సాఫీగా సాగిపోతున్న మోదీ ప్ర‌భుత్వానికి క‌రోనా వైర‌స్ కొర‌క‌రాని కొయ్య‌లా త‌యారైంది. అంత‌మొందింద‌ని అన్ని దేశాల నుంచి అభినంద‌న‌లు వెల్లువెత్తిన కొద్దిరోజుల్లోనే త‌న విశ్వ‌రూపం ప్ర‌ద‌ర్శించ‌డం మొద‌లుపెట్టింది. ఇక ఇప్పుడ‌యితే అడ్డూ అదుపు లేకుండా విస్త‌రించుకుంటూ పోతోంది. మొద‌ట్లో రోజుకు ఒక‌టి రెండు ప్రాణాల‌కు మించి బ‌లిగోర‌ని వైర‌స్ ఇప్పుడు వంద‌ల సంఖ్య‌కు చేరుకుంటోంది. వేలాదిమందికి కొత్త‌గా విస్త‌రిస్తోంది. కంటికి క‌న‌బ‌డ‌ని శ‌త్రువుతో యుద్దం చేస్తున్న ప్ర‌పంచం మొత్తం యుద్ధం చేస్తుండ‌గా ఇప్పుడు భారత్ వైర‌స్ వ‌ల‌యంలో చిక్కుకుంది. అత్యంత వేగంగా వైర‌స్ బాధితుల సంఖ్య‌లో  ప్ర‌థ‌మ‌స్థానానికి చేరుకునే దిశ‌గా ప‌య‌నిస్తోంది.

 

 క‌రోనాతో పోరులో భార‌త్ ఇక చ‌తికిల‌ప‌డిన‌ట్లేన‌న్న‌ది నిర్వివాదాంశం. ఎవరు ఒప్పుకున్నా...ఒప్పుకోక‌పోయినా...పాల‌కుల్లో నెల‌కొన్న అంత‌ర్గ‌త అభిప్రాయం కూడా ఇదే. క‌రోనా వైర‌స్‌ను లాక్‌డౌన్ నిర్బంధాల‌తో పూర్తిగా పార‌దోల‌డం..త‌రిమివేయ‌డం అసాధ్యం. దానికి వ్యాక్సిన్ ఒక్క‌టే ప‌రిష్కారం మార్గంగా క‌న‌బ‌డుతోంది. కరోనా ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ పూర్తిగా రాష్ట్రాల‌కే కేంద్రం వ‌దిలివేయ‌డం నిజంగా ఒక‌ర‌కంగా చెప్పాలంటే త‌న వైఫ‌ల్యాన్ని అంగీక‌రించిన‌ట్లేన‌ని చెప్పాలి. రాష్ట్రాల‌కు నిధుల కేటాయింపు చేయ‌కుండా కేవ‌లం ఉద్దీప‌న పేరుతో నాన్చుడు వ్య‌వ‌హారానికి..లెక్క‌ల గిమ్మిక్కుల‌కే మోదీ ప్ర‌భుత్వం పాకులాడుతోంద‌న్న విమ‌ర్శ‌లు సామాన్య‌జ‌నం నుంచి వినిపిస్తున్నాయి.

 

 కార్పొరేట్లకు కోటాను కోట్లు.. కూలీలకు మాత్రం చప్పట్లా? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు.ఉత్పత్తిలో కీలకమైన గ్రామీణ పేదలకు కేంద్రం త‌న స‌హ‌కారాన్ని విస్మరిస్తోంద‌ని మండిప‌డుతున్నారు. ఆర్థికంగా వెన‌క‌బాటుకు గుర‌వుతున్న గ్రామీణ పేద‌ల‌ను ఆదుకునేందుకు మోదీ ప్ర‌భుత్వం క‌నీస ప్ర‌య‌త్నం చేయ‌డం లేద‌న్న ఆరోప‌ణ‌లు రోజురోజుకు అధిక‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే వ‌ల‌స కూలీల విష‌యంలో మోదీ తీసుకున్న నిర్ణ‌యం తీవ్ర విమ‌ర్శ‌ల పాలు జేస్తోంది.  కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక ప్యాకేజీలో కార్పొరేట్లకు లక్షల కోట్లు ప్రకటించి, వ్యవసాయ కూలీలు, వలస కార్మికులకు ఒక్క రూపాయి కూడా ప్రకటించకుండా ద్రోహం చేశారని పేర్కొంటున్నారు.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: