లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్ లోని ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉండిపోయినా కరోనా వైరస్ సమస్య మాత్రం  చంద్రబాబునాయుడును వదిలిపెట్టేలా లేదు. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, చిన్న పిల్లలు  వైరస్ సమస్య నుండి వీలైనంత దూరంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్ధ నుండి నిపుణులు వరకూ పదే పదే చెబుతున్నారు. ఈ కారణంగానే చంద్రబాబు ఇప్పటికే దాదాపు 65 రోజులుగా జనజీవన స్రవంతికి దూరంగా ఉన్నాడు. చివరకు గుంటూరు జిల్లాలోని తాడేపల్లి లో ఉన్న కరకట్టమీదకు చేరుకున్నాడు.

 

అదికూడా 27వ తేదీ నుండి ఆన్ లైన్లో  మహానాడు కార్యక్రమాన్ని జరుపుకోవాలని డిసైడ్ చేశాడు కాబట్టే తప్పని పరిస్దితుల్లో కరకట్టకు చేరుకున్నాడు. కరోనా వైరస్ కారణంగా మహానాడు రద్దు చేసుకున్నా ఎవరూ తప్పు పట్టేవారు లేరు. కానీ విచిత్రంగా ఉంది జూమ్ యాప్ ద్వారా వెబినార్ లో మహానాడు నిర్వహించాలని డిసైడ్ చేయటంతో నేతలందరూ ఆశ్చర్యపోయారు. కొంత కాలానికి వైరస్ తీవ్రత తగ్గినా చంద్రబాబుకు మాత్రం వైరస్ ప్రమాదం పొంచి ఉందన్నది వాస్తవం. ఎందుకంటే చంద్రబాబు వయస్సు ఇపుడు 71.

 

వయస్సు ప్రభావం కారణంగానే చంద్రబాబు మునుపటిలా జనాల్లో తిరిగేందుకు లేదు. ఎందుకంటే గతంలోలా ప్రతిరోజూ జనాలను కలుస్తుంటే ఏ రూపంలో వైరస్ ప్రమాదం వచ్చి మీదపడుతుందో ఎవరూ చెప్పలేరు. చంద్రబాబు దగ్గరకు వచ్చే జనాలందరికీ ముందుగా  స్క్రీనింగ్ టెస్టులు జరపటం సాధ్యంకాదు. దాంతో వైరస్ సోకిన వ్యక్తి వల్ల ఇతరులకు, ఇతరుల్లో ఎవరినుండైనా చంద్రబాబుకు వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంది.  అక్రమంగా నిర్మించిన కరకట్ట నివాసంలోనే ఉన్నా, బయట పర్యటనలు చేసినా సమస్య అయితే తప్పదు.

 

అందుకనే జనాలను కలిసే విషయంలో ఏమి చేయాలో ఇపుడు చంద్రబాబుకు అర్ధం కావటం లేదు. వైరస్ భయంతో ఎంతకాలమని జనాల్లోకి వెళ్ళకుండా ఓ పొలిటీషియన్ అందులోను చంద్రబాబు లాంటి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఉండగలడు ? వైరస్ భయంతో బయటకు  వెళ్ళకుండా ఉండిపోతే జనాలతో సంబంధాలు తెగిపోవటం ఖాయం. అందులోను పార్టీ పరిస్ధితి చాలా దయనీయంగా ఉందిపుడు. ఏదో కొంతలో కొంత నయం అన్నట్లుగా ఎల్లోమీడియా జాకీలేసి లేపుతోంది కాబట్టి చంద్రబాబుకు ఈమాత్రమన్నా ప్రచారం దొరుకుతోంది.

 

మొన్నటి ఎన్నికల్లో జగన్ కొట్టిన దెబ్బ చంద్రబాబుకు మామూలుగా తగలలేదు. ఒక్క చంద్రబాబుకే కాదు యావత్ ప్రతిపక్షాలన్నింటినీ ఒకే దెబ్బకొట్టి మూల పడేశాడు. కాకపోతే ప్రతిపక్షాలన్నీ ఇపుడు కేవలం ఉనికి కోసమే పోరాటం చేస్తున్నాయన్న విషయం జనాలకు కూడా తెలుసు. అందుకనే వాటల్లో దేనినీ జనాలు లెక్క చేయటం లేదు. అంతో ఇంతో జనాధరణ ఉన్నది చంద్రబాబు, టిడిపికి మాత్రమే. దానికి కూడా కరోనా వైరస్ రూపంలో దెబ్బ పడుతుందేమో అనే టెన్షన్ చంద్రబాబులో పెరిగిపోతోంది. మరి ఈ సమస్య నుండి చంద్రబాబు బయటపడి టిడిపిని ఎలా బయటపడేస్తాడో చూడాల్సిందే

మరింత సమాచారం తెలుసుకోండి: