ఏపీని పాలించిన ముఖ్యమంత్రుల్లో మర్రి చెన్నారెడ్డికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అప్పట్లో ప్రధాని ఇందిరాగాంధీని కూడా లెక్క చేయకుండా ధిక్కరించిన రెబల్ క్యారెక్టర్ మర్రి చెన్నారెడ్డి. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ కూడా రెబల్ క్యారెక్టర్లో తక్కువేమీ కాదు కదా. ఏకంగా పార్టీ హైకమాండ్ సోనియా గాంధీనే లెక్కచేయకుండా సొంత పార్టీ పెట్టుకుని సత్తా చాటిన నాయకుడు జగన్. అంటే గట్స్ విషయంలో చెన్నారెడ్డికీ, జగన్ మోహన్ రెడ్డికీ పోలిక ఉందన్నమాట.

 

 

అయితే గట్స్ విషయంలోనే కాదు మరో విషయంలోనూ ఈ ఇద్దరికీ పోలిక ఉంది. అప్పట్లో మర్రి చెన్నారెడ్డి కాలంలోనే.. మద్రాసులో స్థిరపడిన తెలుగు సినీ పరిశ్రమ ఏపీకి తరలి వచ్చింది. ఇందుకు చెన్నారెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. హైదరాబాద్ లో నిర్మాతలకు చాలా తక్కువ ధరకే పెద్ద ఎత్తున భూములు ఇచ్చారు. దాని ఫలితంగానే హైదరాబాద్ లో సినీ పరిశ్రమ స్థిరపడింది. ఇప్పుడు ఏపీ విడిపోయిన నేపథ్యంలో జగన్ కూడా ఇలాంటి చొరవ తీసుకోవాలంటున్నారు సినీ నిర్మాతలు.

 

 

ఏపీలో చిత్ర పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని తెలుగు నిర్మాతల మండలి ముఖ్యమంత్రిని కోరుతోంది. ఏపీలో నిర్మాతలకు స్టూడియోలు, ల్యాబ్స్ నిర్మించుకునేందుకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతోంది. అంతే కాదు సినీ పరిశ్రమ వర్గాలకు ఇళ్ల కోసం స్థలాలను కేటాయించాలని విన్నవించింది. ఇప్పటికే.. జీవో నంబర్ 45 ద్వారా రాష్ట్రంలో షూటింగులు చేసుకోవడానికి ప్రభుత్వ ప్రాంగణాలను ఉచితంగా అందించేందుకు ఆదేశాలిచ్చిన నిర్మాతల మండలి థ్యాంక్స్ చెప్పింది.

 

 

మరి ఇప్పుడు జగన్ కూడా ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందేందుకు భారీగా భూములు ఇస్తారా అన్నది చూడాలి. అందులోనూ జగన్ విశాఖను రాజధానిగా చేసుకుంటున్నారు. విశాఖ సినీ పరిశ్రమకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మరి జగన్ తలచుకుంటే విశాఖకు సినీపరిశ్రమను తీసుకెళ్లడం కూడా అంత కష్టంకాబోదు. చూడాలి ఏం జరుగుతుందో..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: