విశ్వ విఖ్యాత నట సార్వ భౌమ స్వర్గీయ నందమూరి ఎన్టీఆర్ అనే మహానుభావుడు, రాజకీయ ఉద్దండుడు జన్మించిన రోజు ఇది (మే 28 ). అసలు ఎన్టీఆర్ అంటేనే ఒక బ్రాండ్ అన్నట్టుగా, అటు సినిమాల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ తిరుగులేకుండా చక్రం తిప్పగలిగాడు. సినిమాల నుంచి రాజకీయాల్లోకి ఎన్టీఆర్ అడుగు పెట్టడమే ఒక సంచలనం. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల కాలంలోనే అధికారంలోకి రావడం అంటే ఆషామాషీ కాదు. కానీ తిరుగులేని మెజార్టీతో రాజకీయాల్లో ఎన్టీఆర్ తనను తాను నిరూపించుకున్నాడు. అంతే కాదు అటు సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ ఇప్పటికీ ఒక రోల్ మోడల్ గా ఎన్టీఆర్ నిలిచిపోతారు. ఇక విషయానికి వస్తే, ఎన్టీఆర్ చివరి రోజుల్లో రాజకీయంగా ఎంతో క్షోభ అనుభవించారు. తన అని ఎవరినైతే నమ్ముకున్నారో వారి చేతుల్లోనే వెన్నుపోటుకి గురయ్యారు. మానసిక క్షోభతోనే చివరకి మరణించారు అనేది నిజం. 

 

IHG

అసలు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచింది ఎవరు అని సామాన్య జనాన్ని అడిగినా వెంటనే చెప్పే పేరు చంద్రబాబు. పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన వీరుడు చంద్రబాబు అనే అపఖ్యాతి నెత్తిన పెట్టుకునే చంద్రబాబు తిరుగుతున్నారు. ఆ మచ్చ ఎన్ని మందులు రాసిన పోయేది అయితే కాదు. అయినా బాబు మాత్రం ఆ మచ్చ చెరుపుకునేందుకే ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు జరిగే మహానాడు లోనూ ఎన్టీఆర్ ప్రస్తావన తెస్తూనే కార్యక్రమాన్ని మొదలు పెట్టాల్సిన పరిస్థితి. అసలు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు మాత్రమేనా ..? ఇంకెవరూ లేరా ? అంటే చాలామంది పేర్లే బయటకి వస్తాయి. కాకపోతే వారంతా తెర వెనుక పాత్రదారులుగా ఉండడడం, తెర ముందు చంద్రబాబు ఒక్కడే ఉండడంతో ఆయన ఒక్కడి పేరే వెన్నుపోటు రాజకీయంలో మారుమోగింది.   

 

IHG

తనకు వెన్నుపోటు పొడుస్తారు అనే విషయం ఎన్టీఆర్ కు పొడిపించుకునే వరకు తెలియనే తెలియదు. తెలుసుకునే లోపు సీఎం కుర్చీ తన అల్లుడు చంద్రబాబు చేతికి వెళ్ళిపోయింది. అప్పటి వరకు తాను కనిపిస్తే పూల వర్షం కురిపిస్తూ, వంగి వంగి నమస్కారాలు పెట్టిన వారంతా ఒక్కసారిగా తనపై చెప్పులు వేయడం ఎన్టీఆర్ తట్టుకోలేకపోయారు. నమ్మి పిల్లని ఇచ్చినందుకు తనకు తగిన శాస్తి చేశాడని ఎన్టీఆర్ కుమిలిపోయాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న చంద్రబాబుని తెలుగుదేశం పార్టీలో చేరేందుకు అవకాశం అవకాశం ఇచ్చి అతి పెద్ద తప్పు చేసాను అని ఎన్టీఆర్ కాస్త ఆలస్యంగా గుర్తించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అసలు చంద్రబాబు ని చేర్చుకునే ముందే ఎన్టీఆర్ కూడా ఆలోచనలో పడ్డారు. దీనికి ఒకరిద్దరు నాయకులు కూడా అభ్యంతరం తెలిపారు. ఆఖరికి చేర్చుకునేందుకు ఎన్టీఆర్ మొగ్గుచూపారు.

 

IHG

 

 ఇక పార్టీలో చేరిన చంద్రబాబు అన్నీ తానే వ్యవహరిస్తూ మామకు చేదోడు వాదోడుగా ఉంటూ రాజకీయ వారసునిగా చలామణి అయ్యేందుకు ప్రయత్నించారు. అలా అనుకోవడమే తరువాయి పార్టీలు తనదైన శైలిలో ముద్ర వేసేందుకు ఒక్కో అడుగు తమకు అనుకూలంగా మార్చుకుని చంద్రబాబు మొత్తానికి పార్టీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. తన అల్లుడు పార్టీలో ఈ విధంగా గుర్తింపు తెచ్చుకోవడం ఎన్టీఆర్ కు సంతోషాన్ని ఇచ్చింది. రాజకీయ శిక్షణ పేరుతో పార్టీలో ఉన్న అందరికీ చంద్రబాబు బాగా దగ్గరయ్యారు. అలాగే నాదెండ్ల భాస్కర్ రావు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన సమయంలోనూ చంద్రబాబు ఎన్టీఆర్ తరఫున గట్టిగానే క్యాంపులు నిర్వహణ వంటివి దగ్గరుండి చూసుకున్నారు. 

 

IHG

ఎన్టీఆర్ కు అండగా నిలిచారు. అలాగే వెంకయ్యనాయుడు, రామోజీరావు, కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఇతర ప్రజాస్వామ్య శక్తులు అన్నిటినీ ఎన్టీఆర్ కు అనుకూలంగా మార్చి మద్దతుగా కూడగట్టడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. దీంతో నాదెండ్ల భాస్కర్ రావు పదవి కోల్పోవటంతో పాటు అసెంబ్లీ రద్దు అవ్వడం, ఆ తర్వాత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం, చంద్రబాబు క్రెడిట్ ఎన్టీఆర్ గుర్తించడంతో పార్టీలో మరింత పట్టు పెంచుకున్నారు చంద్రబాబు. ఎన్టీఆర్ రాజకీయ వారసునిగా తాను తప్ప మరెవరూ లేరని, చంద్రబాబు ఊహించుకున్నారు. 

 

IHG

 

 అకస్మాత్తుగా లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితం లోకి రావడంతో ఒక్కసారిగా పరిస్థితులు తారుమారు అయినట్లు చంద్రబాబుకు అనిపించింది. దానికి తగ్గట్టుగానే లక్ష్మీపార్వతి కూడా పార్టీలో పెత్తనం చేసేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ఇవన్నీ చంద్రబాబు నచ్చేది కాదు. దీంతో అసలు వ్యూహానికి చంద్రబాబు తెరతీశారు. ముందుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి లలో లక్ష్మీపార్వతి పై వ్యతిరేక కథనాలు వచ్చే విధంగా చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. ఆ ప్రకారం ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి కి సంబంధించి  అత్యంత రహస్యమైన విషయాలు కూడా ఆంధ్రజ్యోతి, ఈనాడు లో ప్రచురితం కావడం వంటివి ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి ఇద్దరినీ షాక్ కి గురిచేసేది.

 

IHG's Suitcases Episode? | Gulte - Latest ...

 చంద్రబాబు ఆ రేంజ్ లో నెట్ వర్క్ నడుపుతూ వారి విషయాలను రాబడుతు ఉండేవారు. ఇది ఇలా ఉండగానే ఎన్టీఆర్ ఉత్తరాంధ్ర పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సమయంలో హైదరాబాద్ వైస్రాయ్ హోటల్ వేదికగా చంద్రబాబు వెన్నుపోటు కార్యక్రమం మొదలైంది. దీనికి ప్రధాన దర్శకులుగా ఈనాడు రామోజీ , ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఉండడమే కాకుండా, ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా చంద్రబాబు ని ముందుపెట్టి కథను నడిపించడంలో వీరంతా సక్సెస్ అయ్యారు. ఎమ్మెల్యేలంతా చంద్రబాబు శిబిరంలోకి వచ్చేస్తున్నారు అన్నట్లుగా ఈ రెండు పత్రికల్లో వార్తలు రావడం, మిగతా ఎమ్మెల్యేల అందరిలోనూ ఆందోళన చెలరేగడం, వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. 

 

IHG

ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను కూడా దీనికి ఒప్పించడం హరికృష్ణ, బాలకృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ని కూడా ప్రలోభ పెట్టడం, లక్ష్మీపార్వతి కి వ్యతిరేకంగా ఇదంతా చేస్తున్నామని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను  నమ్మించడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. దీనికి తగినట్లుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి లలో పెద్దఎత్తున ఎమ్మెల్యేల మద్దతు చంద్రబాబు వచ్చేసింది, అతికొద్ది మంది ఎమ్మెల్యేలు తప్ప మిగతా వారంతా చంద్రబాబు శిబిరంలోనే ఉన్నారని ప్రత్యేక కథనాలు వెలువరించడం వంటి వాటితో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. నిజంగానే అప్పటికి చంద్రబాబు పక్కన ఎవరూ లేక పోయినా, ఉన్నట్టుగా ఈనాడు, ఆంధ్రజ్యోతిలలో కథనాలు రావడంతో ఒక్కసారిగా ఎమ్మెల్యేలంతా చంద్రబాబు శిబిరంలో కి వచ్చి చేరిపోయారు.

IHG

ఈ విషయాన్ని చాలా ఆలస్యంగా తెలుసుకున్న ఎన్టీఆర్ వైస్రాయ్ హోటల్ ముందుకు వచ్చి మైక్ ద్వారా ఎమ్మెల్యేలు బయటకు రావాల్సిందిగా కోరడం, వెంటనే ఆయన పై చెప్పుల వర్షం కురవడం అన్నీ వెంటవెంటనే జరిగిపోయాయి. చంద్రబాబు చేసిన మోసానికి ఎన్టీఆర్ నిత్యం కుమిలిపోతూనే తన ఆఖరి రోజు వరకు గడిపారు. ఈ ఎపిసోడ్ లో ఎన్టీఆర్ చివరి క్షణం వరకు ఆయన వెంట నడిచింది లక్ష్మీపార్వతి మాత్రమే. ఈ వ్యవహారంలో లక్ష్మీపార్వతిని విలన్ గా చూపించడంలో ఇప్పటి ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ పాత్ర చాలానే ఉందట. అలాగే ఎన్టీఆర్ ను పదవి నుంచి దించడానికి, ప్రధాన సూత్రధారి దర్శకుడు ఈనాడు రామోజీ రావు అన్న విషయం చాలా మందికి తెలియదు. చంద్రబాబును ముందు పెట్టి వీరంతా తెరవెనక కథను నడిపించడంలో సక్సెస్ అయ్యారు. కానీ ఈ ఎపిసోడ్ లో చంద్రబాబు ఒక్కరే విలన్ గా మిగిలిపోగా, మిగతా విలన్లు అంతా తెర వెనక్కి పరిమితం అయిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: