సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముగిసి ఏడాది పూర్త‌యింది. మొత్తం 22 మంది ఎంపీల‌ను వైసీపీ గెలుచుకుంది. ఏపీకి సంబంధించిన అనేక స‌మ‌స్య‌లు కొండ‌ల్లా పేరుకుపోయాయి.. కాబ‌ట్టి.. ఏదో ఒక పార్టీకి పూర్తి స్థాయిలో ఎంపీ లను క‌ట్ట‌బెడితేనే ప్ర‌యోజ‌నం ఉంటుంద‌నే పిలుపుతో ప్ర‌జ‌లు.. వైసీపీకి 22 మంది ఎంపీల‌ను ఇచ్చారు. అ యితే, వీరిలో చాలా మంది స్ట‌యిల్ విభిన్నంగా ఉంది. వైసీపీ నుంచి పోటీ చేసిన‌ మొత్తం మ‌హిళా మ‌ణు లు అంద‌రూ విజ‌యం సాధించారు. యువ నాయ‌కులు కూడా జైకొట్టించుకున్నారు. అయితే, వీరంతా క‌లిసి క‌ట్టుగా కంటే కూడా ఎవ‌రికి వారుగా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. కొంద‌రు వివాదాల్లో వేలు పెడుతున్నారు.

 

మ‌రికొంద‌రు త‌మ స్ట‌యిల్‌లో తాము దూసుకుపోతున్నారు. ఇలాంటి వారిలో కృష్ణాజిల్లా మ‌చిలీప‌ట్నం ఎం పీ.. బాల‌శౌరి ప్ర‌ముఖంగా నిలుస్తున్నారు. సీనియ‌ర్ నాయ‌కుడు, కాంగ్రెస్‌లో కూడా అనుభ‌వం గ‌డించిన నా య‌కుడు కావ‌డంతో.. ఆయ‌న త‌న ప‌రిధిలో తాను ఉంటూనే.. ప్ర‌జ‌ల‌కు సేవ చేసే క్ర‌మంలో దూసుకు పోతు న్నారు. మ‌చిలీప‌ట్నంలో వ‌రుస‌గా ఉన్న టీడీపీహ‌వాకు గండి కొట్టి బాల‌శౌరి విజ‌యం సాదించారు. అయితే, ఆయ‌న ఇక్క‌డి స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోవ‌డంతోపాటు.. ఢిల్లీలోనూ పార్టీ త‌ర‌ఫున చ‌క్రం తిప్పుతున్నారు.

 

కీల‌క‌మైన కేంద్ర‌ పీఏసీ క‌మిటీలో బాల‌శౌరి చోటు ద‌క్కించుకున్నారంటే.. ఆయ‌న ఎలాంటి విజ్ఞ‌త‌తో ముందుకు సాగుతున్నారో తెలుస్తుంది. ఇక‌, పార్టీ అధినేత జ‌‌గ‌న్ క‌నుస‌న్న‌ల్లో రాష్ట్రానికి సంబంధించిన అభివృద్దిపై దృష్టి పెట్టారు. విదేశాల నుంచి పెట్టుబ‌డులు వ‌చ్చేలా కూడా పార్ల‌మెంటు స్తాయిలో ప్ర‌య‌త్నిస్తున్నారు. అదేస‌మ‌యంలో జిల్లా లో అభివృద్ది ప‌నుల విష‌యంలో నూ ఆయ‌న ముందున్నారు. మ‌రీ ముఖ్యంగా కృష్ణా జిల్లాలో రాజ‌కీయా ల‌కు, విమ‌ర్శ‌ల‌కు, ప్ర‌తివిమ‌ర్శ‌ల‌కు కూడా బాల‌శౌరి దూరంగా ఉండ‌డం గ‌మ‌నార్హం.

 

నిజానికి జిల్లా రాజ‌కీ యాల్లో టీడీపీ హ‌వా ఎక్కువ‌గా ఉంది. నాయ‌కులు గెలిచినా.. గెల‌వ‌క‌పోయినా..కూడా టీడీపీ ఆధిప‌త్యం సాగుతుంది. దీంతో ఎప్పుడూ ప్ర‌త్య‌ర్థి పార్టీ నేత‌ల‌కు, టీడీపీ నేత‌ల‌కు మ‌ధ్య వివాదాలు జ‌రుగుతూనే ఉంటాయి. కానీ, బాల‌శౌరి మాత్రం ఆ వివాదాల్లోకి త‌ల దూర్చ‌కుండా త‌న ప‌నితాను చేసుకుని పోతున్నా రు. నియోజ‌క‌వ‌ర్గం, అభివృద్ధి, జ‌గ‌న్ ఆశ‌య‌మే ధ్యేయంగా శౌరి ముందుకు సాగుతుండ‌డంతో వైసీపీ ఎంపీల్లో ఆయ‌న స్ట‌యిలే వేర‌బ్బా! అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏడాది ప‌దవీ కాలంలో శౌరికి మంచి మార్కులే ప‌డ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: