కదలి రండి తెలుగుదేశం కార్యకర్తలారా ... త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా అంటూ మరోసారి ఉత్తేజం కలిగించే పాటలు తెలుగు దేశం పార్టీ నాయకులకు అవసరం వచ్చినట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా టీడీపీ అధినేత  చంద్రబాబు తో పాటు ఆ పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం కలిగించాల్సిన కనిపిస్తోంది. ఏపీ లో కేవలం 23 స్థానాలకు మాత్రమే తెలుగుదేశం పార్టీ పరిమితం అయిపోవడం. ఎప్పుడూ చూడనంతగా ఆ పార్టీ తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుండడం, రాజకీయ భవిష్యత్తు పై బెంగ. మరో వైపు పార్టీని ముందుకు నడిపించే అధినాయకుడు చంద్రబాబు రాజకీయ వైరాగ్యం. వయస్సు మీరడం. ఇలా ఎన్నో ఇబ్బందులు తెలుగుదేశం పార్టీని చుట్టుముట్టాయి. అసలే సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్న టీడీపీ కి ఇప్పుడు కరోనా వైరస్ మరింతగా దెబ్బ కొట్టినట్టుగా కనిపిస్తోంది. 

 

IHG


గత రెండు నెలలుగా చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ పూర్తిగా ఇంటికే పరిమితం అయిపోయారు. చంద్రబాబు ఏపీ ప్రతిపక్ష నాయకుడు. ఎన్ని ఆంక్షలు ఉన్నా, ఆయన ఏపీకి వచ్చేందుకు అవకాశం ఉంది. అందులోనూ కేంద్రం కూడా అనుమతి ఇచ్చింది. అయినా చంద్రబాబు ఇంటికే పరిమితం అయిపోయారు. కరోనా విపత్తు సమయంలో వైసీపీ ప్రభుత్వం ఎక్కడా వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్తున్నారు. కరోనా కు సంబంధించి జగన్ తీసుకుంటున్న చర్యలు, ముందస్తు జాగ్రత్తలు, జగన్ వ్యాఖ్యలు, ఇలా అన్నిట్లోనూ జగన్ తీరుకి దేశవ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి. 

 

IHG


ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ఎన్నో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే వైసీపీ పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగేలా చేయడంలోనూ, లోపాలను ఎండగట్టడంలోనూ టీడీపీ ఇంకా వెనకబడిపోయి ఉంది. చంద్రబాబు జూమ్ యాప్ ద్వారా నిత్యం పార్టీ శ్రేణులతోనూ , మీడియాతోనూ మాట్లాడుతున్నా, ప్రత్యక్షంగా ఏపీలో లేకపోవడంతో కార్యకర్తల్లో అస్సలు హుషారే కనిపించడంలేదు. అసలు చంద్రబాబు కూడా ఏపీ కి వచ్చే అవకాశం ఉన్నా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడంలేదు. ఇక ఆయన కుమారుడు లోకేష్ సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన ఇవేమి పట్టనట్టుగా సైకిల్ పై షికార్లు చేస్తూ గడిపేస్తున్నాడు. అప్పుడప్పుడు మాత్రమే సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. 

 


విశాఖ ఎల్జీ పాలిమర్స్ వ్యవహారంలోనూ చంద్రబాబు ఏపీలో కనుక ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది. బాబు ఇక్కడ లేకపోవడం, పార్టీ అధికారంలో లేకపోవడం, అధికార పార్టీ కేసులు పెడుతుందన్న భయంతోనూ చాలామంది టీడీపీ నాయకులు ప్రజా సమస్యలను తలకెత్తుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. బాబు కి ఇప్పటికే 70 సంవత్సరాల వయస్సు వచ్చి పడింది. ఇప్పుడు ఈ కరోనా సమయంలో ఆయన గడప దాటి బయటకి రావడం అంత శ్రేయస్కరం కాదు అని ఇప్పటికే వైద్యులు ఆయన్ను గడప దాటవద్దు అనే సూచనలు సైతం చేసినట్టు తెలుస్తోంది. అందుకే ఇక చంద్రబాబు ఇంటి నుంచే పార్టీ కార్యక్రమాలను, మీడియా సమావేశాలను నిర్వహిస్తూ కార్యకర్తల్లో ఉత్సహం చల్లారకుండా చూడాలని ప్రయత్నిస్తున్నారు.

 


 తెలుగు తమ్ముళ్లు కూడా అధికార పార్టీ మీద భయం కారణంగా కేవలం సోషల్ మీడియా లో మాత్రమే యాక్టివ్ గా ఉంటూ క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యల విషయంలో వెనకడుగు వేస్తున్నారు. చంద్రబాబు మరికొంతకాలం వర్క్ టూ హోమ్ అంటూ పాలిటిక్స్ చేస్తే మరి ఎంతో కాలం ఆ పార్టీ మనుగడలో ఉండే అవకాశం లేకపోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: