`భ‌ర‌త్ అనే.. నేను..` అంటూ పార్ల‌మెంటు స‌భ్యుడిగా వైసీపీ యువనేత‌, బీసీల ఆశాజ్యోతి, బ‌హుముఖ ప్రజ్ఞావంతుడు మార్గాని భ‌ర‌త్ రామ్‌ ప్ర‌మాణం చేసి.. ఏడాది కావొస్తోంది. సాధార‌ణంగా ఇత‌ర ఎంపీల మాదిరి గా.. భ‌ర‌త్ కూడా వ్య‌వ‌హ‌రించి ఉంటే.. ఇప్పుడు ఆయ‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిన అవ‌స‌రం ఉండేది కాదు. కానీ, భ‌ర‌త్ రామ్ స్ట‌యిల్ వేరు. ఆయ‌న ఎక్కిన నిచ్చెన మెట్లు వేరు. ఆయ‌న వ్యూహాలు వేరు. ఆయ‌న‌కున్న లక్ష్యాలు వేరు. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే.. మార్గాని భ‌ర‌త్ విజ‌నే వేరు!! ఉన్న‌త కు టుంబంలోనే జ‌న్మించిన‌ప్ప‌టికీ.. బ‌డుగు జీవుల బాధ‌లు తెలిసిన వ్య‌క్తిగా ముందు భ‌ర‌త్ మ‌న‌కు ప‌రిచ‌యం అవుతారు.

IHG

తండ్రిచాటు త‌న‌యుడుగా కాదు..
అదే స‌మ‌యంలో క‌ళాభిరుచి ఉన్న క‌ళాకారుడుగా, ఫ్యాష‌న్ ప్ర‌పంచంలో త‌ళుక్కున మెరిసిన మిస్ట‌ర్ సౌ త్‌గా ఆయ‌న ఫ్యాష‌న్ ప్రియుల మ‌దిని దోచిన సంద‌ర్భాలు అనేకం. అదే స‌మ‌యంలో బీసీ కుటుంబం నుంచి వ‌చ్చి.. స‌మాజంలో అనేక ఉత్థాన ప‌త‌నాలు చ‌విచూసిన వ్య‌క్తిగా కూడా మార్గాని మ‌న‌కు క‌నిపిస్తారు. రాజ‌కీయాల్లోకి రాక‌ముందు.. వ‌చ్చిన త‌ర్వాత‌.. అనే రెండు కోణాలుగా భ‌ర‌త్ రామ్ మ‌న‌కు అగుపిస్తారు. ఈ రెండు కోణాల్లోనూ ఆయ‌న స్ట‌యిల్ సో..డిఫ‌రెంట్‌. బీసీ సంక్షేమ సంఘం చైర్మ‌న్‌ మార్గాని నాగేశ్వ‌ర‌రావు త‌న‌యుడిగా కంటే.. త‌న స్వ‌శ‌క్తితో ఎదిగిన కృషీ వ‌లుడిగా గుర్తింపు సాధించేందుకే భ‌ర‌త్‌రామ్ ప్ర‌య‌త్నించారు.

IHG

ఫ్యాష‌న్ ప్ర‌పంచం నుంచి...
రాజ‌కీయాల్లోకి రాక‌ముందు.. ఆయ‌న దృష్టి మొత్తం.. ఫ్యాష‌న్ ప్ర‌పంచంమీదే ఉంద‌నే విష‌యం తెలిసిందే. మిస్ట‌ర్ ఆంధ్ర వంటి కాంపిటీష‌న్‌ల‌లో పాల్గొన‌డ‌మే కాకుండా.. మిస్ రాజ‌మండ్రి, మిస్ ఆంధ్ర వంటి కాంపిటీష‌న్‌ల‌లో ఆయ‌న జ‌డ్జిగా కూడా పార్టిసిపేట్ చేశారు. అటు నుంచే ఆయ‌న ప్ర‌స్థానం.. సినీ రంగం వైపు మ‌ళ్లింది. `ఓయ్ నీతో` అనే సినిమాలో హీరోగా కూడా చేసి సినీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. అలాంటి హీరో.. రెండో సినిమా ప్ర‌య‌త్నాల్లో ఉన్న స‌మ‌యంలో అది కూడా రెండో మూవీకి సైన్ చేసిన సంద‌ర్భం లో.. అనూహ్యంగా రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టారు. నిజానికి ఈ ప‌రిణామం.. భ‌ర‌త్ రామ్ ఊహించ‌నేలేదు. అలాగ‌ని వ‌చ్చిన అవ‌కాశాన్ని విడ‌వాల‌ని కూడా అనుకోలేదు. ఇదే ఆయ‌న కెరీర్‌ను ఒక్క‌సారిగా మ‌లుపు తిప్పింది.

IHG

జ‌గ‌న్ దృష్టిలో అలా..
ఇప్పుడు రాజ‌మండ్రిలో ఏ మూల విన్నా.. మార్గాని పేరు మార్మోగుతోంది. నేనున్నానంటూ.. ఆయ‌న అందించే ఆప‌న్న హ‌స్తం గురించే ప్ర‌తి ఒక్క‌రూ మాట్లాడుకుంటున్నారు. ప్రార్ధించే పెద‌వుల క‌న్నా.. సాయం చేసే చేతులు మిన్న అని గ‌ట్టిగా విశ్వ‌సించిన నాయ‌కుల్లో యువ నేత మార్గాని భ‌ర‌త్‌. గ‌త ఏడాది ఎన్నిక ‌ల్లో రాజ‌మండ్రి పార్లమెంటు స్థానాన్ని బీసీల‌కు కేటాయిస్తామ‌ని.. పాద‌యాత్ర స‌మ‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలోనే బీసీ సంక్షేమ సంఘం చైర్మ‌న్ నాగేశ్వ‌ర‌రావుకు ఇవ్వాల‌ని అనుకు న్నారు. అయితే బీసీల్లో బ‌ల‌మైన సామాజిక వ‌ర్గంతో పాటు ఉన్న‌త విద్యావంతుడు, యువ‌కుడు అయిన మార్గాని భ‌ర‌త్ అయితేనే బెట‌ర్ అని జ‌గ‌న్ భావించారు. ఆ వెంట‌నే కెమెరాకు క‌ట్ చెప్పి.. జెండా భుజాన వేసుకున్నారు భ‌ర‌త్‌.

IHG

ఆది నుంచి ప్రజాసేవ‌లో..
మార్గానిలో ఇంత ప్ర‌జాసేవ రావ‌డానికి కార‌ణ‌మేంటి? అనిఒక్క‌సారి ప‌రిశీలిస్తే.. ఆయ‌న తాత‌గారి నుంచి కుటుంబం మొత్తం ప్ర‌జాసేవ‌లోనే ఉంటున్నారు. మునిస‌ప‌ల్ క‌మిష‌న‌ర్‌గా ప‌నిచేసిన మార్గాని రామారావు రాజ‌మండ్రిలో ప్ర‌జ‌ల‌కు అనేక రూపాల్లో సేవ‌లు అందించారు. రాజ‌మండ్రిలోని కీల‌క‌మైన కోట‌గు మ్మం ర‌హ‌దారిని వెడ‌ల్పు చేశారు. అనేక మందిని చ‌దివించారు. త‌ర్వాత మార్గాని తండ్రి.. నాగేశ్వ‌ర‌రావు రాష్ట్ర బీసీ ప్ర‌జ‌ల గ‌ళం అయ్యారు. వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో దూకుడు ప్ర‌ద‌ర్శించారు. ఇలా ప్ర‌జా సేవ‌ను ర‌క్తంలోనే పంచుకుని పుట్టిన భ‌ర‌త్ రామ్‌.. నేడు రాజ‌మండ్రిలో సుస్థిర అభివృద్ధి దిశ‌గా అడుగులు వేస్తున్నార‌నేది వాస్తవం.

చెల్లెలు తోడుగా..
భ‌ర‌త్ రామ్‌కు ఆయ‌న ఆలోచ‌న‌లే కాదు.. కుటుంబంలోని ప్ర‌తి ఒక్క‌రూ అండ‌గా నిలిచారు. ఎన్నిక‌ల స మయంలో సోద‌రి జ్యోత్స్న అన్న‌య్య‌కు చేసిన ప్ర‌చారం అంతా ఇంతా కాదు. కొన్ని కొన్ని సార్లు నియోజ ‌క‌వ‌ర్గంలోని ప‌లు ప్రాంతాల్లోనే ఉండిపోయి.. త‌న అన్న‌య్య గెలుపు కోసం ఆమె చేసి కృషి న‌భూతో .. అ న్న విధంగా సాగింది.  ఇక‌, పార్టీలోని కీల‌క నేత‌ల‌తోనూ రామ్ క‌లిసి మెలిసి ముందుకు సాగ‌డంతో ఆయ‌న ‌కు ఆయ‌నే సాటి. స‌మాజంలో ఎంత చేశాం.. అనే క‌న్నా.. ఎంత విన‌యంతో ఉన్నాం.. ఎంత మందికి మ‌నం ధైర్యం ఇచ్చాం.. అనే విష‌యాల‌ను ప్ర‌ధానంగా న‌మ్మే భ‌ర‌త్‌.. ప్ర‌జ‌ల‌కు చేరువలో ఉండ‌డంలోనూ .. సమాజ హితం కోసం ఉప‌యోగ ప‌డే కార్య‌క్ర‌మాలు చేయ‌డంలోనూ భిన్న‌మైన శైలిలో ముందుకు సాగు తున్నారన‌డంలో సందేహం లేదు.

IHG's W G <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=DISTRICT' target='_blank' title='district-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>district</a> @ysrcp_west_godavari_youth - <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=ELECTION COMMISSION' target='_blank' title='ec-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ec</a> ...

పార్ల‌మెంటులోనూ త‌న‌దైన ముద్ర‌
రాజ‌మండ్రి పార్ల‌మెంటు స్థానం అంటే.. విజ్ఞుల‌కు, మేధావుల‌కు పెట్టింది పేరు. ఇక్క‌డ నుంచి అనేక మంది మేధావులు, దూర‌దృష్టి ఉన్న‌వారు.. స‌మాజం హితం కోసం కృషి చేసిన‌వారు.. విజ‌యం సాధించారు. అలాంటి నియోజ‌క‌వ‌ర్గం నుంచి తొలిసారి అత్యంత పిన్న వ‌య‌స్కుడు.. పైగా ఫ్యాష‌న్ ప్ర‌పంచం నుంచి వ‌చ్చిన యువ‌కుడు పోటీ చేయ‌డం అంటే.. స‌హ‌జంగానే మేధావులు పెద‌వి విరుస్తారు. సంస్కృతి, సంప్ర దాయాల‌కు పుట్టినిల్ల‌యిన రాజ‌మండ్రిలో ఇలాంటి వారు ఏం ఉద్ధ‌రిస్తార‌నే వెర‌పు స‌హ‌జం. కానీ, ఇలాంటి వారికి విస్తు పుట్టేలా.. భ‌ర‌త్ రామ్ త‌న శైలిని క్ష‌ణాల్లో మార్చుకున్నారు. స్థానిక స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెట్టారు. అదేస‌మ‌యంలో పార్ల‌మెంటులోనూ ఆయా స‌మ‌స్య‌ల‌పై గ‌ట్టి గ‌ళం వినిపించారు.

IHG

మూడు భాష‌ల‌పై ప‌ట్టు..
తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ ల‌ను అన‌ర్గ‌ళంగా మాట్లాడే భ‌ర‌త్‌.. త‌న‌దైన శైలి ముందుకు సాగారు. ఈ క్ర‌మంలో నే పీఎంఏవై ప‌థ‌కంలో ఇళ్ల‌పై సౌక‌ఫ‌ల‌కాలు, వ‌ర్టిక‌ల్ గార్డెనింగ్‌, విద్యుత్ వాహ‌నాల ప్రోత్సాహం.. వంటి ద్వారా కాలుష్యాన్ని నివా రించే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న పార్ల‌మెంటులో చేసిన సూచ‌న‌లు  నిజంగా ఆచ‌ర‌ణ‌యోగ్యం. ఇక‌, సాధార‌ణంగా నేటి యువ‌త అంటే.. ఆధ్యాత్మిక రంగానికి చాలా దూరంగా ఉంటారు. కానీ, భ‌ర‌త్ రామ్ మాత్రం నిత్యం త‌నే స్వ‌యంగా పూజ‌లు చేయ‌డం, శ్రీసూక్తం, ఖ‌డ్గ‌మాలా స్త్రోత్రం, ఆదిత్య హృద‌యం వంటి పండితులు మాత్ర‌మే చేయ‌గ‌లిగే పూజ‌లు, ధ్యానాలు, స్త్రాత్రాలు చేయ‌డం వంటివి చూస్తే.. ఆధ్యాత్మిక రంగంపైనా, మ‌న సంస్కృతి, సంప్ర‌దాయాల‌పైనా ఉన్న ప‌ట్టు మ‌న‌కు అర్ధ‌మ‌వుతుంది.

IHG
 
జ‌గ‌న్ ద‌గ్గ‌రా మంచి మార్కులు
ఏరికోరి భ‌ర‌త్ రామ్‌కు ఎంపీగా అవ‌కాశం క‌ల్పించిన వైసీపీ అధినేత జ‌గ‌న్ ద‌గ్గ‌ర ఈ ఏడాది పూర్త‌య్యే స‌మ ‌యానికి మంచి మార్కులే ప‌డ‌డం గ‌మ‌నార్హం. స్థానికంగా ప్ర‌జ‌ల‌కుఅందుబాటులో ఉండడం, పార్టీలైన్ ప్ర ‌కారం న‌డుచుకోవ‌డం, వివాదా ల జోలికి పోకుండా త‌నదైన శైలిలో అంద‌రికీ క‌లుపుకొని పోవ‌డం, ప్ర‌తి ఒ క్క‌రి స‌మ‌స్య‌ను త‌న‌దిగా భావించ‌డం, అవినీతి, అల‌స‌త్వానికి తావు లేకుండా ముందుకు సాగ‌డం.. మ‌రీ ముఖ్యంగా పార్టీ అదినేత జ‌గ‌న్ ప్ర‌వ‌చించే మేనిఫెస్టోను.. కీల‌కంగా భావించడం, దీనిని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌డం ద్వారా.. పార్ల‌మెంటులో బ‌ల‌మైన గ‌ళం వినిపించ‌డం ద్వారా యువ ఎంపీగా జ‌గ‌న్ ద‌గ్గ‌ర భ‌ర‌త్‌మంచి మార్కులే వేయించుకున్నార‌న‌డంలో సందేహం లేదు. ఇదే హ‌వా మ‌రో నాలుగేళ్లు సాగితే.. రాజ‌మండ్రి సుస్థిర నేత‌గా ఎద‌గ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి: