జగన్ మొండి. కాదు కాదు జగమొండి. ఎవరికీ అర్ధం కానీ మనిషి. అసలు జగన్ స్వభావం ఏంటో ఎవరికీ తెలియదు. జగన్ ఎంత మొండి ఘటం అంటే తన తండ్రి మరణం తరువాత  తనకు ప్రాధాన్యం ఇవ్వని అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీతో విభేదించి సొంతంగా పార్టీ పెట్టేసారు. సుమారు తొమ్మిదేళ్లపాటు అష్టకష్టాలు పడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడు. ఈ సందర్భంగా అన్ని విషయాల్లోనూ జగన్ పట్టు సంపాదించారు. ప్రజల నాడి, ప్రజల సమస్యలను బాగా అర్ధం చేసుకున్నాడు. అంతే కాదు ఏపీ మొత్తం పాదయాత్ర చేపట్టి జనాల్లోకి వెళ్లి ప్రజా సమస్యలను దగ్గరగా చూసారు. ఇక అధికారంలోకి వచ్చిన తరువాత ముందుగానే తన పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేసి చూపించాడు. అంతేకాదు.. ప్రజా అవసరాలు ఏంటో నేరుగా గుర్తించి వాటిని అమలు చేయడంలోనూ జగన్ పెద్ద మనసు చాటుకున్నారు.

 

IHG

 

ఇక జగన్ రెండో కోణంలో చుస్తే ఆయన తాను నమ్మింది, తనకు అనిపించింది చేయడం తప్ప ఎవరు ఏమి చెప్పినా వినే రకం కాదు. తాను ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఎంత కష్టమైనా, నష్టమైనా చేసి తీరాలనుకుంటాడు. ఈ సందర్భంగా ఎన్ని ఇబ్బందులు ఏర్పడినా లెక్కచేయకుండా ముందుకు వెళ్తుంటాడు. ఇది ఇలా ఉంటే ప్రతి ఒక్కరికి గౌరవ మర్యాదలు ఇస్తూ తన వ్యక్తిత్వం ఏంటో చాటి చెప్పుకుంటూ ఉంటారు. అధికారులను సైతం అన్నా అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ తన వ్యక్తిత్వాన్ని చాటుకుంటూ వస్తున్నారు.  పనితీరు విషయంలో రాజీ పడేందుకు అస్సలు ఇష్టపడే రకం కాదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి మున్సిపల్ కమిషనర్ల వరకూ తాను పనిలో అలసత్వం వహిస్తే క్షమించబోనని సంకేతాలు ఇచ్చారు.

 

IHG

 

 వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడమే కాకుండా కక్ష పూరితంగా వ్యవహరించిన అధికారులందరి మీదా నిబంధనల ప్రకారం వేటు వేశారు. అవినీతి అసలసత్వం విషయంలో సొంత పార్టీ నేతలను సైతం పక్కనపెట్టేందుకు ఎక్కడా జగన్ వెనకాడరు. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో జగన్ నిరూపించారు. అందుకే క్రమశిక్షణ విషయంలో నాయకులంతా అలెర్ట్ గానే ఉండేలా కట్టడి చేయగలిగారు. ఇదంతా ఇలా ఉంటే ప్రజల విషయంలో జగన్ ఎక్కడా రాజీపడకుండా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు కరోనా కారణంగా జనాలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. 

 

IHG

 

ప్రభుత్వానికి కూడా ఆదాయ మార్గాలు పూర్తిగా మూసుకుపోయాయి. అయినా జగన్ మాత్రం ఎక్కడా సంక్షేమ పథకాలకు గండి పెట్టకుండా తాను హామీ ఇచ్చిన అన్నిటిని అమలు చేసి చూపిస్తున్నాడు. ఆ పథకం .. ఈ పథకం అంటూ ప్రజలకు ఏదో ఒక రూపంలో డబ్బులు చేతికి అందేలా చేయగలిగాడు. నిజంగా కరోనా కష్టాలతో ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న ఏపీ ప్రజలకు ఇది నిజంగా ఊరటనిచ్చే అంశమే. అసలు ఇంత కష్టకాలంలోనూ జగన్ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నారు అనే సందేహం జనాల్లో వస్తోంది. ఇప్పుడు కూడా రోజుకో కొత్త పథకం అన్నట్టుగా జగన్ ప్రజలకు వరాలు ఇచ్చుకుంటూనే వెళ్తున్నాడు. అసలు జగన్ కు ఎంత గుండె ధైర్యం, ఎంత మొండి ఘటం. ఇంత కష్ట కాలంలోనూ జగన్ పాలన జన రంజకం అని జనాలతో అనిపించుకుంటున్నాడు ఈ మొండి మారాజు. 

మరింత సమాచారం తెలుసుకోండి: