రాజకీయ చాణక్యుడిగా అపార మేధావి గా 40 ఏళ్ల రాజకీయ అనుభవశాలిగా, అత్యంత సీనియర్ పొలిటీషియన్ గా చంద్రబాబుకు చాలా అర్హతలు ఉన్నాయి. రాజకీయంగా ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా, సమర్థవంతంగా తిప్పి కొట్టడమే కాకుండా, తనకు అనుకూలంగా మార్చుకోవడం లో ఎప్పుడు పై చెయ్యి సాధిస్తూనే ఉంటారు. అయితే అదంతా గతంలోనే. ఇప్పుడు ఆ పప్పులేం ఉడకవ్ అన్నట్టుగా ఆయన పరిస్థితి తయారైంది. ఎందుకంటే చంద్రబాబు కు మించిన తెలివితేటలు, రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు వేయడంలో ఏపీ సీఎం జగన్ బాగా ఆరితేరిపోయారు. ఎవరిని ఎప్పుడు, ఎక్కడ ఏ విధంగా ఇరుకున పెట్టాలో జగన్ కు బాగా తెలుసు. జగన్ రాజకీయ వ్యూహాలతో సంవత్సర కాలంలో చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులు సతమతం అవుతోనే వస్తున్నారు.
 
IHG
 
 
 చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నా, ప్రతి సందర్భంలోనూ పైచేయి సాధించాలనే కసితో వ్యవహరిస్తూ వస్తున్నారు. పార్టీకి పునర్వైభవం తీసుకురావడంతో పాటు జగన్ పాపులారిటీ బాగా తగ్గించాలని ప్రతి సందర్భంలోనూ ఆలోచిస్తూ ఉంటారు. దీనిని ఎప్పటికప్పుడు జగన్ తిప్పికొడుతూ వస్తున్నారు జగన్. తాజాగా ఏపీ ప్రభుత్వం జారీచేసిన 203 జీవో పై రెండు రాష్ట్రాల మధ్య వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఏపీ లోని రాయలసీమ ప్రాంతానికి మేలు చేసే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ విషయంలో జగన్ ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారు.
 
IHG
 
 ఈ విషయంలో తన మిత్రుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో వైరం పెట్టుకునేందుకు కూడా జగన్ సిద్ధపడ్డారు. దీంతో జగన్ పై ఏపీ ప్రజల్లో ప్రశంసలు వస్తున్నాయి. జగన్ చాలా ధైర్యంగా వ్యవహరిస్తున్నారని ప్రశంసిస్తున్నారు. కానీ ఈ విషయంలో జగన్ తీరును సమర్ధించ లేక, విమర్శించ లేక టిడిపి అధినేత చంద్రబాబుతో పాటు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సందిగ్ధంలో పడిపోయారు. ఏపీ ప్రభుత్వం నిర్ణయానికి మద్దతు తెలిపితే కెసిఆర్ చూస్తూ ఊరుకోరు. చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ ను అయినా ఎవరిని లెక్కచేయకుండా తీవ్రస్థాయిలో విమర్శలు చేయడమే కాకుండా, రాజకీయంగా వారిద్దరూ నష్టపోయే లా చేయగల సమర్థుడు.  
 
IHG
 
 
అందుకే ఈ విషయంలో బాబు, పవన్ ఇద్దరూ నోరు మెదప డానికి సైతం వెనకడుగు వేస్తున్నారు. అయితే క్షేత్ర స్థాయిలోనూ టిడిపి, జనసేన కార్యకర్తలు మాత్రం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తున్నారు. ఏపి ప్రయోజనాలకు లాభం చేకూర్చే విధంగా జగన్ ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారని, ప్రజల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. కానీ చంద్రబాబు మాత్రం ఈ విషయం పై స్పందిస్తే రాజకీయంగా తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని ఆయన నోరు మెదప డానికి ఇష్టపడడం లేదు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికిలో ఉన్నా, అక్కడి నాయకులు కూడా నోరు మెదపవద్దంటూ చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. తాను చెప్పే వరకు ఎవరు ఈ విషయంపై మాట్లాడవద్దు అంటూ ఇప్పటికే  పార్టీ శ్రేణులకు ఆదేశాలు సైతం జారీ చేశారు. 
 
 
 
ఇప్పటికే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబుని ఉద్దేశించి కృష్ణా జలాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 203 పై స్పందించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా అసలు చంద్రబాబు రాయలసీమ బిడ్డెనా అంటూ ఆయన ఎద్దేవా చేశారు. అయినా చంద్రబాబు నుంచి మాత్రం స్పందన కరువైంది. ఈ విషయంలో ఏ విధంగా స్పందించినా, చంద్రబాబు రాజకీయంగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం లేకపోలేదు. మొత్తానికి ఈ వ్యవహారంలో జగన్ చంద్రబాబును బాగానే ఇరికించేసారు. ఇప్పుడు కాకపోతే తరువాత అయినా ఖచ్చితంగా టిడిపి తరఫున ఈ విషయంపై స్పందించాల్సి ఉంటుంది అప్పుడు ఏ విధంగా బాబు తన స్పందనను తెలియజేస్తారో చూడాలి.l
  

మరింత సమాచారం తెలుసుకోండి: