లో కొన‌సాగ‌డం అంటే అంత ఈజీకాదు....ఆర్థిక స‌మ‌స్య‌లు కూడా ఎక్కువ‌వుతున్నాయ‌నే చెప్పాలి. 


అయితే కొన్ని సంస్థ‌ల‌ను కొన్ని రాజ‌కీయ పార్టీలు కాపాడుతున్నాయ‌న్న ఆరోప‌ణ‌లున్నాయి. ఆ విష‌యం కొద్ది సేపు ప‌క్క‌న పెడితే ఇప్పుడు తెలుగు ప‌త్రికారంగానికి గ‌డ్డుకాల‌మే అన్న‌ది వాస్త‌వం. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి, న‌మ‌స్తే తెలంగాణ‌, ఇంకా కొత్త‌గా ఈ రంగంలోకి అడుగుపెట్టిన కొత్త ప‌త్రిక‌ల ప‌రిస్థితి కూడా అదేవిధంగా ఉండ‌టం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల ఐఆర్ ఎస్ ప్ర‌క‌టించిన తాజా లెక్క‌లు ఇందుకు నిద‌ర్శ‌నంగా నిలుస్తున్నాయి. తెలుగులో మార్కెట్ లీడ‌ర్‌గా ఉంటున్న ఈనాడు దేశంలోని ప్ర‌ధాన ప‌త్రిక‌ల్లో ఒక‌టిగా కొన‌సాగుతూ వ‌స్తోంది. దేశంలోని టాప్‌టెన్ ప‌త్రిక‌ల్లో ఒక‌టి ఉంటున్న ఈ ప‌త్రిక ఇటీవ‌ల స‌ర్క్యూలేష‌న్ ప‌డిపోవ‌డంతో త‌న స్థానాన్ని కోల్పోవ‌డం గ‌మ‌నార్హం. 


ఇదిలా ఉండ‌గా ప్ర‌ధాన ప‌త్రిక‌ల స‌ర్క్యూలేష‌న్ మాత్ర‌మే కాకుండా రీడ‌ర్‌షిప్‌ కూడా త‌గ్గిపోవ‌డం విశేషం. ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌కు గ‌తంలో 23. 39 ల‌క్ష‌ల‌మంది రీడ‌ర్ షిప్ ఉండ‌గా తాజాగా ప్ర‌క‌టించిన లెక్క‌ల ప్ర‌కారం..15.25 లక్షలకు పడిపోయింది. అంటే దాదాపు మూడోవంతుకు చేరుకుంద‌న్న‌మాట‌. ఇక న‌మ‌స్తే తెలంగాణ విష‌యం కూడా దాదాపు అలాగే ఉంది. ఈ నాడు విష‌యానికి వ‌స్తే గ‌తంలో 70.ల‌క్ష‌ల‌కు పైగా ఉన్న రీడ‌ర్‌షిప్ 50ల‌క్ష‌ల‌కు ప‌డిపోవ‌డం గ‌మ‌నార్హం. ఇక సాక్షి గ‌తంలో 40ల‌క్ష‌ల వ‌ర‌కు ఉన్న రీడ‌ర్‌షిప్ ప్ర‌స్తుతం 30ల‌క్ష‌ల‌కు ప‌డిపోయిన‌ట్లు స‌మాచారం. ఇలా తెలుగు పత్రికలు పాఠకుల ఆదరణ కోల్పోతుండ‌టంతో వాటి ఉనికికే ప్ర‌మాదంగా ప‌రిణ‌మించింద‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: