నిజంగా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే  చంద్రబాబునాయుడు తన పరువును తానే తీసేసుకుంటున్నాడు. తాజాగా చంద్రబాబు పరువు విజయనగరం మూడు లాంతర్ల స్తంభం సెంటర్లో పరిచేశాడు. మూడు లాంతర్ల స్తంబాన్ని ప్రభుత్వం తీసేసింది. దాంతో మాజీ మంత్రి, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు గోల మొదలుపెట్టాడు. రాజుగారికి మద్దతుగా చంద్రబాబు కూడా యాగీ మొదలుపెట్టేశాడు. తీరా చూస్తే రాజుగారి సోదరుడు ఆనంద్ గజపతిరాజు కూతురు సంచియితా గజపతిరాజు  ఇద్దరి గాలినీ ఒకేసారి తీసేసింది.

 

విజయనగరంలో మూడు లాంతర్ల స్తంభం అంటే అదేదో పూసపాటి రాజవంశం నిర్మించిన చారిత్రక కట్టడంగానో లేకపోతే గజపతులు చేసిన యుద్ధంలో ఏర్పాటు చేసిన స్ధూపంలాగో అశోక్ ఫీలైపోతున్నాడు. మూడు లాంతర్ల స్తంభాన్ని తీసేసి ప్రభుత్వ యంత్రాంగం పక్కన పెట్టేసింది. దాంతో అశోక్ గోల మొదలుపెడితే ముందు వెనక చూసుకోకుండా అశోక్ కోసమని చంద్రబాబు కూడా నేతలతో చెప్పి గోల చేయిస్తున్నాడు. ఇంతా చేస్తే మూడు లాంతర్లన్నది చారిత్రతక కట్టడం కానేకాదు. కనీసం జరిగిన యుద్ధానికి సంబంధించిన స్ధూపం కూడా కాదు. అదొక నిర్మాణం మాత్రమే.

 

పట్టణ సుందరీకరణలో భాగంగా యంత్రాంగం మూడు లాంతర్ల స్తంభం ఉన్న ప్రాంతాన్ని కూడా డెవలప్ చేద్దామని అనుకున్నది. ఈ విషయాన్ని మొన్నటి ఫిబ్రవరి 16వ తేదీనే జిల్లా యంత్రాంగం ప్రకటించారు. జరుగుతున్న పనుల్లో భాగంగా స్తంభాన్ని తవ్వి తీసి భద్రపరిచారు. ఈ ప్రాంతమంలో సుందరీకరణ పనులు అయిన తర్వాత మళ్ళీ ఇపుడు తీసిన ప్రాంతంలోనే ఏర్పాటు చేయబోతున్నారు. వాస్తవం ఇదైతే రాజుగారు మాత్రం ఓవర్ యాక్షన్ చేసి వాస్తవం చెప్పకుండా చంద్రబాబును కూడా రంగంలోకి దింపారు.

 

ఇదే విషయాన్ని అశోక్ గజపతిరాజు సోదరుడు ఆనంద్ గజపతిరాజు కూతురు సంచయిత గజపతిరాజు ఇటు చంద్రబాబు అటు పెద్దనాన్న గాలి తీసేసింది. తన బాబాయ్ మూడు లాంతర్ల స్తంభం విషయంలో తప్పుదోవ పట్టించినట్లు చంద్రబాబుకు సంచయిత ట్విట్టర్ వేదికగా తలంటింది. తన బాబాయ్ మాటలు విన్న చంద్రబాబు కూడా ఈ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు మండిపడింది. పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి కాబట్టే మూడు లాంతర్ల స్తంభాన్ని తీసినట్లు ఆమె చెప్పారు. పనులు పూర్తి కాగానే మళ్ళీ స్తంభాన్ని తీసిన చోటే పెడతారని కూడా స్పష్టం చేసింది.

విజయనగరం చరిత్రకు, సంస్కృతికి ప్రతీకగా 1869 నాటి మోతీమహల్ ను ఎందుకు ధ్వసం చేశారో ముందు చెప్పాలంటూ బాబాయ్ అశోక్ ను నిలదీసింది. మోతామహల్ ను ధ్వంసం చేయటానికి ఎలా అనుమతిచ్చారంటూ చంద్రబాబును కూడా ప్రశ్నించింది. తాతగారైన పివిజీ రాజు వారసత్వాన్ని బాబాయ్ ఎందుకు కాపాడలేకపోయాడో ముందు సమాధానం చెప్పాలని సంచయిత వేసిన ప్రశ్నకు ముందు అశోక్ తర్వాత చంద్రబాబు సమాధానం చెబుతారా ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: