పారిశ్రామికంగా ఎదిగేందుకు మనదేశం చేస్తున్న ప్రయత్నాలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్డుపడుతున్నాడు.  ఎట్టి పరిస్ధితుల్లోను భారత్ లో కంపెనీలు ఏర్పాటు చేసేందుకు లేదంటూ కుండబద్దలు కొట్టినట్లు డైరెక్టుగానే చెప్పేశాడు. అమెరికా కంపెనీలన్నీ అమెరికాలో మాత్రమే కంపెనీలను ఏర్పాటు చేయాలంటూ బెదిరింపులకు దిగాడు. తనను కాదని కంపెనీలు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటే ప్రోత్సాహకాలన్నీ నిలిపేస్తానంటూ బ్లాక్ మెయిల్ కు దిగటమే ఆశ్చర్యంగా ఉంది.

 

కరోనా వైరస్ దెబ్బకు యావత్ ప్రపంచం పారిశ్రామికంగా కుదేలైపోయిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వైరస్ కు పుట్టినల్లయిన చైనా నుండి చాలా కంపెనీలు ఇతర దేశాలకు వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాయి. అయితే మానవ వనరులు చౌకగా లభించే ఇండియాకు వెళితేనే అన్నీ విధాలుగా మంచిదని కూడా కంపెనీలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే చైనాలో ఉన్న ప్రముఖ ఐటి కంపెనీ యాపిల్ కంపెనీ భారత్ కు వచ్చేందుకు ఆలోచిస్తోంది.

 

అయితే ఈ విషయాన్ని తెలుసుకున్నట్రంప్ వెంటనే యాపిల్ కంపెనీ యాజమాన్యంతో మాట్లడాడు. విదేశాల్లో ఉన్న అమెరికా కంపెనీలన్నీ తిరిగి అమెరికాకే వచ్చేయాలని ప్రకటించాడు. యాపిల్ కంపెనీ కూడా వెంటనే చైనాను ఖాళీ చేసి అమెరికాకు వచ్చేయాలని గట్టిగా చెప్పాడు. ఎట్టి పరిస్ధితుల్లోను భారత్ లో కంపెనీ పెట్టేందుకు తాను అంగీకరించనంటూ హెచ్చరించటమే విచిత్రంగా ఉంది. యాపిల్ కంపెనీ చైనా నుండి అమెరికాకు వచ్చేయాలని కూడా హూంకరించాడు.

 

ఒకవేళ  తన ఆదేశాలను కాదని ఏ కంపెనీ అయినా ఇతర దేశాల్లో కంపెనీలు ఏర్పాటు చేస్తే వాటన్నింటికీ ప్రోత్సాహకాలను కట్ చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. నిజానికి వైరస్ దెబ్బ ఇతర దేశాలపై పడినట్లే అమెరికా మీద కూడా పడింది. ఇప్పటికే అమెరికాలో మూడు కోట్ల మంది ఉద్యోగ, ఉపాధిని కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీని ప్రభావం ట్రంప్ మీద తీవ్రంగానే పడబోతోంది. ఎలాగంటే నవంబర్ నెలలో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి.

 

రాబోయే ఎన్నికల్లో  తన గెలుపుపై  జనాగ్రహం ఎక్కడ ప్రభావం చూపుతుందో అన్న భయం ట్రంప్ ను వెంటాడుతోంది. అందుకనే ఏదో ఓ రకంగా మళ్ళీ గెలవాలన్న ఆలోచనతోనే ప్రపంచంలో ఎక్కడెక్కడున్న సంస్ధలన్నింటినీ అమెరికాకు పిలిపించి ఉద్యోగ, ఉపాధిని ఇప్పించాలన్నది ట్రంప్ ఆలోచనగా  కనబడుతోంది. అందుకనే కంపెనీలన్నింటినీ తిరిగి అమెరికాకు వచ్చేయాలంటూ ఒత్తిడి మొదలుపెట్టాడు. మరి కంపెనీల యాజమాన్యాలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: