ఏపీలో అధికార వైసీపీకి గ‌త కొద్ది రోజులుగా కోర్టుల నుంచి వ‌రుస షాకులు త‌గులుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే హైకోర్టు వైసీపీ ఎంపీతో పాటు మాజీ ఎమ్మెల్యేల‌కు నోటీసులు జారీ చేస్తూ మ‌రో ట్విస్ట్ ఇచ్చింది. కొద్ది రోజుల క్రితం విశాఖ జిల్లాలోని న‌ర్సీప‌ట్నంలో డాక్ట‌ర్ సుధాక‌ర్‌ను పోలీసులు బ‌హిరంగంగానే కొట్టిన‌ట్టు ఆరోప‌ణ‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే మెజిస్ట్రేట్ ఇచ్చిన నివేదిక‌తో పాటు అటు ప్ర‌భుత్వం ఇచ్చిన నివేదిక‌ల‌ను స‌రి పోల్చి చూసిన‌ప్పుడు రెండు నివేదిక‌లు వేర్వేరుగా ఉన్నాయ‌ని. ప్ర‌భుత్వం ఇచ్చిన నివేదిక‌లో డాక్ట‌ర్ సుధాక‌ర్ కు గాయాలు లేవ‌ని చెప్పార‌ని.. కానీ మెజిస్ట్రేట్ నివేదిక‌లో గాయాలున్నాయ‌ని అభిప్రాయ ప‌డిన కోర్టు ..ఈ కేసును సీబీఐకీ అప్ప‌గించాల‌ని కూడా స్ప‌ష్టం చేసింది.

 

దీనిపై వైసీపీ సానుభూతి ప‌రుల‌తో పాటు వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు కొంద‌రు కోర్టు అభిప్రాయాన్నే త‌ప్పు ప‌ట్ట‌డంతో పాటు కోర్టులు ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్ల న్యాయ వ్య‌వ‌స్థ‌పై న‌మ్మ‌కం కోల్పోయిన‌ట్టు అవుతుంద‌ని కూడా విమ‌ర్శ‌లు చేశారు. మ‌రి కొంద‌రు కోర్టు అభిప్రాయాన్ని తీవ్రంగా విబేధించ‌డంతో పాటు త‌ప్పుప‌ట్టారు. మ‌రి కొంద‌రు సోష‌ల్ మీడియాలో కోర్టునే త‌ప్పు పడుతూ పోస్టులు పెట్టారు. ఇవి బాగా వైర‌ల్ అయ్యాయి. దీంతో కోర్టు న్యాయాస్తానాల‌పై పోస్టులు పెట్టిన వారితో పాటు కౌంట‌ర్లు వేసిన వారిపై కేసును సుమోటోగా స్వీక‌రించింది. 

 

అలాగే న్యాయ‌స్థానాల‌పై వివాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రికాద‌ని అభిప్రాయ ప‌డిన కోర్టు అటు వైసీపీ ఎంపీ నందిగం సురేష్ తో పాటు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహ‌న్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఏదేమైనా కోర్టు తీర్పుకు వ్య‌తిరేకంగా త‌మ అభీష్టాన్ని వెల్ల‌డించిన నందిగంతో పాటు ఆమంచికి నోటీసులు జారీ చేయ‌డం వీళ్ల‌కు ఎదురు దెబ్బే అనుకోవాలి. వీరిద్ద‌రితో పాటు న్యాయ‌స్థానాల‌ను కించ‌ప‌రుస్తూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టిన మొత్తం 49 మందికి నోటీసులు జారీ చేసింది. 

 

న్యాయ‌మూర్తుల‌ను, జ‌డ్జిల‌ను కించ‌ప‌రుస్తూ సోష‌ల్ మీడియాలో పోస్టులు ఎలా ?  పెడ‌తార‌ని కూడా ప్ర‌శ్నించింది. న్యాయ‌మూర్తుల‌పై వ్యాఖ్య‌ల‌ను హైకోర్టు సుమోటోగా తీసుకుంది. అలాగే ఈ కేసులో త‌దుపరి విచార‌ణ మూడు వారాల‌కు వాయిదా వేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. అయితే నందిగం సురేష్ తో పాటు ఆమంచితో పాటు 49 మందికి కౌంట‌ర్ ఫిల్ దాఖ‌లు చేసుకునేందుకు, త‌మ అభిప్రాయం కోర్టులో వెల్ల‌డి చేసేందుకు అవ‌కాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: