ఓదార్పు యాత్ర ... పాదయాత్ర ఏది చెయ్యాలన్నా ఆయన తరువాతే. ప్రజల కష్టాలను కన్నీళ్లను తుడవాలన్నా ఆయన తరువాతే. బతకడానికి అష్ట కష్టాలు పడుతున్నపేద బతుకులకు భరోసా ఇవ్వాలన్నా ఆయన తరువాతే. అసలు ఎవరికి ఏమి కావాలో ఎప్పుడు కావాలో తెలుసుకుని తీర్చడంలో ఎప్పుడూ ఆయనే ముందుంటారు. పేదల మనిషిగా, నిస్వార్ధ, నిజాయితీ రాజకీయాలకు నిలువుటద్దంలా కనిపిస్తున్న వైఎస్ జగన్ చీకటిని చీల్చుకుంటూ 151 సీట్లతో అఖండ మెజార్టీతో గెలుపు జెండా ఎగురవేసిన రోజు ఇది. సరిగ్గా ఏడాది క్రితం ఇదే 23 వ తారీఖున అతిపెద్ద, ఘనమైన చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీని కూకటి వేళ్ళతో పెకిలించేస్తున్నాడా అన్నట్టుగా ఓడించి గెలిచిన రోజు ఇది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు జెండా ఎగురవేసిన రోజు ఇది.

IHG' <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=YS JAGAN MOHAN REDDY' target='_blank' title='jagan-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>jagan</a> <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=REDDY' target='_blank' title='reddy- గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>reddy</a> pummels <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CBN' target='_blank' title='chandrababu naidu-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>chandrababu naidu</a> ...


ఏడాది పాలనలో జగన్ ఏం చేశాడు అనే కంటే ఏం చెయ్యలేదు అనే ప్రశ్న ఇప్పుడు వేసుకోవాలి. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన మొదటి ఆరునెలల్లోనే జగన్ తన ఎన్నికల మ్యానిఫెస్టోని అమలు చేసి చూపించాడు. అసలు ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా ఏ ముఖ్యమంత్రి అమలు చేయని విధంగా ఏడాది పాలనలో జగన్ చేసి చూపించాడు. తాను ఏ విధంగా చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందో ఆ విధంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేశాడు. ఈ సందర్భంగా జగన్ నిర్ణయాలు కొన్ని కొన్ని వివాదాస్పదం అయినా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తనకు మంచి అనిపించింది ఏదో అది చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా జగన్ ముందుకు వెళ్తున్నారు.  

 

IHG

 

ఇక రాజకీయ ప్రత్యర్థుల విషయంలోనూ జగన్ అదే విధంగా ముందుకు వెళ్తున్నారు. మొండోడు రాజుకన్నా బలవంతుడు అంటారుఇక్కడ రాజే మొండోడు అయితే ఎలా ఉంటుంది జగన్ ప్రతిపక్షాలకు అర్ధమయ్యేలా చేస్తున్నాడు. తాను చిత్త శుద్దితో అమలు చేయాలని చూస్తున్న ఏ నిర్ణయం అయినా అది అమలయ్యే వరకు వదిలిపెట్టడంలేదు. ఈ విషయంలో ఎవరితో అయినా ఢీ కొట్టేందుకైనా వెనకాడ్డంలేదు. ఇక కరోనా వైరస్ వంటి  కష్టకాలంలోనూ, జగన్ ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా, ఏ సంక్షేమ పథకాలు నిలుపుదల చేయకుండా అమలు చేసి చూపించడమే కాకుండా మరికొన్ని సంక్షేమ పథకాలను అమలు చేసి చూపించి ప్రతిపక్షాలు సైతం ఆశ్చర్యపోయేలా చేయగలిగాడు జగన్.
దాదాపు పదేళ్ల పాటు కష్టనష్టాలను అనుభవించి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన జగన్ ఇప్పుడు అధికారం ఉంది కదా అని ఎక్కడా ఆ దర్పం ప్రదర్శించేందుకు కానీ, హాయిగా రిలాక్స్ అయ్యేందుకు కానీ ప్రాధాన్యత ఇవ్వడంలేదు.

IHG


పార్టీ నాయకుల్లో కానీ, ప్రభుత్వ యంత్రంగంలో కానీ, ఎక్కడా అవినీతి అలక్ష్యం లేకుండా చేయగలిగారు. ఏ పని కావాలన్నా, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరగాల్సిన అవసరమే లేకుండా, వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చి ఏ పనికి ఎవరూ ఎవరి చుట్టూ తిరగక్కరేలేకుండా చేయగలిగాడు. ఇక కరోనా వైరస్ ను అదుపు చేయడంలోనూ, దానికి సంబందించిన పరీక్షలు నిర్వహించడంలోనూ దేశ వ్యాప్తంగా పేరు సంపాదించుకున్నాడు జగన్. ఇలా చెప్పుకుంటూ వెళ్తే జగన్ ఏడాది పాలనలో ఏంచేశాడు అనేదానికంటే అసలు ఏం చేయలేదో చెప్పండి అని వైసీపీ నాయకులు దర్జాగా తమ రాజకీయ ప్రత్యర్థులకు సవాల్ విసిరే విధంగా జగన్ పరిపాలన చేసి చూపిస్తున్నాడు.   
 

 

మరింత సమాచారం తెలుసుకోండి: