ప్రింట్ మీడియా... ఎలక్ట్రానిక్ మీడియా... సోషల్ మీడియా ! ఈ మూడు మీడియాల గురించి తెలుసు కానీ, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రంగు రంగుల మీడియా హడావుడి ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఏపీ అధికార పార్టీ వైసీపీ ఎప్పుడైతే ఎల్లో మీడియా అంటూ కొన్ని టీడీపీ అనుకూల పత్రికలు, చానళ్లను పిలవడం మొదలు పెట్టిందో అప్పటి నుంచే ఎల్లో మీడియా అనే పేరు సదరు చానెళ్లు, పత్రికలకు స్థిరం అయిపోయింది. దానికి తగ్గట్టుగానే సదరు మీడియా ఛానెళ్ల వ్యవహారం ఉంటూ వస్తోంది. ఏపీలో తెలుగుదేశం పార్టీ తప్ప, మరో పార్టీ ఏది అధికారంలో ఉండకూడదు అన్నట్టుగా ఈ ఛానెళ్ల వ్యవహారం ఉంటూ వస్తోంది. ఇక ముఖ్యంగా చెప్పుకుంటే ఆంధ్ర జ్యోతి రాధాకృష్ణ అలియాస్ ఆర్కే ఈ ఎల్లో మీడియా కు అసలు సిసలు సూత్ర దారిగా పేరు పొందినట్టుగా జనాల్లో ఉన్న ప్రచారం.   

IHG


ఇక ప్రతి వారం కొత్త పలుకు పేరుతో రాసుకొచ్చే తన బాధ, తెలుగుదేశం బాధ అన్నీ ఏకరువు పెడుతూ అదే జనాల అసలు సిసలు బాధ అన్నట్టుగా చాకచక్యంగా రాయడంలో ఆర్కే బాగా ఆరితేరిపోయారు అనేది జనాల మాట. అసలు ఇప్పుడు ఈ వారం కొత్త పలుకు సంగతి చెప్పుకుంటే తమను పదే పదే ఎల్లో మీడియా అంటూ సంబోధించడం, జనాల్లో ఎల్లో మీడియా అంటూ చులక భావన ఏర్పడడం వంటి కారణాలతో ఇప్పుడు ఏపీ అధికార  పార్టీ కి సంబంధించిన మీడియా పై బురదజల్లడం, జనాల్లో ఆ పార్టీ కి సంబంధించిన మీడియా పై బురద జల్లే విధంగా ఈ వారం కొత్త పలుకులో ఆర్కే తన బాధ వెళ్లగక్కుకున్నారు. తమకు ఎల్లో మీడియా అని పేరు పెట్టడంపై బాధను వ్యక్తం చేసిన ఆర్కే సాక్షి మీడియాను ఉద్దేశించి బ్లూ మీడియా అంటూ పదే పదే చెప్పడం, ప్రజల్లో చులకన చేయడమే ధ్యేయం అన్నట్టుగా ఆర్కే కొత్త పలుకులో రాసుకొచ్చారు. 

 

IHG


తన వ్యాసం లో బ్లూ బ్యాచ్, నీలి మీడియా, నీలి బ్యాచ్, బ్లూ మీడియా అంటూ పదే పదే విమర్శిస్తూ కొత్త పలుకులో చెప్పుకొచ్చారు. అంటే టీడీపీకి ఎల్లో మీడియా, వైసీపీకి బ్లూ మీడియా, టీఆర్ఎస్ పార్టీకి అనుకూల మీడియాకు పింక్ మీడియా ఇలా అందరికి ఒక్కో పేరు అన్నట్టుగా ఈ మీడియాకు రంగుల గోల ఏంటి అని జనాల్లో నడుస్తున్న చర్చ. అయినా రాధాకృష్ణ వ్యవహారం చూస్తుంటే ఎల్లో మీడియా అంటే తామే జనాలకు గుర్తొస్తున్నామని, తమ వ్యక్తిగత ఇమేజ్ బాగా డ్యామేజ్ అవుతుంది అనేది krishna KUMAR' target='_blank' title='రాధా కృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రాధా కృష్ణ బాధ అన్నటుగా కనిపిస్తోందని జనాల మాట. అందుకే కొత్త పలుకులో చిలక పలుకులు పలుకుతూ పడుతున్న బాధ ఇంత అంతా కాదు. అర్జంటుగా జగన్ మీడియాను బ్లూ మీడియా అని జనాలు పిలుచుకోవాలని సదరు ఆర్కే గారి అసలు బాధగా కనిపిస్తోందని జనాలు వ్యంగ్యంగా మాట్లాడుతున్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: