రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌కు చెక్ పెట్టాలంటే ఏం చేయాలి? - స‌ద‌రు ప్ర‌త్య‌ర్థి క‌న్నా కూడా మ‌రింత పుంజుకునేలా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లాలి. మ‌రింత వేగంగా స్పందించాలి. నిర్మాణాత్మక రీతిలో వ్య‌వ‌హ‌రించాలి. ఏదైనా త‌ప్పులు దొర్లితే.. వాటిని ఆధారాల‌తో స‌హా ఎత్తి చూపాలి. నిత్యం ప్ర‌జ‌ల్లో ఉంటూ .. వారి నుంచి సానుభూతిని సొంతం చేసుకునేలా వ్య‌వ‌హ‌రించాలి. వారి స‌మ‌స్య‌ల‌పై నిత్యం పోరాడేందుకు సిద్ధంగా ఉండాలి. ఇది నైతిక‌త‌తో కూడిన రాజ‌కీయం. కానీ, నేడు కొన్ని ఎల్లో మీడియా ఛానెళ్లు.. బీజేపీలో ఉంటూ.. టీడీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించే నాయ‌కులు ఇప్పుడు వైసీపీలోని కీల‌క నేత‌లు, ఫైర్ బ్రాండ్ల‌పై చేస్తున్న విమ‌ర్శ‌లు, ప్ర‌సారం చేస్తున్న కుళ్లు క‌థ‌నాలు అనైతిక రాజ‌కీయాల‌కు ప‌రాకాష్ట‌గా మారాయ‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

 

తాజాగా కృష్ణాజిల్లా గుడివాడ ఎమ్మెల్యే, వైసీపీలో కీల‌క స్థానంలో ఉన్న మంత్రి కొడాలి శ్రీవేంక‌టేశ్వ‌ర‌రావు ఉర‌ఫ్ నాని గురించి ఓ కీల‌క క‌థ‌నాన్ని వండి వార్చాయి. గ‌డ్డం గ్యాంగ్ పేరుతో వెలువ‌రించిన ఈ క‌థ‌నంలో ప‌స క‌న్నా.. స‌ద‌రు ఎల్లో ఛానెల్ క‌డుపుమంట‌, స‌ద‌రు కాషా య కుండువా ముసుగేసుకున్న టీడీపీ నేత అచేత‌న స్థితి క‌ళ్ల‌కు క‌ట్టాయి. ఆదిలో టీడీపీ నాయ‌కుడే అయిన‌ప్ప‌టికీ.. త‌ర్వా త నాని.. వైసీపీలో చేరిపోయారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న టీడీపీకి బ‌ద్ధ వ్య‌తిరేకిగా మారిపోయారు. ముఖ్యంగా చంద్ర‌బాబును, ఆయ న కుమారుడు లోకేష్‌ను అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తిసారి టార్గెట్ చేస్తున్నారు. అయితే, ఎప్పుడు టార్గెట్ చేసినా.. ఏదో ఒక విష‌యం పైనే  మంత్రి మాట్లాడారు. అంతే త‌ప్ప పోసుకోలు క‌బుర్ల‌తో ఆయ‌న పొద్దు పుచ్చింది లేదు.

 

అయితే, ఆయ‌న విమ‌ర్శ‌ల్లో ఎంత వాస్త‌వం ఉంటుందో.. అదే స‌మ‌యంలో అంతే ఘాటు కూడా క‌నిపిస్తుంది. ఇలా విమ‌ర్శ‌లు చేస్తున్న స‌ద‌రు మంత్రికి కౌంట‌ర్ ఇ వ్వలేని స్థితిలో టీడీపీ అల్లాడుతోంది. అదే స‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గంలోనూ టీడీపీ త‌న స‌త్తా నిరూపించుకోలేక పోతోంది. ప్ర‌తి సారీ నానిని ఓడించాలని ప్ర‌య‌త్నించ‌డం, కానీ, చ‌తికిల ప‌డ‌డం సాధార‌ణంగా మారిపో యింది. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లోనూ విజయ‌వాడ నుంచి దేవినేని అవినాష్‌ను తీసుకు వెళ్లి నానిపై పోటీకి పెట్టారు. అయితే, ఆ వ్యూహం కూడా చిత్తుగా ఓడిపోయింది. చివ‌ర‌కు అవినాష్ కూడా వైసీపీలో చేరిపోయాడు. దీంతో టీడీపీకి ఇప్పుడు గ‌తిలేని ప‌రిస్థితిలో మ‌ళ్లీ పాత‌కాపు రావి వెంక‌టేశ్వ‌ర‌రావే గ‌త‌య్యారు. అయితే, ఆయ‌న నానికి స‌మ వుజ్జీ కాద‌నేది అంద‌రికీ తెలిసిందే.

 

దీంతో నాని దూకుడు కు ఎలా చెక్ పెట్టాల‌నే రాజ‌కీయ వ్యూహాన్ని అమలు చేయాల్సిన టీడీపీ నేత‌లు.. నైతిక‌త‌కు తిలోద‌కాలు ఇచ్చి.. అనైతిక మార్గంలో ఆయ‌న‌పై లేనిపోని విమ‌ర్శ‌లు చేస్తూ.. ఎల్లో మీడియాను ఉసిగొలిపారు. ఇక్క‌డ కొంద‌రు అరాచ‌క శ‌క్తుల‌ను సైతం ప్రోత్స‌హించాల‌ని చూస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే గ‌డ్డంగ్యాంగ్ అరాచ‌కాలు అంటూ.. స‌ద‌రు ఎల్లో ఛానెల్ రెచ్చిపోయింది. దీని వెనుక బీజేపీ ముసుగేసుకున్న టీడీపీ ఎంపీ ఉన్నాడ‌నే ప్ర‌చారం సాగుతోంది. స్థానికంగా భూములు కొల్ల‌గొడుతున్నాడ‌ని, పేద‌ల‌ను బెదిరిస్తున్నాడ‌ని.. స‌ద‌రు మంత్రిపై లేనిపోని వి ప్ర‌చారం చేస్తూ.. క‌థ‌నాలు అల్లేశారు. నిజానికి అలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డాల్సిన అవ‌స‌రం మంత్రికి ఉందా? అనేది ఎవ‌రిని అడిగినా.. ఇక్క‌కే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా అంద‌రూ చెబుతారు. సో.. ఇలాంటి పిచ్చి పిచ్చి క‌థ‌నాలు ప్ర‌సారం చేయ‌డం వ‌ల్ల వ‌చ్చేదానిక‌న్నా.. పోయేదే ఎక్కువ‌గా ఉంటుంద‌నేది స‌ద‌రు ఎల్లో మీడియా గ్ర‌హిస్తే.. మంచిద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: