మ‌రోసారి ఏపీలో మీడియా విష‌యంపై చ‌ర్చ సాగుతోంది. దేశంలో క‌రోనా కార‌ణంగా ఏర్ప‌డిన లాక్‌డౌన్ త ర్వాత అనేక సార్లు మీడియా విష‌యం చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఉద్యోగుల‌ను తొల‌గిస్తున్నార‌ని, జీతాలు క‌ట్‌చే స్తున్నార‌ని ఇలా అనేక రూపాల్లో చ‌ర్చ సాగింది. ఆయా సంద‌ర్భాల్లో ప‌ట్టించుకుని, పాత్రికేయుల స‌మస్య ల‌పై స్పందించాల్సిన జ‌ర్న‌లిస్టు సంఘాలు ప‌ట్టించుకోవ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఇక‌, ఈ క్ర‌మంలోనే ఏపీ, తెలంగాణ‌ల్లోని తెలుగు మీడియా జ‌ర్న‌లిస్టుల సంఘాలు.. త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద ‌ని జ‌ర్నలిస్టులు ఆవేద‌న‌, ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

 

ఇప్పుడు మ‌రో కీల‌క విష‌యంపై ఏపీలో జ‌ర్న‌లిస్టులు తీవ్ర‌స్థాయిలో అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. లాక్ డౌన్‌ను ద‌శ‌ల వారీగా ఎత్తేస్తున్నారు. ప్ర‌స్తుతం నాలుగో ద‌శ లాక్‌డౌన్ ఉన్న‌ప్ప‌టికీ.. అనేక విష‌యాల్లో మిన ‌హాయింపులు ఇచ్చారు. అయితే.. జ‌ర్న‌లిస్టుల వేత‌నాలు కానీ, వారి ఆర్ధిక ప‌రిస్థితికానీ ఏమంత బాగోలేదు. ఈ క్ర‌మంలోనే తెలంగాణ‌లో కొన్ని జ‌ర్న‌లిస్టు సంఘాలు అక్క‌డి కేసీఆర్ ప్ర‌భుత్వానికి కీల‌క ప్ర‌తిపాద న‌లు చేశాయి. ఇప్ప‌టికే రాష్ట్రంలో న్యాయ‌వాదుల‌కు లాక్‌డౌన్ ప‌రిహారం కింద రూ.10 వేలు ఇవ్వాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించారు. 

 

దీంతో అక్క‌డి జ‌ర్న‌లిస్టు సంఘాలు.. రాష్ట్రంలో ఉపాది కోల్పోయి, వేత‌నాలు కూడా స‌రిగా అంద‌క ఇబ్బంది ప‌డుతున్న జ‌ర్న‌లిస్టుల‌కు కూడా రూ.10 వేలు ఇవ్వాల‌ని కోరారు. జ‌ర్న‌లిస్టుల‌కు ప‌ది వేల రూపాయలు ఇవ్వాల‌న్న జ‌ర్న‌లిస్టు సంఘాల ప్ర‌తిపాద‌న‌పై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. అల్లం నారాయ‌ణ‌తో మాట్లాడి.. ఒక నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. మ‌రి ఇ లాంటి ప‌రిస్థితి ఏపీలో ఎక్క‌డ‌? అని ప్ర‌శ్నిస్తున్నారు ఏపీకి చెందిన జ‌ర్న‌లిస్టులు. ఇక్క‌డ మ‌రింత‌గా జ‌ర్న‌లిస్టులు వేత‌నాలు కోల్పోయార‌ని, ఉద్యోగాలు కూడాపోయాయ‌ని, వీటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని జ‌ర్న‌లిస్టు సంఘాలు.. ఒక ప్ర‌తిపాద‌న‌ను ప్ర‌భుత్వం దృష్టికి తీసుకువెళ్లాల్సిన అవ‌స‌రం ఉంద‌ని. . కానీ, ఇప్ప‌టి వ‌రకు క‌నీసం దీనిపై దృష్టి కూడా పెట్టలేద‌ని, జ‌ర్న‌లిస్టు సంఘాలు ఏం చేస్తున్నాయ‌ని అంటున్నారు! 

 

మ‌రి ఇప్ప‌టికైనా.. ఏపీ జ‌ర్న‌లిస్టు సంఘాలు సీఎం జ‌గ‌న్‌కు ప్ర‌తిపాద‌న అందిస్తే.. బెట‌ర‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక్క‌డ న్యాయ‌వాదుల‌కు నెల నెలా రూ.5 వేలు.. భృతి అందుతున్న నేప‌థ్యంలో ఏమీలేని జ‌ర్న‌లిస్టుల‌కు లాక్‌డౌన్ ప‌రిహారం కింద రూ.10 వేలు ఇప్పించాల‌ని కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: