అవును మీరు చదివింది నిజమే. సుప్రింకోర్టు ఆదుకోబట్టి సరిపోయింది కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి సర్కార్ విషయంలో హై కోర్టు సీరియస్ అయ్యేదనటంలో సందేహమే లేదు. ఇంతకీ విషయం ఏమిటంటే రాష్ట్రంలో మద్యం దుకాణాల దగ్గర సోషల్ డిస్టెన్సింగ్ పాటించటం లేదని  ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండు కేసులు హైకోర్టులో దాఖలయ్యాయి. ఆ కేసులను విచారించిన కోర్టు ’మద్యం విషయం తాము చేయగలిగేది ఏమీ లేదం’టూ వ్యాఖ్యానించింది.  అవసరమని అనుకుంటే పిటీషనర్లు సుప్రింకోర్టుకు వెళ్ళాలంటూ సూచించి ఇక్కడ కేసును కొట్టేసింది.

 

హై కోర్టు కేసు ఎందుకు కొట్టేసిందంటే మద్యం దుకాణాలను ఓపెన్ చేయటమన్న నిర్ణయాన్ని కేంద్రప్రభుత్వం తీసుకుంది. ఇదే విషయమై ఓ పిటిషనర్ సుప్రింకోర్టులో కేసు వేశాడు. అయితే ఆ కేసును  సుప్రింకోర్టు కొట్టేసింది. దాన్ని ఉదాహరణగా  చూపించి హైకోర్టు కూడా కేసు కొట్టేసింది.  మద్యం దుకాణాలను సుప్రింకోర్టే అనుమతించిన తర్వాత ఇక తాము చేసేదేమీ లేదని కూడా వ్యాఖ్యానించింది. అందుకనే పిటీషనర్లను సుప్రింకోర్టుకు వెళ్ళమని సూచించింది.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాష్ట్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు కేసులు వేసినా, అంశం ఏదైనా వెంటనే హైకోర్టు ముందు విచారణకు తీసుకుంటోంది. తర్వాత స్టే ఇచ్చేస్తోంది. తర్వాత విచారణలో భాగంగా ప్రభుత్వాన్ని వాయించేస్తోంది. ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం, పీపీఏల రద్దు, రివర్స్ టెండరింగ్ విధానం, పేదలకు ఇళ్ళ స్ధలాల సేకరణ, మూడు రాజధానుల ప్రతిపాదన ఇలా దాదాపు ప్రతి విషయంలోను కోర్టులో ప్రభుత్వానికి అక్షింతలు తప్పటం లేదు.

 

కాబట్టి మద్యం దుకాణాల విషయంలో దాఖలైన పిటీషన్ విషయంలో కూడా ప్రభుత్వానికి కోర్టు నుండి అక్షింతలు తప్పవనే అందరూ అనుకున్నారు. కానీ ఆశ్చర్యంగా పిటీషన్లను కోర్టు కొట్టేసింది. లాక్ డౌన్ నుండి  మద్యం దుకాణాలకు వెసులుబాటు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నది కేంద్రప్రభుత్వమన్న విషయం అందరికీ తెలిసిందే. ఇదే విషయమై పిటీషనర్  వేసిన కేసును సుప్రింకోర్టు కొట్టేసింది. దాన్నే ఉదాహరణగా తీసుకుంటూ హైకోర్టు కూడా పిటీషన్లను కొట్టేసింది.

 

నిజానికి మద్యం దుకాణాల దగ్గర సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలనే రాష్ట్రప్రభుత్వం కూడా చెప్పింది. ఇందులో భాగంగానే పోలీసులను కూడా మోహరించింది. అయితే కొన్ని ప్రాంతాల్లో సోషల్ డిస్టెన్సింగ్ పాటించిన వారు పాటించారు లేని చోట్ల లేదు. ఏదేమైనా దుకాణాలు తెరిచిన మొదటి మూడు రోజులు ఫుల్లుగా జనాలు ఎగబడ్డారు కానీ తర్వాత రద్దీ తగ్గిపోయిందన్న విషయం అందరూ చూస్తున్నదే. అయినా సరే పిటీషనర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు వేయటం గమనార్హం.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: