మామూలుగా ఎన్నికల్లో ఎవరైనా ఓడిపోయిన తర్వాత కొంత కాలం పాటు ప్రజా జీవితం నుండి దూరంగా ఉంటారు. ఎందుకు దూరంగా ఉంటారంటే తాము ఎందుకు ఓడిపోయామా ? అనే విషయంలో నిజాయితీగా విశ్లేషించుకునేందుకు. మరి అదే పార్టీ అధినేత ఏమి చేస్తారు ?  నేతలకన్నా మరింత ఎక్కువ కాలం తీసుకుంటారు. పార్టీని భవిష్యత్ ఎన్నికల్లో గెలిపించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మరింత లోతుగా ప్లాన్ వేసుకుంటారు. కానీ ఏపిలో మాత్రం సీన్ రివర్సులో నడుస్తోంది. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుండి చంద్రబాబునాయుడు ఏమి చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డిపై ఎలా బురద చల్లాలా అని ప్రయత్నిస్తునే ఉన్నాడు.

 

అఖండ మెజారిటితో గెలిచిన జగన్ పై గడచిన పదకొండు మాసాల్లో చంద్రబాబు,  ఎల్లోమీడియా బురద చల్లని రోజంటూ లేదు. పనికిమాలిన విషయాలపైన కూడా రెచ్చిపోవటం, ఎల్లోమీడియాలో కథనాలు, వార్తలు అచ్చేయించటం జగన్ ను గబ్బు పట్టించే కార్యక్రమంతో చంద్రబాబు, చినబాబు అండ్ కో బిజీగా గడిపేస్తున్నారు. తన స్ధాయికి తగని విషయాల్లో కూడా చంద్రబాబు చాలా తీవ్రంగా రెచ్చిపోతున్నాడు. ఎందుకింతగా రెచ్చిపోతున్నాడంటే బహుశా అదంతా చంద్రబాబే చేయిస్తున్నాడా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

 

ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు గుంటూరుకు చెందిన రంగనాయకమ్మ అనే 60 ఏళ్ళ వృద్ధురాలిపై ప్రభుత్వం కేసు పెట్టినందుకు చంద్రబాబు, చినబాబు రెచ్చిపోతున్నారు ట్విట్టర్లో. వృద్ధురాలి మీద కేసు పెట్టటం ఏమిటి అని నిలదీస్తున్నారే కానీ ఆమె ఏ తప్పు చేయలేదని మాత్రం చెప్పటం లేదు. అంటే వీళ్ళ లెక్క ప్రకారమే ఆమె సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినట్లు అర్ధమైపోతోంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబు లేకపోతే చినబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయటానికి ప్రత్యేకంగా పెయిడ్ ఆర్టిస్టులను నియమించుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే కొందరిని పోలీసులు అరెస్టులు కూడా చేశారు. బహుశా ఈ రంగనాయకమ్మ కూడా పెయిడ్ ఆర్టిస్టుల్లో ఒకరేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఒకవేళ పెయిడ్ ఆర్టిస్టు కాకపోతే  టిడిపికి చెందిన మహిళ అయ్యుండచ్చు. ఎవరైనా కావచ్చు ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నించాల్సిందే. నిలదీయటంలో తప్పేలేదు. ఆవేశంతో ప్రశ్నించే వాళ్ళెవరు ? కావాలనే  బురద చల్లేవారెవరో వాళ్ళ పోస్టులు చూస్తే తెలిసిపోదా ?

 

ఇపుడింతగా గోల చేస్తున్న అబ్బా కొడుకులు తాము అధికారంలో ఉండగా ఏమి చేశారు ? తమ మీద అసభ్యంగా పోస్టులు పెడుతున్నారనే కారణంతో ఎంతమంది మీద కేసులు పెట్టి అరెస్టులు చేయించలేదు ?  60 ఏళ్ళ వృద్ధురాలు కదా అని ప్రభుత్వం వదిలేస్తే ఆమె మళ్ళీ ప్రభుత్వంపై బురద చల్లదని గ్యారెంటీ ఉందా ? లేకపోతే ప్రభుత్వంపై బురద చల్లేందుకోసం చంద్రబాబు  60 ఏళ్ళపైబడిన వారినే ఉపయోగించడని గ్యారెంటీ ఏమిటి ?  కాబట్టి ప్రభుత్వంపై పోస్టులు పెట్టేటపుడు కాస్త ముందు వెనుక ఆలోచించుకోవాలి. చంద్రబాబు ఉచ్చులో పడితే మత్తు డాక్టర్ సుధాకర్ కు పట్టిన గతే పడుతుందన్న విషయం గ్రహించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: