ఏ ప్రజాస్వామ్య దేశానికైనా, ఏ  ప్రభుత్వానికైనా వ్యవస్థలు జీవనాడులు. వ్యవస్థలు నిస్వార్ధంగా పని చేస్తేనే ప్రజాస్వామ్యం నాలుగు కాలాల పాటు పరిఢవిల్లుతుంది. స్వాతంత్ర్యం వచ్చిన కొన్ని దశాబ్దాలపాటు కోర్టులు సక్రమంగానే పని చేశాయి.  ప్రజల విశ్వాసాన్ని పొందాయి. కానీ, ఎప్పుడైతే రాజకీయ నాయకులు న్యాయ వ్యవస్థలో వేలు పెట్టడం ప్రారంభించారో అప్పుడే న్యాయవ్యవస్థకు అవినీతి మరకలు అంటడం ప్రారంభించాయి. ఈ రోజున న్యాయవ్యవస్థపై ప్రజల్లో నమ్మకం  ఎందుకు సన్నగిల్లుతోంది.? దీనికి కారకులు ఎవరు.? వ్యవస్థల్లో ఏం జరుగుతోంది.? అనే ప్రశ్నలు వేసుకున్నప్పుడు న్యాయవ్యవస్థ తన పరువును తానే  పాతాళంలోకి నెట్టుకుందని అనిపిస్తోంది. 

 

ముఖ్యంగా గత కొంత కాలంగా ఏపీ న్యాయవ్యవస్థలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఎవరికైనా ఈ భావన  కలుగుతుంది. ప్రభుత్వాలు గతి తప్పినప్పుడో, పౌరుల ప్రాధమిక హక్కులకు భంగం కలిగినప్పుడో, ప్రజాస్వామ్య వ్యస్థకు ముప్పు వచ్చినప్పుడో కోర్టులు జోక్యం చేసుకోవాలి. 
అంతేగానీ  ప్రజల నమ్మకాన్ని కోల్పోయి బలహీనపడుతున్న ప్రతిపక్షాన్ని కాపాడటానికి అన్నట్లు ఏపీ హై కోర్టు తీర్పులు చేయడం సరికాదు. ఇది న్యాయవ్యవస్థకు సిగ్గు చేటు. ఏపీ హై కోర్టు తీర్పులను ఈ రోజున సామాన్య ప్రజలు ఛీదరించుకుంటున్నారు. న్యాయవ్యవస్థపై నమ్మకం పోయిందంటూ చీవాట్లు పెడుతున్నారు. ముఖ్యంగా ఏపీ హైకోర్ట్‌ తన పరిధికి మించి ప్రభుత్వ నిర్ణయాల్లో  జోక్యం చేసుకుంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

 

ప్రతిపక్ష నేత చంద్రబాబు మనిషి సుప్రీం కోర్ట్‌లో ఉండి ఏపీ హై కోర్ట్‌ను ఆట ఆడిస్తున్నారని  ప్రభుత్వ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు  ఎంతో ముందు చూపుతో కొన్ని దశాబ్డాల  క్రితమే ఆ మనిషిని జ్యూడీషిరిలో జొప్పించారని బ్యూరోకాట్లు కూడా మాట్లాడుకుంటారు. ఆ మనిషి ప్రజలు, న్యాయం, ప్రజాస్వామ్యం కోసం కాకుండా చంద్రబాబు కోసమే పని చేస్తారని, చంద్రబాబు స్టేలు వెనుక ఆ మనిషి పాత్ర వెలలేనిదని టీడీపీ తమ్ముళ్లు బహిరంగంగానే మాట్లాడుకుంటారు. 

 

వాస్తవానికి మే 30, 2019లో వైఎస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నాటినుంచి రాష్ట్ర హై కోర్టు ఆయన తీసుకునే అన్నీ నిర్ణయాలను తప్పుబడుతుంది. గతంలో పేదలకు ఇంగ్లిష్ మీడియం వారి తల్లిదండ్రుల ఇష్టం. ఇళ్ల స్థలాలపై స్టే అలా ఎన్నో..అలానే ఇవాళ ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగుల జీవోను కొట్టివేయడం, ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌‌ను కూడా ఎత్తివేయడం. విశాఖ జిల్లా నర్సీపట్నం డాక్టర్ సుధాకర్‌తో పోలీసులు వ్యవహరించిన తీరుపై హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించడం.

 

ఏపీ హై కోర్ట్ తీర్పులు ప్రజల్లో న్యాయవ్యవస్థపై చులకన భావాన్ని తీసుకొచ్చాయి. కొంత మంది స్వార్ధపరులు డబ్బు సంపాదనే ధ్యేయంగా రాజకీయాల్లోకి వచ్చి వ్యవస్థలను వారి రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారు. ఇప్పటికైనా  న్యాయవవ్యవస్థ మారాలి. న్యాయ వ్యవస్థలోని నిబంధనలను రాజ్యాంగ సవరణతో మార్చాలి.  ప్రతిభ ఆధారంగానే జడ్జి పోస్ట్‌లను భర్తీ చేయాలి. తీర్పులను లోకాయుక్త పరిధిలోకి తీసుకురావాలి. సంబంధిత జడ్జి సరైన తీర్పు ఇవ్వలేదని ఎవరూ భావించినా లోకాయుక్తలో ఫిర్యాదు చేసే అధికారం ఇవ్వాలి. తీర్పులు ప్రశ్నించకూడదు అనే నిబంధనలను తక్షణమే కేంద్రం ఎత్తి వేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: