ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి రేపటితో ఏడాది పూర్తవుతుంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రోజు నుంచి సీఎం జగన్ ప్రజా సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు, చేనేత కార్మికులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలు, ఆటో డ్రైవర్లు... ఇలా అన్ని కులాలకు, వర్గాలకు, వృత్తులకు ప్రాధాన్యత ఇస్తూ అన్ని వర్గాల మద్దతు కూడగట్టుకుంటున్నారు. 
 
వైసీపీకి ఓటేసినా, ఓటేయకపోయినా అర్హులైతే పథకాలు అమలు చేయాలని జగన్ ఎన్నో సందర్భాల్లో చెప్పారు. కరోనా వల్ల రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తరుణంలో సైతం సంక్షేమ పథకాలను అమలు చేశారు. సున్నా వడ్డీ రుణాలు, జగనన్న వసతి దీవెన, రైతు భరోసా పథకాలు అమలు చేసి ప్రజలు హృదయాలు గెలుచుకున్నారు. దేశ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా 25 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. 
 
ఎన్నికల ముందు ఇచ్చిన నవరత్నాల్లోని హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రతిపక్షాలు సైతం ఆశ్చర్యపోయేలా చేశారు. మరోవైపు 2019 ఎన్నికల్లో కేవలం 23 ఎమ్మెల్యే సీట్లు, మూడు ఎంపీ సీట్లకు పరిమొతమైన టీడీపీ సంవత్సర కాలంలో అనుకూల మీడియా ద్వారా ప్రతిరోజూ గెలుస్తోంది. ప్రభుత్వంపై అసత్య కథనాలు ప్రచారం చేయిస్తూ మైలేజీ పొందుతోంది. కరోనా కష్ట కాలంలో కూడా ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు అనుకూల మీడియాతో చేయిస్తూ టీడీపీ నేతలు సంతోషపడుతున్నారు. 
 
ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేకపోయినా వ్యతిరేకత ఉన్నట్టు చూపించడానికి టీడీపీ అనుకూల మీడియా పడుతున్న కష్టం అంతాఇంతా కాదు. కానీ గడచిన సంవత్సర కాలంలో మీడియాలో గెలిచిన టీడీపీ ప్రజల మెప్పు పొందడంలో పూర్తిగా విఫలమైంది. అదే సమయంలో పెద్దగా మీడియా మద్దతు లేకపోయినా జగన్ ప్రజల్లో హీరోగా నిలిచారు. 2019లో ఓటు వేయని వాళ్ల మనస్సులను పరిపాలన, సంక్షేమ పథకాల అమలుతో గెలుచుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: