ఎక్కడో స్విచ్చేస్తే ఇంకెక్కడో బల్బు వెలిగిందంటే ఇదేనేమో. ఎక్కడో దుబాయ్ లో వ్యాపారాలు చేసే బిఆర్ఎస్ పై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఇ)లో కేసు నమోదై దర్యాప్తు జరుగుతోందంటే చంద్రబాబునాయుడుకు ఎందుకు షాక్ కొడుతుంది ? ఎందుకంటే దీని వెనుక చాలా పెద్ద కతే ఉంది. బిఆర్ఎస్ గా పాపులరైన బిఆర్ శెట్టి స్వస్ధలం కర్నాటకలోని ఉడిపి. నిజానికి శెట్టికి ఏపి రాజకీయాలతో సంబంధం ఏమీ లేదు. కానీ తెలుగుదేశంపార్టీ రాజకీయాల్లో మాత్రం చాలా కీలకమైన వ్యక్తనే చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబుకు శెట్టి అత్యంత సన్నిహితుడు కావటంతోనే  తాజాగా శెట్టి విషయంపై టిడిపిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

 

ఎప్పుడో 1973లో ఉడిపి నుండి అబుదాబిలోకి అడుగుపెట్టిన శెట్టి అంచలంచెలుగా ఎదిగాడు. అబుదాబిలో మెడికల్ రెప్రంజంటేటివ్ గా జీవితం మొదలుపెట్టి తర్వాత న్యూ మెడికల్ సెంటర్(ఎన్ఎంసి) అనే చిన్న క్లినిక్ పెట్టాడు. ఆ తర్వాత మరోచిన్న ఫార్మా కంపెనీ ఏర్పాటు చేశాడు.  సీన్ కట్ చేస్తే దాదాపు మూడేళ్ళ క్రితం లెక్కలు తీసుకుంటే ఎన్ఎంసీ పేరుతో శెట్టికి వివిధ దేశాల్లో దాదాపు 200 ఆసుపత్రులున్నాయి. గల్ఫ్ దేశాల్లో శెట్టి ఆసుపత్రి లేని దేశం లేదంటే అతిశయోక్తి కాదు. అలాగే చాలా యూరోపు దేశాల్లో కూడా ఆసుపత్రులున్నాయి.

 

2018 నాటికి శెట్టి వ్యాపార సామ్రాజ్యం విలువ 420 కోట్ల డాలర్లు.  బ్రిటన్ కు చెందిన మడ్డీ వాటర్స్ అనే సంస్ధ ఎన్ఎంసిలో భారీగా  వాటాలు కొన్నది. అప్పటి నుండే శెట్టికి దుర్దినాలు మొదలైనట్లు లెక్క. ఎలాగంటే వాటాలు కొనుగోలు చేసిన కొంతకాలం తర్వాత సంస్ధ ఆదాయ, వ్యయాలు, ఆర్ధిక స్ధితిగతులపై మడ్డీ ఆరాతీయటం మొదలుపెట్టింది. మడ్డీ తీసిన ఆరాలో అనేక విస్తుపోయే విషయాలు బయటపడ్డాయట. ఎన్ఎంసీ పేరుతో జరుగుతున్న వ్యాపారమంతా ఉత్త డొల్లేనని, లాభాలంతా కేవలం కాగితాల్లోనే కానీ వాస్తవంగా అంత లేదన్న విషయం బయటపడింది.  

 

ఎప్పుడైతే ఎన్ఎంసీ విషయం బయటపడిందో వెంటనే లండన్ స్టాక్ ఎక్స్చేంజీలో  సంస్ధ పేర్ వాల్యు దారుణంగా పడిపోయింది. దాంతో  సంస్ధ విలువ మొత్తం పడిపోయింది. ఎప్పుడైతే సంస్ధ విలువ పడిపోయింది ఆస్తుల విలువ తగ్గిపోయి అప్పులు పెరిగిపోయింది. అందుకనే ఎన్ఎంసీకి అప్పులిచ్చిన యుఏఇ బ్యాంకు బాకీ తీర్చమని వెంటపడింది. దాంతో పాటు ఇతర ఆర్దికసంస్దలు  కూడా అప్పులు తీర్చమని శెట్టిపై ఒత్తిళ్ళు మొదలుపెట్టాయి.

 

ఒక్కసారిగా సమస్యలు పెరిగిపోవటంతో దిక్కుతోచని శెట్టి వెంటనే యుఏఇలో మాయమై ఉడిపిలో ప్రత్యక్షమయ్యాడు. ఇపుడు శెట్టిపై దుబాయ్ లో కేసు నమోదై దర్యాప్తు జరుగుతోంది. సరే కేసులు, దర్యాప్తు, వ్యాపారాలు ఏమవుతాయన్నది వేరే విషయం. సీన్ కట్ చేస్తే శెట్టి విషయంలో పార్టీలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.  శెట్టి బాగా వెలుగుతున్న సమయంలో చంద్రబాబు ఎప్పుడు దుబాయ్ వెళ్ళినా బిఆర్ఎస్ కు అతిధిగా ఉండేవాడట. శెట్టికి ఉన్న సొంత ఎయిర్ పోర్టులోనే చంద్రబాబు వెళ్ళిన విమానం దిగేదట. వీళ్ళద్దరు ఎంత సన్నిహితులంటే ఎన్ఎంసీకి అమరవాతిలో చంద్రబాబు ఏకంగా 100 ఎకరాలను కట్టబెట్టాడు. మొత్తం మీద బిఆర్ఎస్ వ్యవహారం టిడిపిలో హాట్ టాపిక్ అయిపోయిందనే చెప్పాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: