అపాయ‌మ‌నో..కరోనా విస్త‌రించ‌కుండా నిపుణుల సూచ‌న‌ల మేర‌కు ప్ర‌ధాన‌మంత్రి మోదీ  లాక్‌డౌన్ ప్ర‌క‌టించారు. ప్ర‌జా శ్రేయ‌స్సు దృష్ట్యా మోదీ తీసుకున్న నిర్ణ‌యం 100శాతం స‌రైంద‌ని ప్ర‌పంచ దేశాల నుంచి ప్ర‌శంస‌లు ల‌భించాయి. అదే స‌మ‌యంలో దేశ పౌరుల నుంచి కూడా దండిగా స‌హ‌కారం ల‌భించింది. మొద‌టి విడ‌త వ‌ర‌కు బాగానే ఉంది. అయితే వ‌ల‌స కార్మికుల జీవ‌నాన్ని ప‌ట్టించుకోక‌పోవ‌డం మూలంగా వంద‌లాది మర‌ణాలు చోటు చేసుకున్నాయి. కోట్లాదిమంది నుంచి ఆక‌లికేక‌లు వినిపిస్తు న్నాయి. అయితే వాస్త‌వానికి రాష్ట్ర ప్ర‌భుత్వాలు మొద‌టి విడ‌త ఆదుకునేందుకు కొద్దోగొప్పోసాయం చేశాయి. 

 

రెండో, మూడో విడ‌త‌ల్లో మాత్రం చేతులెత్తేశాయి. ప‌ర్య‌వేక్ష‌ణ‌నను కూడా మ‌రిచాయి. కేంద్రం తాను సాయం అందించ‌క‌...స్వ‌స్థ‌లాల‌కు వెళ్లేందుకు అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డంతో మోదీ ప్ర‌భుత్వ తీరుపై ఇప్పుడు వ‌ల‌స కార్మికులు భ‌గ్గుమంటున్నారు. ఏ మాత్రం ముందస్తు కసరత్తు లేకుండా  లాక్‌డౌన్ ప్ర‌క‌టించార‌ని వలసకార్మికులు మోదీ విధానాల‌ను ఇప్పుడు త‌ప్పు బ‌డుతున్నారు. మోదీ చ‌ప్ప‌ట్లు కొట్టించుకోవ‌డానికి ఇష్ట‌ప‌డుతున్నారు... మా ఆక‌లి కేక‌లు..ఆర్త‌నాదాలు ఆయ‌న‌కు విన‌బ‌డటం లేదు అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.


ఇదిలా ఉండ‌గా వ‌ల‌స కార్మికుల లాంగ్ మార్చ్‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. పోలీసుల‌ను ఎదురించి మ‌రీ ఎర్ర‌టి ఎండ‌లో వేలాది కిలోమీట‌ర్ల దూరం చేరుకుంటున్నారు. ద‌క్షిణాది నుంచి ఉత్త‌రాది రాష్ట్రాల‌ను క‌లిపే హైవేల‌న్నీ కూడా వ‌ల‌స కార్మికుల రాస్తాతో నిండిపోయి క‌నిపిస్తున్నాయంటూ అతిశేయోక్తికాదు. పిల్లా జెల్లా, త‌ట్టా,బుట్టా స‌ర్దుకుని, పొట్ట‌ చేత‌ప‌ట్టుకుని స్వ‌స్థలాల‌కు వెళ్లిపోతున్నారు. అయితే ఇలా వెళ్తున్న వారిలో కొంత‌మంది ప్ర‌మాదాల్లో మ‌ర‌ణిస్తుండ‌టం గ‌మ‌నార్హం.  శనివారం ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో 30 మంది మృతిచెందారు. మరో 57 మంది పైగా గాయపడ్డారు. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: