మహారాష్ట్రలో కరోనా రక్కసి ఉగ్ర‌రూపం దాల్చింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలోనే అధిక సంఖ్యలో కేసులు నమోదవు తున్నాయి. ముంబైలో నిన్న ఒక్కరోజే వెయ్యికి పైగా  కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. తాజాగా దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో 44% ఈ  ఒక్క రాష్ట్రంలోనివే అక్క‌డి ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేస్తోంది.క‌రోనా ప‌రీక్ష‌లు కూడా ఆల‌స్యంగా జ‌రుగుతున్నాయ‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్న నేప‌థ్యంలోనే ఈ కేసుల సంఖ్య భారీగా ఉండ‌టాన్ని ప‌లువురు గుర్తు చేస్తున్నారు. ప‌రీక్ష‌లు వేగంగా జ‌రిగితే కేసుల సంఖ్య రెట్టింపయ్యే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.


ఇప్ప‌టికే క‌రోనా వైర‌స్ అధికంగా ఉన్న‌ ముంబై, పుణెలాంటి ప్రాంతాల నుంచి ప్ర‌జ‌లు ప్రాణ‌భ‌యంతో గ్రామాల‌కు త‌ర‌లి వెళ్తున్నారు. బ‌తికుంటే బ‌లుస‌కైనా తినవ‌చ్చు అంటూ ప‌రుగులు పెడుతున్నారు. మ‌హారాష్ట్రలో సెమీ అర్బ‌న్ ప్రాంతాల్లో కూడా కేసుల సంఖ్య ఎక్కువ‌గా ఉండ‌టం అక్క‌డి ప్ర‌జ‌ల‌ను తీవ్ర క‌ల‌వ‌ర పాటుకు గురిచేస్తోంది. ఇక ప‌ట్ట‌ణాల్లో నివాసం ఉంటున్న కూలీల ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. లాక్‌డౌన్ అమ‌లుతో ఆర్థికంగా చితికిపోయారు. కుటుంబ పోష‌ణ‌కు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క‌రోనా గండం ఇప్ప‌ట్లో గ‌డిచేలా లేక‌పోవ‌డంతో గ్రామాల్లో వ్య‌వ‌సాయ కూలీ పనులేమైనా దొరుకుతాయేమోన‌ని అక్క‌డికి చేరుకుంటున్నారు. 

 

లాక్‌డౌన్ కొన‌సాగుతున్న రాష్ట్రంలో వైర‌స్ వ్యాప్తి అధికంగానే ఉంద‌ని వైద్యులు  చెబుతున్నారు.  ఇక దేశంలో క‌రోనా బారిన ప‌డ్డ వారి సంఖ్య ఇప్పటివరకు లక్షకు చేరువ కావ‌డం గ‌మ‌నార్హం. గత 24 గంటల్లో నమోదైనర మొత్తం కేసుల్లో 82 శాతం.. మహారాష్ట్ర, దిల్లీ, తమిళనాడు, గుజరాత్‌, రాజస్థాన్‌ల నుంచే ఉన్నాయి.  అయితే గ‌డిచిన 24గంట‌ల్లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఒక్క కేసు మాత్ర‌మే న‌మోదుకావ‌డం, మేఘాలయ, పుదుచ్చేరి, మణిపుర్‌, లాంటి రాష్ట్రాల్లో కేసులేమీ న‌మోదు కాక‌పోవ‌డం కొంత‌లో కొంత ఆశాజ‌న‌క‌మైన విష‌య‌మనే చెప్పాలి.  తాజా మరణాల్లో 63 ఒక్క మహారాష్ట్రలోనే సంభవించాయి. మరణాల రేటు పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 8.89%గా ఉంది.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: