ఏపీ సీఎం వైఎస్ జగన్ అంటేనే తరచూ మండిపడే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన తాజా కొత్తపలుకు వ్యాసంలో మరోసారి తన అసంతృప్తి వెళ్లగక్కారు. ఈ జగనే ఎప్పుడూ అధికారంలో ఉంటాడా.. ఇక ఈయన అధికారం పోకుండా ఉంటుందా.. అప్పుడు చూద్దాం.. అప్పటి వరకూ ఓపిక పడతాం అన్నట్టుగా సాగిపోయింది ఏబీఎన్ రాధాకృష్ణ తాజా కొత్త పలుకు వ్యాసం..

 

 

ఆయన ఏంరాశారంటే.. “ వివిధ కారణాల వల్ల ప్రజలు ఆయనను నమ్మారు. ప్రజాభిప్రాయం ఎప్పుడు స్థిరంగా ఉండదు. మందబలం ఉంది కనుక ఎవరూ అడ్డురాకూడదు అనుకునేవారికి రాజ్యాంగం కల్పించిన కట్టుబాట్లు అడ్డు తగులుతూనే ఉంటాయి. అధికార దుర్వినియోగానికి పాల్పడేవారికి ఏదో ఒకనాటికి శిక్ష తప్పదు...” ఈ రాతల్లోనే ఈ జగన్ ఎప్పుడు అధికారం దిగిపోతాడో అన్న శాపనార్థాలు అంతర్లీనంగా కనిపిస్తున్నాయి.

 

 

తాజా పరిస్థితుల్లో జగన్ కు ముకుతాడు వేయగలిగేది ప్రస్తుతం న్యాయవ్యవస్థ మాత్రమేనని ఆర్కే తేల్చి చెప్పేశారు. అంటే .. పాపం.. తాము నమ్ముకున్న చంద్రబాబు కూడా జగన్ ను ఏమీ చేయలేకపోతున్నారనే అసంతృప్తి ఆ రాతల్లో అడగడుగునా కనిపిస్తోంది. చంద్రబాబుతో పాటు రాధాకృష్ణ కూడా చివరకు న్యాయ స్థానాన్నే నమ్ముకుని ఆశలు పెట్టుకుంటున్నట్టు ఆ రాతల్లో వ్యక్తమవుతోంది.

 

 

ఇదే సమయంలో అధికారుల తీరుపై రాధాకృష్ణ మండిపడ్డారు. పాలకుల మెప్పుకోసం చొక్కాలు చించుకుంటున్న అధికారులు, ముఖ్యంగా పోలీసులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి ఎదురైన దుస్థితిని గుర్తుపెట్టుకోవడం మంచిదని హెచ్చరిస్తున్నారు. అతిగా ప్రవర్తించే అధికారులకు ఏదో ఒక రోజు శిక్షపడటం ఖాయమని గత ఉదంతాలు రుజువు చేస్తున్నాయంటున్నారు. ఏపీ అధికారులలో ఇప్పటికైనా కనువిప్పు కలుగుతుందో లేదో వేచిచూద్దామని ఆశావాదం వినిపించారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: