తాజాగా మీడియాతో మాట్లాడిన తెలంగాణ సీఎం కేసీఆర్‌.. అనూహ్యంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై నిప్పు లు చెరిగారు. కేవ‌లం 15 రోజుల్లోనే కేసీఆర్ త‌న వైఖ‌రిని మార్చుకుని ఇలా విమ‌ర్శ‌లు సంధించ‌డం రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకుంది. లాక్‌డౌన్ ప్రారంభంలో న‌రేంద్ర మోడీ తీసుకున్న ప్ర‌తి నిర్ణ‌యాన్ని కేసీఆర్ స‌మ‌ర్ధించారు. మోడీ దూర‌దృష్టి వ‌ల్లే దేశంలో క‌రోనా లేద‌ని అప్ప‌ట్లో పొడిగిన కేసీఆర్ తాజాగా మోడీ లాంటి ప్ర‌ధాని ఉండ‌డం దారుణ‌మ‌నేలా వ్యాఖ్యానించారు. మ‌రి ఇంత‌లోనే ఎందుకు అంత మార్పు వ‌చ్చేసింది? ఎందుకు కేసీఆర్ ఇలా వ్య‌వ‌హ‌రించారు? ఇప్పుడు కీల‌క ప్ర‌శ్న‌లు ఇవే.

 

కేంద్రం ప్ర‌క‌టించిన 20 ల‌క్ష‌ల కోట్ల ప్యాకేజీ ప‌చ్చిమోస‌మ‌ని, మోడీ విధానాలు స‌మాఖ్య స్ఫూర్తికి విరుద్ధం గా ఉన్నాయ‌ని కేసీఆర్ మండిప‌డ్డారు. అప్పులు చేసుకుని రాష్ట్రాలు న‌డ‌వాల్సిందేనా?  ఈ మాత్రానికి కేం ద్రం ఎందుకు? అని చెడామ‌డా అనేశారు. ఈ మొత్తం వ్య‌వ‌హారం ప‌రిశీలించిన రాజ‌కీయ విశ్లేష‌కులు.. కే సీఆర్ ఈ రేంజ్‌లో మోడీని ఆడేసుకోవ‌డం వెనుక వ్యూహం ఏదైనా ఉందా? అనే కోణంలో ప‌రిశీల‌న చేస్తు న్నారు. గ‌మ‌నిస్తే.. కేసీఆర్ చాలా వ్యూహాత్మ‌కంగానే మోడీపై విరుచుప‌డ్డార‌ని తెలుస్తోంది.

 

ఒక‌టి తెలంగాణ‌కు ప్ర‌త్యేకంగా ఎలాంటి ప్రోత్సాహ‌కం అందించ‌క‌పోవ‌డంపై కోపం. రెండు.. రాష్ట్రంలో ఆర్ధిక ప‌రిస్థితి తీవ్రంగా దెబ్బ‌తిన్న నేప‌థ్యంలో లాక్‌డౌన్ నుంచి రాష్ట్ర‌ప్ర‌జ‌ల‌ను బ‌య ‌ట ప‌డే స్థాయిలో ఖ‌జానా లేక‌పోవ‌డంతో త‌న త‌ప్పులు ఎక్క‌డ బ‌య‌ట ప‌డ‌తాయోన‌నే బెంగ‌తోనే కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా మోడీ విష‌యాన్ని తెర‌మీదికి తెచ్చార‌ని అంటున్నారు. నిజానికి మోడీని బ‌ద్ధ శ‌తృవుగా చూసే మ‌మ‌తా బెన‌ర్జీ కూడా ఈ రేంజ్‌లో ఎప్పుడూ ఉతికి ఆరేయ‌లేదు.

 

కానీ, మోడీని మెచ్చుకునే కేసీఆర్ ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం వెనుక మాత్రం అక్క‌సు ఉంద‌ని చెబుతున్నారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ వ‌ల్ల అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయి. ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర ప్ర‌స్తుతం ఆ రేంజ్‌లో సొమ్ములు లేవు. దీంతో ప్ర‌తిప‌క్షాలు త‌న‌ను టార్గెట్ చేయ‌కుండా.. త‌ప్పు త‌న‌దికాదు.. కేంద్రానిది అనే రేంజ్‌లో కేసీఆర్ విమ‌ర్శ‌లు గుప్పించార‌ని చెబుతున్నారు. మ‌రి మున్ముందు ఇది ఎటు దారి తీస్తుందో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: